శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Jan 22, 2020 , 00:46:18

సర్పన్ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు

సర్పన్ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు


వికారాబాద్ టౌన్ : సర్పన్ ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి రైతులకు నీటిని అందిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా నీటి పారుదల శాఖ అధికారి భీమ్ అన్నారు. సోమవారం   మండల పరిధిలోని గొట్టిముక్కలలో ఉన్న సర్పన్ ప్రాజెక్టు ఎడమ కాలువ తూమ్ కింద రాయి పడి నీరు అత్యధికంగా కాలువలోకి  వెళ్లడంతో  రైతులు ఆందోళన చెందారు. గతంలోనే తూం కొద్దివరకు బీటలు వారగా దీనిని నీటి పారుదల శాఖ అధికారులు తాత్కాలికి మరమ్మతులు చేశారు. మంగళవారం ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టుకు చేరుకొని నీరు పారడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పన్ ప్రాజెక్టుకు ఎలాంటి గండం లేదని, గతంలో కొంత మేరకు తూం బీటలువారి  దెబ్బతినడంతో  తాత్కాలిక మరమ్మలు చేశామన్నారు.

తూంనుంచి అధికంగా నీరు రావడానికి తూం అడుగు భాగాన రాయివచ్చి చేరిందన్నారు. తూమ్ కిందకు దిగకపోవడంతో నీరు అధికంగా బయటకు వచ్చి కాలువలో పారిందన్నారు. తూమ్ అడ్డుగా ఉన్న రాయిని తొలగించి తూమ్ సరి చేశామని స్పష్టం చేశారు. రైతులు అందరూ పంటలు వేసుకోవాలని నీటిని తూం నుంచి వదులుతామని తెలిపారు.  అలాగే చెరువును బాగు చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించామని వివరించారు.  వేసవి కాలంలో చెరువు పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.  వీరి వెంట ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కనకయ్య,  ఇరిగేషన్ ఏఈ వరప్రసాద్, రైతులు ఉన్నారు.


logo