సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jan 22, 2020 , 00:47:58

పోలింగ్ డే

 పోలింగ్ డే


వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా రు. నేడు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ సరిపోను పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను కూడా చేరవేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 224 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రా ల్లో వెబ్ పాటు సీసీటీవీ కెమెరాలతో పోలింగ్ సరళీని ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పర్యవేక్షించనున్నారు.

మరోవైపు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అధికంగా ఉన్న మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అదనంగా పారా మిలిటరీ బలగాలతో పాటు ఇతర పోలీ స్ సిబ్బందితో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. అదే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యంతో పాటు అగ్నిమాపక వాహనం, వైద్య శిబిరంతో పాటు ఇతర అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాలకు 200మీటర్ల వరకు 144సెక్షన్ అమల్లో ఉండనుంది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా 1,42,925మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నాలు గు మున్సిపాలిటీల్లో 97వార్డులుండగా వికారాబాద్ మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన దృష్ట్యా 95 వార్డులకు జరుగనున్న ఎన్నికల బరిలో 351మంది అభ్యర్థులు ఉన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీ బరిలో 103మంది అభ్యర్థులు, పరిగి మున్సిపాలిటీ బరిలో 54మంది అభ్యర్థులు, తాండూర్ మున్సిపాలిటీ బరిలో 148మంది అభ్యర్థులు, కొడంగల్ మున్సిపాలిటీ బరిలో 46మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

పోలింగ్ ఏర్పాట్లు పూర్తి...

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 4మున్సిపాలిటీల్లోని ఓటర్లకు సరిపోను పోలింగ్ కేంద్రాలతో పాటు బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేశారు. 4మున్సిపాలిటీల్లో 224పోలింగ్ కేంద్రాలుండగా 538బ్యాలెట్ బాక్సులను ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరవేశారు. వికారాబాద్ మున్సిపాలిటీలో 64 పోలింగ్ కేంద్రాలు 150 బ్యాలెట్ బాక్సులు, తాండూర్ 108 పోలింగ్ కేంద్రాలు 242 బ్యాలె ట్ బాక్సులు, పరిగిలో 30 పోలింగ్ కేంద్రాలు 99 బ్యాలెట్ బాక్సులు, కొడంగల్ 22పోలింగ్ కేంద్రా లు 47బ్యాలెట్ బాక్సుల ను సిద్ధం చేయడంతో పా టు అవసరమైన అన్ని మౌ లిక సదుపాయాలను ఎన్నికల యంత్రాంగం సమకూర్చింది. అదేవిధంగా జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలో గుర్తించిన సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 28 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 63సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి.

సంబంధిత సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా క్షుణ్ణంగా వెబ్ నిర్వహించనున్నా రు. అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వికారాబాద్ 11, తాండూర్ 9, పరిగి మున్సిపాలిటీలో 8 అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. ఎన్నికలకు సంబంధించి 21 రూట్ల ను సిద్ధం చేయడంతో పాటు 29మంది నోడల్ అధికారులు, 52మంది మైక్రో అబ్జర్వర్లు, 21మంది జోనల్ అధికారులను నియమించారు. అదే విధంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకుగాను ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఇతర ప్రిసైడింగ్ అధికారులు కలిపి మొత్తం 1265మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

పరిగి మున్సిపాలిటీకి మొత్తం 165మంది ఎన్నికల సిబ్బందిని నియమించగా, వీరిలో 33మంది ప్రిసైడింగ్ అధికారులు, 33మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు 99 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు, వికారాబాద్ మున్సిపాలిటీకి మొత్తం 377మంది ఎన్నికల సిబ్బందిని నియమించగా వీరిలో 76 మంది ప్రిసైడింగ్ అధికారులు, 76అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు 225మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు, తాండూర్ మున్సిపాలిటీకి మొత్తం 605మంది ఎన్నికల సిబ్బందిని నియమించగా, వీరిలో 121ప్రిసైడిం గ్ అధికారులు, 121అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతోపాటు 363 ఇతర ప్రిసైడింగ్ అధికారులు, కొడంగల్ మున్సిపాలిటీకి మొత్తం 118ఎన్నికల సిబ్బందిని నియమించగా వీరిలో 24మంది ప్రిసైడింగ్ అధికారు లు, 24అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతోపా టు 70మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులను ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. అదే విధంగా ఎన్నికల కోసం 49 స్కూల్ బస్సులను ఏర్పాటు చేయడంతో పర్యవేక్షణకు వెళ్లే అధికారులకు 40వాహనాలను సిద్ధం చేశారు.

భారీగా పోలీస్ బందోబస్తు...

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను జిల్లా పోలీ స్ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తును సిద్ధం చేశారు. జిల్లాలోని వికారాబాద్, తాండూ ర్, పరిగి, కొడంగల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డీఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు 657మంది పోలీసులు విధు లు నిర్వర్తించనున్నారు. అయితే నాలుగు మున్సిపాలిటీల్లో నేడు జరుగనున్న పోలింగ్ సంబంధించి 657మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తుండ గా, వీరిలో నలుగురు డీఎస్పీలు, 8మంది సీఐలు, 42మంది ఎస్ 76మంది ఏఎస్ హెడ్ కానిస్టేబుళ్లు, 284మంది కానిస్టేబుళ్లు, 135మంది హోంగార్డులు, 56మంది అర్మ్ సిబ్బంది, మూడు భద్రత దళాలు విధుల్లో ఉండనున్నారు. అంతేకాకుండా బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు చేరవేసే సమయంలో తిరిగి లెక్కింపు కేంద్రాలకు తీసుకెళ్లే సమయంలో పోలీస్ ఎస్కార్ట్ తీసుకెళ్లనున్నారు.

ఓటు హక్కును వినియోగించుకోనున్న 1,42,925 మంది ఓటర్లు...

జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో మొత్తం 1,42,925మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు-71,348, మహిళా 71,576, ఇతరులు ఒక ఓటరున్నారు. అదే విధంగా జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లకు సంబంధించి, వికారాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 52,450మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు-26,290, మహిళా -26,160, తాండూర్ మున్సిపాలిటీలో మొత్తం 63,336 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు-31,268, మహిళా -32,067, ఇతరులు ఒకరు, కొడంగల్ మున్సిపాలిటీలో మొత్తం 9989 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు-4964, మహిళా -5025, పరిగి మున్సిపాలిటీలో మొత్తం 17,150మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు-8826, మహిళా -8324 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

అదే విధంగా ఎవరికైతే ఓటరు ఎపిక్ కార్డులు లేనట్లయితే సంబంధిత ఓటర్లు ఆధార్ కార్డు, పాస్ డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగులైతే గుర్తిం పు కార్డు, ప్రభుత్వ రంగ బ్యాంకు పాసు పుస్తకం, ఉపాధి హామీ జాబ్ రేషన్ కార్డు, ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి గుర్తింపు కార్డుగా చూపించాల్సి ఉంటుంది.logo