శుక్రవారం 29 మే 2020
Vikarabad - Jan 23, 2020 , 00:43:21

3వ వార్డులో 87.61, 25వార్డు 66.75 శాతం పోలింగ్ నమోదు

3వ వార్డులో 87.61, 25వార్డు 66.75 శాతం పోలింగ్ నమోదు

షాద్ 78.45 శాతం పోలింగ్ 

 షాద్ నమస్తే తెలంగాణ, షాద్ షాద్ : షాద్ మున్సిపాలిటీలో బుధవారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  మున్సిపాలిటీలోని 28వార్డులకు గాను 59పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్ర 5గంటల వరకు ఎన్నికల పోలింగ్ కొనసాగింది. ఉదయం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసేందుకు  ఓటర్లు ఆసక్తి చూపారు. మధ్యాహ్న  3గంటల సమయానికి 69.62శాతం ఓటింగ్ పూర్తికాగా 5 గంటల సమయానికి 78.45శాతం నమోదైంది. మొత్తం 33,079మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో 16,899 పురుషులు, 16,180మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల అవసరాల దృష్ట్యా  అన్ని మౌలిక వసతులను కల్పించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా షాద్ ఏసీపీ సురేందర్ ఆధ్వర్యంలో 201మంది పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

  

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ 

 మున్సిపాలిటీలో 59 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ముందుగానే పోలీసులు, ఎన్నికల అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరం వరకు ఓటర్లను తప్ప ఇతరులను  అనుమంతించలేదు. ఎన్నికల నిర్వాహణకు అధికారులు  ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవడంతో ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువత ఓటును వినియోగించుకునేందుకు ఆసక్తి కనబర్చారు. ఎన్నికలకు ఒక రోజు ముందుగానే సంబంధిత అధికారులు ఓటర్లకు ఓటర్ స్లిపులను అందించడంతో ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందకుండా ఓటు వేసి వెళ్లారు.  ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు  వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక వీల్ చైర్లను ఏర్పాటు చేసి ఓటును వేయించారు. 


భారీ బందోబస్తు 

ఓటింగ్ శాతం ఎక్కువ ఉన్న వార్డుల్లో  ఏసీపీ సురేందర్ ఆధ్వర్యంలో పోలీసు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు.  పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఓటర్లను క్యూ పద్ధతిలో నిలిపి ఓటు వేయించారు. ఎన్నిక నిబంధనల ప్రకారం సెల్ పోలింగ్ కేంద్రాలకు అనుమతించలేదు. ఓటర్లకు పోలీసులు పూర్తిగా సహకరించడంతో ఓటర్లు సంతోషం వ్యక్తం చేశారు. షాద్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో అత్యధికంగా 87.61శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అత్యల్పంగా 25వ వార్డులో 66.75శాతం ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.  1వ వార్డులో 85.38శాతం, 2వ వార్డులో 77.73, 3వ వార్డులో 87.61, 4వ వార్డులో 78.91, 5వ వార్డులో 84.27, 6వ వార్డులో 79.51, 7వ వార్డులో 74.76, 8వ వార్డులో 75.08, 9వ వార్డులో 75.13, 10వ వార్డులో 77.47, 11వ వార్డులో 80.57, 12వ వార్డులో 84.06, 13వ వార్డులో 83.18, 14వ వార్డులో 82.35, 15వ వార్డులో 78.95, 16వ వార్డులో 81.87, 17వ వార్డులో 82.01, 18వ వార్డులో 73.19, 19వ వార్డులో 86.48, 20వ వార్డులో 74.49, 21వ వార్డులో 76,49, 22వ వార్డులో 83.05, 23వ వార్డులో 72.38, 24వ వార్డులో 71.01, 25వ వార్డులో 66.75, 26వ వార్డులో 78.80, 27వ వార్డులో 79.18, 28వ వార్డులో 70.86 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే అత్యధికంగా 7వ వార్డులో 1,629మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా అత్యల్పంగా 28వ వార్డులో 1,014మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

 

అత్యధికంగా 7వ వార్డులో 752 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకోగా అత్యల్పంగా 25వ వార్డులో 463మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే మొత్తం ఓట్లు 42,166 ఉండగా ఇందులో 33,079 ఓటర్లు ఓటు వేశారు. 9,087మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.logo