గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jan 22, 2020 , 00:47:24

ప్రతిఒక్కరూ ఓటు వేయాలి

ప్రతిఒక్కరూ ఓటు వేయాలి


వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఉదయం 7  నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఎన్నికల పోలింగ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని   కలెక్టర్ మస్రత్ ఆయేషా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటు వినియోగించుకునేందుకు బీఎల్ అందజేసే ఫొటో ఓటరు స్లిప్పులతో పాటు ఎఫిక్ వోటర్ ఐడీ కార్డును పోలింగ్ బూత్ తీసుకుని వెళ్లి ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల గుర్తుంపు కార్డు లేని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో గుర్తింపు పొందిన 18 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డును ఓటు వేసే సమయంలో పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓటు వినియోగించుకోవచ్చని తెలిపారు.  

1) ఆధార్ కార్డు, 2) పాస్ 3) డ్రైవింగ్ లైసెన్స్, 4) ఫొటోతో గల సర్వీస్ గుర్తింపు కార్డు, 5) ఫొటోతో కూడిన బ్యాంకు పాస్ 6) పాన్ కార్డు, 7) స్మార్ట్ కార్డు, 8) ఎన్నికల నోటిఫికేసన్ ముందు ఇవ్వడిన ఎన్ జాబ్ కార్డు, 9) లేబర్ డిపార్టుమెంట్ ద్వారా జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, 10) ఫొటోతో కూడిన పెన్షన్ కార్డు, 11) ఫొటోతో సహా రాష్ట్ర సచివాలయం ద్వారా జారీ చేయబడిన ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ గుర్తింపు కార్డు, 12) ఎన్నికల నోటిఫికేసన్ ముందు ఇవ్వడిన రేషన్ కార్డు, 13) ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఇవ్వడిన కుల ధ్రువీకరణ పత్రం, 14) స్వతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డు, 15) ఆర్మీ లైసెన్స్, 16) దివ్యాంగుల గుర్తింపు కార్డు, 17) రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులుగా గుర్తించబడిన గుర్తింపు కార్డు, 18) పట్టేదార్ పాసుబుక్ వంటి 18 గుర్తింపు కార్డుల్లో ఏదేనీ ఒక గుర్తింపు కార్డును  ఫొటో ఓటరు స్లిప్పులతో పాటు   పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో బుధవారం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 63 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఈ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ ద్వారా ఓటర్ సరళిని కలెక్టర్ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి వెబ్ క్యాస్టిక్ నిర్వహించే వలంటీర్లకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శిక్షణను  అందించడం జరిగిందని పేర్కొన్నారు.logo