బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jan 24, 2020 , 04:51:38

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
  • - పల్లెల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములయ్యే విధంగా అవగాహన కల్పించాలి
  • -రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బెన్హర్‌ మహేశ్‌దత్‌
  • - పూడూరు మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి పనుల తనిఖీ
  • - పనుల నిర్వహణపై సంతృప్తి


పూడూరు : గ్రామ పంచాయతీలు ఫ్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా మారాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ (ఐఎఎస్‌) బెన్హర్‌ మహేశ్‌ దత్‌ ఎక్క అన్నారు. గురువారం పూడూరు మండలం అంగడి చిట్టంపల్లి, మన్నెగూడ, నిజాంపేట్‌ మేడిపల్లి గ్రామ పంచాయతీలల్లో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను పరిశీలించారు. గ్రామ పంచాయతీలలోని సమస్యలను సర్పంచ్‌లను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీలోని నిధులు, ఖర్చులపై ఆరా తీశారు. గ్రామ ప్రజల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా మార్పు తీసుకురావాలని సూచించారు. అంగడిచిట్టంపల్లిలో బోరు వాటర్‌ను వేస్ట్‌ చేయకుకండా గ్రామస్తులు నీటిని పైప్‌లైన్‌ ద్వారా పశువుల కోసం ఓ కుంటలోకి వదల డంతో దానిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి గ్రామం లో నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు నిర్మించాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరు చేసేల చూడాలని అధికారులకు వివరించారు. నర్సరీల్లోని మొక్కలను సక్రమంగా పెంచి వాటిని నాటి సంరక్షించాలని సర్పంచ్‌లకు, అధికారులకు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పల్లెలన్ని  ప్రగతి పథంలో వెలుగాలని పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామాల అభివృద్ధిలో గ్రామస్తులను భాగస్వాములయ్యేలా అధికారులు, సర్పంచ్‌లు చూడలని చెప్పారు. నిజాంపేట్‌ మేడిపల్లిలో అండర్‌గ్రౌండ్‌డ్రైనేజీ చేయడంతో సర్పంచ్‌ను అభినందించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా వాడుకోవాలన్నారు. మురుగు కాల్వలను శుభ్రంగా ఉండే లా చూడలని తెలిపారు. వీరితో పాటు ఎంపీ పీ పుడుగుర్తి మల్లేశం, సర్పంచ్‌లు బి. జయమ్మ, పెంటమ్మ, ఉప సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీడీవో ఉషా, ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఈవోఆర్‌డీ పరంకృషరావు, పంచాయతీ కార్యదర్శులు మల్లేశం, సురేశ్‌, నాయకులు సీహెచ్‌ నర్సింహ, బి. రవి, చెన్నయ్య, పంచాయతీ వార్డు సభ్యులు ఉన్నారు.


logo