గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jan 16, 2020 , 23:40:03

టీఆర్ అభ్యర్థులను అశీర్వదించి గెలిపించండి

 టీఆర్ అభ్యర్థులను అశీర్వదించి గెలిపించండి


తాండూరు, నమస్తే తెలంగాణ : టీఆర్ సర్కారు హ యాంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకపోతుందని, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ పట్టం కడితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ నిర్వహించిన ప్రచారం, కార్యకర్తల సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కోడంగల్ నాలుగు మున్సిపాల్టిలతో పాటు రాష్ట్రంలో 95శాతం మున్సిపాల్టిలలో టీఆర్ జెండా ఎగురవేస్తామన్నారు. టీఆర్ ఏ పార్టీతో పొత్తు లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల నాయకుల అసత్య మాటలను ప్రజలు నమ్మరాదని సూచించారు.

ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న టీఆర్ ప్రజలు ఓటు చేసి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 36వార్డుల్లో టీఆర్ పోటీ చేయగా కాంగ్రెస్ 32, బీజేపీ 24, ఎంఐఎం 20 వార్డుల్లో నే పోటీ చేస్తుందని మిగతా వార్డుల్లో పోటీలో లేని ప్రతిపక్ష పార్టీల అభిమానుల పరిస్థితి ఏమిటని ఎద్దేవా చేశారు. మైనార్టీల కు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని కుల మతాలకు నిలయంగా ఉన్న తాండూరు భిన్నత్వం లో ఏకత్వంగా మెలగడం అభినందనీయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ అభ్యర్థులు ఇచ్చే హామీలను తప్పక నెరవేర్చాల్సిన బాధ్యతమాదే అన్నారు. అందుకు ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టురాని నేతలు నిరుత్సహాం చెందరాదన్నారు. వారిని గౌరవిస్తూ తప్పకుండా నామినేటేడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఎంపీ రంజిత్ మాట్లాడుతూ తాండూరు ప్రజల ఓట్లతో తాను ఎంపీగా గెలుపొందడం జరిగిందన్నారు. అందుకు తాండూరుకు నిరంతరం అండగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తాండూరులో మెడికల్ కళాశాల, కందిబోర్డు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ మహేందర్ ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ముందెన్నడే లేని విధంగా ప్రవేశ పెట్టిన పథకాలతో తాండూరు మున్సిపల్ 36వార్డుల్లో అఖండ మెజార్టీతో టీఆర్ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. అందుకు తగ్గట్లు తమ భుజస్కంధాలపై బాధ్యతలను వేసుకుని పనులు చేస్తున్నామన్నారు. టీఆర్ అధికారంలోకి వస్తేనే తాండూరు మున్సిపల్ అన్నివిధాల అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య మౌలిక వసతుల కార్ఫొరేషన్ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, టీఆర్ నేతలు అబ్దుల్ కరుణం పరుషోత్తంరావు, కోట్రిక విజయలక్ష్మి, సునీతాసంపత్, వీరామణి, విశ్వనాథ్ లక్ష్మారెడ్డి, రాజుగౌడ్, మసూద్, నారాయణరెడ్డి, మన్మోహన్ సర్డా, సాయిలుగౌడ్, మురళీగౌడ్, రవిగౌడ్, శ్రీనివాస్, 36 వార్డుల టీఆర్ అభ్యర్థులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అభివృద్ధి చెందాలంటే టీఆర్ ఆదరించండి

పరిగి, నమస్తే తెలంగాణ : పరిగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీఆర్ ఆదరించాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పరిగిలోని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పరిగి పట్టణం అభివృద్ధి చెందాలంటే టీఆర్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఇతర ఏ పార్టీలు అభివృద్ది చేయలేవని ఆయన తేల్చి చెప్పారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల అభివృద్దిపై సర్కారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని అన్నారు. ప్రతినెల పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 330కోట్లు విడుదల చేస్తుందన్నారు. ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన పల్లె ప్రగతితో గ్రామాల స్వరూపం మారిందని, ప్రజలు చక్కగా స్వీకరించారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుకు సర్కారు సన్నాహాలు చేస్తుందన్నారు. కొత్త మున్సిపల్ చట్టం అమలుతో చక్కటి పాలన అందనుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధిలో ముందు కు సాగుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ దిక్కు దివాణం లేని పార్టీ గా మిగిలిపోయిందని ఆయన విమర్శించా రు. టీఆర్ తామే ప్రత్యామ్నాయమని ప్రకటించే బీజేపీ తరపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ  చేసేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారని, పరిగిలో 9వార్డుల్లో అభ్యర్థులే లేరంటే బీజేపీ తమకు ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పరిగి అభివృద్ధికి మంత్రి కేటీఆర్ రూ. 15కోట్లు మంజూరు చేయగా, త్వరలోనే రూ. 10కోట్లకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ దోమ జడ్పీటీసీ కె. నాగారెడ్డి, టీఆర్ నాయకులు కొప్పుల అనిల్ ఆర్.ఆంజనేయులు, బి.ప్రవీణ్ మీర్ మహమూద్ ఎ.సురేందర్ గౌస్ భాస్కర్, వెంకట్ టీఆర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo