బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jan 23, 2020 , 00:31:32

నూతన సహకార సంఘం ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

నూతన సహకార సంఘం ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ


నందిగామ :  చేగూరులో గల సహకారం సంఘం పరిధిలో కొత్తూరు మండలంలోని మల్లపూర్, తీగాపూర్, తీమ్మపూర్ గ్రామాలు అనుసంధానంగా ఉన్నాయి.  పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తూరు మండలంలో నూతన సహకార సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చేగూరు పీఏసీఎస్ చైర్మన్ విఠల్ తెలిపారు. ఉత్తర్వుల కాపీని బు ధవారం పీఏసీఎస్ కార్యాలయం నోటీస్ బోర్డులో పెట్టారు.  ఆయన మాట్లాడుతూ.. అభ్యంతరాలుంటే రంగారెడ్డి జిల్లా డీసీవోకు లిఖితపూర్వకంగా తెలియజేయాలన్నారు. 


కొందుర్గు :  కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలం మొత్తంగా ఇదివరకు ఒక సంఘం ఉన్నది.  మండల కేంద్రంలో రెండు, జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో రెండు ప్రాథమిక సహకార సంఘం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఈవో మహిముద్ బుధవారం  తెలిపారు.సంఘం పరిధిలో కొందుర్గు, చుక్కమెట్టు, టేకులపల్లి, బైరంపల్లి, మహాదేవ్ సోమారంపహాడ్, ఉత్తరాశిపల్లి, ముట్పూర్, రేగడి చిల్కమర్రి, ఉమ్మెంత్యాల ఉంటాయని ఆయన తెలిపారు. ఆగిర్యాల ప్రాథమిక సహకారం సంఘం పరిధిలో ఆగిర్యాల, వెంకిర్యాల, తంగెళ్లపల్లి, విశ్వనాథ్ చిన్న ఎల్కిచర్ల, పర్వతాపూర్, చెర్కుపల్లి ఉంటాయి. జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రం పరిధిలో జిల్లెడు, చేగిరెడ్డి ఘనపూర్, ఇంద్రానగర్, పద్మారం, వీరన్నపేట, తూంపల్లి, తుమ్మలపల్లి, వనంపల్లి, గుర్రంపల్లి, చెన్నారెడ్డిగూడ  ఉంటాయి. ఎదిర ప్రాథమిక సహకార సంఘం పరిధిలో ఎదిర చలివేంద్రపల్లి, జాకారం, మల్కపహాడ్, పెద్ద ఎల్కిచర్ల ఉంటాయని ఆయన తెలిపారు. 


కేశంపేట :  మండల కేంద్రంలో నూతనంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కొత్తపేట పీఏసీఎస్ సీఈవో అనిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం మండలంలోని కొత్తపేటలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని నడిపిస్తోంది. కేశంపేటలో మరో శాఖను చేసేందుకు నిర్ణయించిందని, కొత్తగా ఏర్పాటు చేసే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి కేశంపేట, కాకునూరు, బొదునంపల్లి, లేమామిడి, నిర్దవెళ్లి, లింగంధన, తొమ్మిదిరేకుల, పోమాల్ కొండారెడ్డిపల్లి, ఇప్పలపల్లి, పాపిరెడ్డిగూడ, వేములనర్వ, చింతకుంటపల్లి గ్రామాలను అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని సీఈవో తెలిపారు. 


కొత్తూరు : ఉమ్మడి కొత్తూరు మండలంగా ఉన్నప్పుడు మేకగూడ, నందిగామ, చేగూరులో మూడు సహకార సంఘాలుండేవి.  కొత్తూరు మండలం నుంచి నందిగామ మండలం విడిపోగా నందిగామ మండలంలోకి మూడు సహకార సంఘాలు పోవటంతో చేగూరు, మేకగూడ సహకార సంఘాల నుంచి మక్తగూడ, గూడూరు, మల్లాపూర్, తీగాపూర్, తిమ్మాపూర్, కొత్తూరు, మల్లాపూర్ ఇన్ముల్ పెంజర్ల, కొడిచర్ల, ఎస్బీపల్లి, కొడిచర్లతండా, సిద్దాపూర్, ఏనుగులమడుగుతండా గ్రామాలను వేరుచేస్తూ కొత్తగా కొత్తూరు, కొడిచర్లల్లో  ఏర్పాటుచేస్తున్న సహకార సంఘంలో కలుపుతున్నట్లు సీఈవో తెలిపారు. ఈ సంఘాల ఏర్పాటుపై ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు అయిన ఉన్నైట్లెతే 21 రోజుల్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని మేకగూడ సహకార సంఘం సీఈవో వినయ్ ఈ సందర్భంగా తెలిపారు.


logo