శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Jan 24, 2020 , 04:51:38

విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
  • -కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా
  • -ఓట్ల లెక్కింపుపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌
  • -అధికారులకు సూచనలువికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలోని మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని, అదే విధంగా ఈ నెల 25న నిర్వహిం చే కౌంటింగ్‌ నిర్వహిస్తారని, దీనిని కూడా విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం వికారాబాద్‌ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో ఆర్డీవో లు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లతో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వికారాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాన్ని ఎస్‌ఏపీ కళాశాలలో, తాం డూరులోని సెయింట్‌ మేరినాట్స్‌ పాఠశాలలో, పరిగి, తాండూరు కౌంటింగ్‌  ప్రభుత్వ పాఠశాల ల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కౌంటింగ్‌ను శనివారం ఉదయం 8గంటలకు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. పద్ధతి ప్రకారంగా కౌం టింగ్‌ టెబుల్స్‌ ఏర్పాటు చేసుకొని, సెంటర్లలో విద్యుత్‌ ఏర్పాట్లతో పాటు సిబ్బందికి ఆహా రం, నీరు, మరుగుదొడ్ల ఏర్పా ట్లు చేయాలని సూచించారు. అన్ని కౌం టింగ్‌ సెంట ర్ల వద్ద జనరేటర్లు, సమకూర్చుకోవాలని సూచించారు. స్ట్రాంగ్‌ రూంలలో విద్యుత్‌  సరఫరా నిలిపివేయాలన్నా రు. బ్లాక్‌ బోర్డులు ఏర్పాటు చేసి కౌంటింగ్‌ వివరాలు ఎప్పటికప్పుడు రాయాలని తెలిపారు. కౌంటింగ్‌కు సం బంధించిన అన్ని స్టేషనరీ వస్తువులు సమకూర్చాలని అధికారులకు తెలియజేశారు. పోలింగ్‌ ఏజెం ట్లకు పాసులు వెంటనే అందజేయాలని తెలిపారు. మీడియా వారి కోసం ప్రత్యేక మీడియా హాలును ఏర్పాటు చేసి అందులో ఒక టీవీ ఏర్పా టు చేసి, దానిపై ఎప్పటికప్పుడు కౌంటింగ్‌ ఫలితాలను ప్రదర్శించాలన్నారు. కౌంటింగ్‌ హాలులో సెల్‌ఫోన్‌లను అనుమతించకూడదని సూచించారు. సెక్యూరిటీ సిబ్బందిని కూడా కౌంటింగ్‌ హాలులోకి అనుమతించకూడదన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు హైమావతి మాట్లాడుతూ రెవెన్యూ, మున్సిపల్‌  సిబ్బంది మున్సిపల్‌ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. కౌంటింగ్‌ నిర్వహించే ఎన్నికల సిబ్బంది ఎలాంటి వత్తిడిల కు గురికాకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అరుణకుమారి, డీఆర్‌వో మోతీలాల్‌, వికారాబా ద్‌, తాండూరు ఆర్డీవోలు ఉపేందర్‌రెడ్డి, వేణుమాదవ్‌రావులు, వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొ డంగల్‌ తహసీల్దార్లు, కమిషనర్లు పాల్గొన్నారు.


logo