ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jan 16, 2020 , 23:37:57

గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా


వికారాబాద్ రూరల్ : కారు గుర్తుకు ఓటు వేసి 30వ వార్డు అభ్యర్థి పి. రాధాలక్ష్మిని అధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ నాయకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 30వ వార్డులోని గరీబ్ ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. కారు గుర్తు కు ఓటు వేసి వార్డును అభివృద్ధి పథంలో ఉంచుకుందామన్నారు. టీఆర్ ప్రభుత్వంలో అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ పథకాలు గరీబొల్ల ఇండ్లల్లో వెలుగులు నింపాయని, మిషన్ భగీరథ ద్వారా  ఇంటింటికీ తాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. ఆసరా పింఛన్లు రూ. 200నుంచి రూ. 2016 వరకు పెంచి ఆసరాగా నిలిచింది టీఆర్ ప్రభుత్వం అన్నారు.

ఇలాంటివి ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకోవడంతో పాటు అమలు చేసి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చిందన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో వార్డులో పోటీలో నిలబడిన టీఆర్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించుకుని మున్సిపల్ అభివృద్ధికి పాటు పడుదామని ఓటర్లకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ నమూన ద్వారా ఓటర్లను కారు గుర్తు కు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో నాయకులు శేఖర్, భాస్కర్ తదితరులు ఉన్నారు.


logo