ఈ సినిమాతో కచ్చితంగా కమర్షియల్ విజయం కూడా అందుకుంటాడు మా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.. చెక్ సినిమా విడుదలకు ముందే నితిన్ చాలా నమ్మకంగా చెప్పిన మాటలు ఇవి. చెక్ సినిమా తర్వాత తమకు మంచి పేరు వస్తుందని నితిన్ చెప్తే.. కాదు ఈ సారి నాకు డబ్బులు కావాలని చెప్పాడు విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. కానీ ఈ సారి కూడా ఈయన కోరిక నెరవేరలేదు. యేలేటి తెరకెక్కించిన చెక్ సినిమాకు కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి.
చదరంగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లు భారీగా పడిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ టోటల్ కూడా 7.27 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. దాంతో నితిన్‌కు మరో భారీ ఫెయిల్యూర్‌గా చెక్ నిలవబోతుంది. 17 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కనీసం 10 కోట్లు కూడా వసూలు చేసేలా కనిపించడం లేదు.
నైజాం: 2.40 కోట్లు
సీడెడ్: 80 లక్షలు
ఉత్తరాంధ్ర: 90 లక్షలు
గుంటూరు: 82 లక్షలు
ఈస్ట్: 32 లక్షలు
వెస్ట్: 50 లక్షలు
కృష్ణా: 43 లక్షలు
నెల్లూరు: 25 లక్షలు
AP/TS మూడు రోజుల కలెక్షన్స్: 6.42 కోట్లు షేర్
రెస్టాఫ్ ఇండియా: 40 లక్షలు
ఓవర్సీస్: 45 లక్షలు
వరల్డ్ వైడ్ 3 డేస్ టోటల్ షేర్: 7.27 కోట్లు