బుధవారం 03 జూన్ 2020
Vikarabad - Jan 14, 2020 , 00:44:35

కలిసి గెలిపిస్తాం

కలిసి గెలిపిస్తాం
  • -మా మధ్య వర్గ విబేధాల్లేవ్‌
  • -పోటీలేని టీఆర్‌ఎస్‌కు బంపర్‌ మెజార్టీ
  • -అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల బ్రహ్మరథం
  • -టిక్కెట్లు దక్కని వారికీ న్యాయం
  • -ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
  • -తాండూరులో అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేత

తాండూరు టౌన్‌ : తాండూరు టీఆర్‌ఎస్‌లో ఎలాంటి విబేధాలు రాకుండా మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం కలిసి పనిచేసి గెలిపిస్తామని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు పేర్కొన్నారు. సోమవారం తాండూ రు పట్టణంలో వారు ఇద్దరు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాండూరులో ఎమ్మెల్సీ వర్గం, ఎమ్మెల్యే వర్గం అంటూ ఏమి లేదని, అలాంటి అపోహలను నమ్మొద్దని తేల్చి చెప్పారు. ఓర్వలేని ప్రతిపక్షాలు పార్టీలో వర్గ విబేధాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తామన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు బంపర్‌ మెజార్టీ ఖాయమని తెలిపారు. తామిద్దరం కలిసే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. తాండూరు అభివృద్ధికి వారు కట్టుబడి పనిచేస్తారని విశ్వాసం ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటు అడిగే హక్కులేదని, ఆ పార్టీలలో టీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చే స్థాయి లేదన్నారు. పోటీ అంటూ లేని టీఆర్‌ఎస్‌కు బంపర్‌ మెజార్టీ వస్తుందని దీమా వ్యక్తం చేశారు. తాండూరు మున్సిపల్‌లోని 36 వార్డుల్లో 36 మంది అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు అందరు కుటుంబ సభ్యుల్లాగా కలిసి మెలిసి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కని ఆశావహులకు, అభ్యర్థులకు నామినేటేడ్‌ పోస్టుల్లో గాని, ఇతర పదవులు అందించేలా అందరికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల తరువాతే సీఎం కేసీఆర్‌ తాండూరు చైర్‌ పర్సన్‌ అభ్యర్థిని ప్రకటిస్తారని స్పష్టం చేశారు.

గెలుపు గుర్రాలకే టికెట్లు..

బీఫారాలు అందజేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు అందించడం జరిగిందని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు పేర్కొన్నారు. విలేకరుల సమావేశం అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకుని భారీ మెజార్టీతో గెలవాలని పిలుపునిచ్చారు. 36 వార్డులకు నాలుగు స్థానాలను పెండింగ్‌లో ఉంచి 32 మంది అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కరణం పురుషోత్తంరావు, అబ్దుల్‌ రావూఫ్‌, రవీందర్‌గౌడ్‌, రాజుగౌడ్‌, డా. సంపత్‌కుమార్‌, పట్లోళ్ల నర్సింలు, కోట్రిక విజయలక్ష్మి, మురళీకృష్ణ, జావిద్‌లాల, మసూద్‌, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ బీ-ఫారాలు అందుకున్న అభ్యర్థులు వీరే..
వార్డులు    అభ్యర్థులు
1వ    అగ్గనూర్‌ మల్లప్ప
2వ    జ్యోతి శ్రీనివాస్‌
3వ    అనిల్‌ రాథోడ్‌
4వ    పెండింగ్‌
5వ    అంజద్‌
6వ    పెండింగ్‌
7వ    అతియా ఈర్షా
8వ    వెంకన్న గౌడ్‌
9వ    దీపా నర్సింహులు
10వ    పట్లోళ్ల రత్నమాల
11వ    నీరజాబాల్‌రెడ్డి
12వ    అనురాధరవీందర్‌
13వ    రవీందర్‌రెడ్డి
14వ    అనసూయ
15వ    శోభారాణి
16వ    ఎర్రం వసంత
17వ    హురా ఖాతూన్‌
18వ    అశ్విని గుండప్ప
19వ    ముక్తార్‌ అహమ్మద్‌
20వ    పెండింగ్‌
21వ    సయ్యద్‌ సల్మా ఖాతూన్‌
22వ    రామకృష్ణ
23వ    పరిమళ రవీందర్‌
24వ    వనం అనూషరెడ్డి
25వ    ఇర్ఫాన్‌
26వ    పెండింగ్‌
27వ     తాటికొండ స్వప్న
28వ    విజయాదేవి
29వ    అబ్దుల్‌ రజాక్‌
30వ    మెహరాజ్‌ బేగం
31వ    గాయత్రి యోగానంద్‌
32వ    సందుల లత
33వ    ప్రవీణ్‌ కుమార్‌ గౌడ్‌
34వ    కరుణాకర్‌
35వ    దర్మీది నగేశ్‌
36వ    వీణ శ్రీనివాస్‌ చారి


logo