ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jan 21, 2020 , 00:01:06

ప్రశాంతంగా నిర్వహించాలి

ప్రశాంతంగా నిర్వహించాలి


కొడంగల్‌, నమస్తే తెలంగాణ :  ఎన్నికల ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా పగడ్బందీగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియ పనులు పూర్తి చేయాలని  కలెక్టర్‌ మస్రత్‌ఖానమ్‌ ఆయేషా అధికారులకు సూచించారు. సోమవారం మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొడంగల్‌లో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయంలోని పోలింగ్‌ బాక్స్‌లను పరిశీలించి, పంపిణీ ప్రక్రియకు చర్యలు చేపట్టాలని సూచించారు.  ఎన్నికల విధుల్లో నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తే చర్యలు తప్పవని, నిబంధల ప్రకారం, పోలింగ్‌ బూత్‌లలో ఓటర్లుకు అన్ని సౌకర్యాలు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మోహన్‌లాల్‌, ఎన్నికల సిబ్బంది వినయ్‌కుమార్‌, బాలాజీ ప్రసాద్‌, రాంరెడ్డి, వెంకట్రామ్‌రెడ్డి  పాల్గొన్నారు.

ఎన్నికల నేపథ్యంతో ప్రకటనలు వద్దు

వికారాబాద్‌ టౌన్‌ : జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో ఈ నెల 22న సాధారణ ఎన్నికలు జరుగుతున్నందున్న ప్రకటనలు వేయారాదని కలెక్టర్‌ మస్రత్‌ఖానమ్‌ ఆయేషా సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోలింగ్‌ రోజు, పోలింగ్‌ ముందు రోజు (48 గంటలు) 21, 22న దిన పత్రికలు , టీవి చానల్స్‌లలో, సోషల్‌ మీడియాలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు వేయొద్దని తెలిపారు.  ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే అనుమతి తప్పని సరిగ్గా తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మున్సిపల్‌ ఎన్నికల చట్టం 2019, సెక్షన్‌ 209(1)(బి) ప్రకారం 48 గంటల ముందు నిలిపివేయాలని సూచించారు.  ఈ నిబంధనలను అతిక్రమించి ప్రకటనలు పత్రికలో, టీవిలో ప్రచురితం అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.logo