శుక్రవారం 29 మే 2020
Vikarabad - Jan 18, 2020 , 23:42:34

నిండు జీవితానికి రెండు చుక్కలు

నిండు జీవితానికి రెండు చుక్కలు

వికారాబాద్‌ టౌన్‌ : చిన్నారుల  జీవితాలు పదిలంగా ఉండాలంటే పల్స్‌ పోలియో చుక్కలు తప్పని సరిగా వేయించాలని, పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని  జిల్లా వైద్యాధికారి దశరథ్‌ అన్నారు. శనివారం వికారాబాద్‌ పట్టణంలోని ఏరియా దవాఖాన నుంచి పట్టణంలో ప్రధాన కూడలి నుంచి పల్స్‌ పోలియో పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  జిల్లా వైద్య ఆరోగ్య అధికారి దశరత్‌ మాట్లాడారు. నేడు నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏండ్లలోపు ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. పిల్లలకు ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఉన్న పోలియోను వేయించాలని తెలిపారు. జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చుకోవాలని సూచించారు. ఎక్కడివారికైనా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, జనవాసం ఉన్న ప్రదేశాల్లో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ప్రోగ్రాం అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు  పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  కార్యక్రమంలో భాగంగా 19న బూత్‌లలో పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, 20, 21 తేదీల్లో గృహ సందర్శన ద్వారా పోలియో చుక్కలు వేస్తామని వివరించారు.  కార్యక్రమంలో వైద్యులు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


logo