గురువారం 04 జూన్ 2020
Vikarabad - Jan 23, 2020 , 00:44:03

72.95%

72.95%
  • - ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్
  • - అత్యధికంగా కొడంగల్ 77.04శాతం నమోదు
  • - అత్యల్పంగా తాండూరులో 71.33శాతం
  • - 4 మున్సిపాలిటీల్లో 1,41,081 ఓట్లకుగాను పోలైన 1,02,924 ఓట్లు
  • - పోలీస్ ఎస్కార్ట్ స్ట్రాంగ్ చేరిన బ్యాలెట్ బాక్సులు
  • - 25న ఓట్ల లెక్కింపు, ఫలితాలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నాలుగు మున్సిపాలిటీల్లో 72.95శాతం పోలింగ్ నమోదైంది. ఆయా మున్సిపాలిటీల్లో 1,41,081 ఓట్లకు 1,02,924 పోలయ్యాయి. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ 8గంటల తర్వాతనే ప్రజలు ఓట్లు వేసేందుకు తరలి వచ్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జిల్లా పోలీస్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. ఎస్పీ నారాయణ, కలెక్టర్ ఆయేషా పలు స్టేషన్లను పరిశీలించి పోలింగ్ సరళిపై ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఓట్లు వేయడానికి వచ్చిన వృద్ధులు, వికలాంగుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిగి, వికారాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్ ఆనంద్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేటలో కలెక్టర్ ఆయేషా, సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో జేసీ అరుణకుమారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీల పరిధిలోని స్ట్రాంగ్ పోలీస్ బందోబస్తు నడుమ తరలించారు. 95వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. అధికారులు 25న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. 


జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి కొడంగల్ మున్సిపాలిటీల్లో ఎలాంటి సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 72.95 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా  కొడంగల్ మున్సిపాలిటీలో 77.04శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా తాండూర్ మున్సిపాలిటీలో 71.33శాతం పోలింగ్ నమోదదైంది. వికారాబాద్ మున్సిపాలిటీలో 74శాతం పోలింగ్ నమోదు కాగా పరిగి మున్సిపాలిటీలో 73.63శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 1,41,081మంది ఓటర్లుండగా, 1,02,924మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు-51,618(73.78 శాతం) మంది ఓటర్లు, మహిళలు-51,306(73.20 శాతం) మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


అయితే ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ నాలుగు మున్సిపాలిటీల్లోని మెజార్టీ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8గంటల తర్వాతనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు ఎన్నికలు జరిగిన వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల పరిధిలో 144సెక్షన్ అమలు చేయడంతో పాటు పెద్ద ఎత్తున పోలీసు భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఎలాంటి సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మరోవైపు పోలింగ్ ముగిసిన అనంతరం పోలీస్ ఎస్కార్ట్ నడుమ ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారులు గుర్తించిన స్ట్రాంగ్ బ్యాలె ట్ బాక్సులను తరలించారు. అదే విధంగా ఈ నెల 25న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. 


4మున్సిపాలిటీల్లో 72.95శాతం పోలింగ్ నమోదు

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 95వార్డులకు పోలింగ్ జరుగగా 72.95శాతం పోలింగ్ నమోదయ్యింది. వికారాబాద్ మున్సిపాలిటీలో 49,668ఓట్లకుగాను 36,753 ఓట్లు పోలుకాగా 74శాతం పోలింగ్ నమోదైంది. అదే విధంగా పరిగి మున్సిపాలిటీలో మొత్తం 17,223 ఓట్లకు 12,682ఓట్లు పోలుకాగా 73,63శాతం, కొడంగల్ మున్సిపాలిటీలో మొత్తం 10002 ఓట్లకు 7706 ఓట్లు పోలుకాగా 77.04శాతం, తాం డూర్ మున్సిపాలిటీలో 64,188 ఓట్లకు 45,783ఓట్లు పోలుకాగా 71.33శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైనా...నాలుగు మున్సిపాలిటీల్లోని చాలా పోలింగ్ కేంద్రాల్లో నలుగురైదుగురు మినహా పెద్దగా ఓటర్లు రాలేరు. అయితే ఉదయం 8గంటల తర్వా త ఓటర్లు పోలింగ్ కేంద్రా ల వద్ద బారులు తీరారు. అయితే ఉదయం 9 గంట ల వరకు తక్కువ పోలింగ్ శాతం నమోదయింది. ఉదయం 9 గంటల తర్వా త ఒక్క తాండూర్ మినహా మిగతా మూడు మున్సిపాలిటీల్లోనూ పోలింగ్ శాతం పెరిగింది. 


ఉదయం 9 గంటల వరకు వికారాబాద్ మున్సిపాలిటీలో  6483 ఓట్లు పోలుకాగా 13.05 శాతం పోలింగ్, తాండూర్ 8179 ఓట్లు పోలుకా గా 12శాతం, కొడంగల్ లో 1899 ఓట్లు పోలుకాగా 18.99 శాతం, పరిగి మున్సిపాలిటీలో 1857 ఓట్లు పోలుకాగా 10.78 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఉదయం 11 గంటల వరకు వికారాబాద్ మున్సిపాలిటీలో 15,718 ఓట్లు పోలుకాగా 31.65శాతం పోలింగ్, తాండూర్ 20,022 ఓట్లు పోలుకాగా 31.70 శాతం, కొడంగల్ 3819 ఓట్లు పోలుకాగా 38.18శాతం, పరిగి మున్సిపాలిటీలో 5396 ఓట్లు పోలుకాగా 31.33శాతం పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వికారాబాద్ మున్సిపాలిటీలో 26,311 ఓట్లు పోలుకాగా 52.97శా తం పోలింగ్, తాండూర్ 31,670 ఓట్లు పోలుకాగా 50.14 శాతం, కొడంగల్ 6003 ఓట్లు పోలుకాగా 60.02 శాతం, పరిగి మున్సిపాలిటీలో 8885 ఓట్లు పోలుకాగా 51.59శాతం పోలింగ్ నమోదయ్యింది. 


మధ్యా హ్నం 3గంటల వరకు వికారాబాద్ మున్సిపాలిటీలో  32, 803 ఓట్లు పోలుకాగా 66.04 శాతం పోలింగ్, తాండూర్ 41,243 ఓట్లు పోలుకాగా 65.29 శాతం, కొడంగల్ 7138 ఓట్లు పోలుకాగా 71. 37శాతం, పరిగి మున్సిపాలిటీలో 11165 ఓట్లు పోలుకాగా 64.83 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో నమోదైన పోలింగ్ శాతానికి సంబంధించి.. పరిగి మున్సిపాలిటీలో మొత్తం 17,223 ఓట్లకుగాను 12,682 ఓట్లు పోలుకాగా 73.63 శాతం, కొడంగల్ మున్సిపాలిటీలో మొత్తం 10,002 ఓట్లకుగాను 7706 ఓట్లు పోలుకాగా 77.04 శాతం, వికారాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 49,668 ఓట్లకు 36,753 ఓట్లు పోలుకాగా 74శాతం పోలింగ్ నమోదైంది. తాండూర్ మున్సిపాలిటీలో 64,188 ఓట్లకుగాను 45,783 ఓట్లు పోలుకాగా 71.33 శాతం పోలింగ్ నమోదదైంది. అయితే పోలింగ్ కేంద్రాల మౌలిక సదుపాయాలైన తాగునీరు, టెంట్లు తదితరాలు కల్పించకపోవడంపై పలువురు ఓటర్లు ఎన్నికల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత...

జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులు ఉండకుండా 144 సెక్షన్ అమలు చేశారు. మరోవైపు ఎస్పీ నాలుగు మున్సిపాలిటీల్లోని పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి భద్రతను పరిశీలించారు. అదే విధంగా కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పర్యటించి పలు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళికి సంబంధించి ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 


ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పరిగి పట్టణంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి దంపతులు, వికారాబాద్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా వికారాబాద్ శివారెడ్డిపేట్ పోలింగ్ కేంద్రంలో కలెక్టర్, సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, వికారాబాద్ పట్టణంలోని బాలభవన్ పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి  చంద్రశేఖర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం...

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని 95వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఏ మున్సిపాలిటీలో చైర్మెన్ పీఠం ఎవరికి దక్కనుంది, ఏ వార్డు లో ఎవరు గెలుస్తారనేది ఈనెల 25న తేలనుంది. 


పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను ఎన్నికల యంత్రాంగం గుర్తించిన ఆయా మున్సిపాలిటీల్లోని స్ట్రాంగ్ తరలించారు. పరిగి మున్సిపాలిటీకి సంబంధించి పరిగిలోని జడ్పీహెచ్ నెంబర్.1 ఉన్నత పాఠశాలకు, వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి వికారాబాద్ అనంతపద్మనాభ కాలేజీ, తాండూర్ మున్సిపాలిటీకి సంబంధించి తాండూర్ పట్టణంలోని సెయింట్ మార్క్స్ హైస్కూల్, అదే విధంగా కొడంగల్ మున్సిపాలిటీకి సంబంధించి కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని స్ట్రాంగ్ పోలీస్ ఎస్కార్ట్స్ నడుమ బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ తరలించారు.logo