ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jan 18, 2020 , 23:45:24

నేరాల నిరోధానికి సీసీ కెమెరాల ఏర్పాటు

నేరాల నిరోధానికి సీసీ కెమెరాల ఏర్పాటుయాలాల: నేరాల నిరోధానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ నారాయణ పేర్కొన్నారు. శనివారం యాలాల మండల పరిధిలోని కోకట్‌, అగ్గనూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. తప్పులు చేసేవారు బయటివారైనా, ఇంటివారైనా సీసీ కెమెరాలకు చిక్కుతాడన్నారు. చోదకులపై ఒక పోలీస్‌ 24 గంటల నిఘా ఉంచితే ఒక సీసీ కెమెరా వంద పోలీసులతో సమానంగా నిఘాపెడుతుందన్నారు. కెమెరా సంవత్సరం పొడవునా, వానకు, ఎండకు, రాత్రి, పగలు నిఘా పెడుతుందన్నారు. సీసీ కెమెరాలు అటు మంచికి, ఇటు చెడుకు రెండు విధాలుగా ఉపయోగ పడుతాయన్నారు. ఈ గ్రామాల మాదిరిగానే మండల పరిధిలోని అన్ని గ్రామాలను సీసీ నిఘాలో ఉంచుతామన్నారు. వీటి ద్వారా చోరులను వెంటనే పట్టుకోవచ్చన్నారు. మహిళలపై వేధింపులు, చీటింగ్‌ , ర్యాగింగ్‌లు చేస్తే తప్పించుకునే అవకాశం లేదన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను అదుపు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో తాండూర్‌ రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, కోకట్‌  సర్పంచ్‌ హంసమ్మ శంకర్‌రెడ్డి, అగ్గనూర్‌ సర్పంచ్‌ భీమప్ప, ఎంపీపీ బాలేశ్వర్‌,ఎంపీటీసీ గరివప్ప, ఎస్‌ఎంసీ చైర్మన్‌ వెంకటయ్య, ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి, నాయకులు బాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, బజారప్ప, కృష్ణ, హన్మప్ప, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.logo