బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jan 14, 2020 , 00:42:29

పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి

పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి
  • - 100శాతం ఓటరు నమోదుకు చర్యలు చేపట్టాలి
  • - సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  • - వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి
  • - పాల్గొన్న కలెక్టర్‌ ఆయేషా, జిల్లా అధికారులు

వికారాబాద్‌ టౌన్‌ : ఈ నెల 19న జరిగే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని అధికారులు, ఎన్‌జీవోలు సహకరించి విజయవంతం చేయాలని  ్ల కలెక్టర్‌ మస్రత్‌ఖానమ్‌ ఆయేషా అన్నారు. సోమవారం  కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌పోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మస్రత్‌ఖానమ్‌ ఆయేషా మాట్లాడారు. జిల్లాలోని 5 ఏండ్లలోపు పిల్లలకు తల్లిదండ్రులు తప్పకుండా పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. పోలియో రహిత జిల్లాగా వికారాబాద్‌ను మార్చుకోవాలన్నారు. జిల్లాలో 1,02,634 మంది పిల్లలకు వేయాల్సి ఉందని, ఇందుకుగాను  ఓపీవీ వ్యాక్సిన్స్‌ 1,14,040 చుక్కలు వేయాలన్నారు. 82 రూట్లలో 818 బూత్‌లు, 73 ఐరిస్‌ ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేయాలని తెలిపారు.  జిల్లా మొత్తంలో 1,106 మంది అంగన్‌వాడీ సిబ్బంది, 746 మంది ఆశ వర్కర్లు, 44 మంది సభ్యులు, 22 మొబైల్‌ బృందం, 67 వ్యాక్సినేటర్లు కలిపి మొత్తం 3,380 మంది పల్స్‌ పోలియో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా 1 నుంచి 19 ఏండ్లలోపు పిల్లలకు నులిపురుగుల నివారణ కోసం ఫిబ్రవరి 10 ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 2,99,238 మంది పిల్లలకు ఈ మాత్రలను వేయాలని, ఆ రోజు వేయించుకోని పిల్లలకు ఫిబ్రవరి 12న వేయించాలన్నారు. ఆల్బెండజోల్‌ మాత్రలు  ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ సెంటర్లలో, పాఠశాలలో, కళాశాలలో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ మాత్రల ద్వారా ఎలాంటి హాని జరుగదన్నారు. అందరికి అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి జీవరాజ్‌, డాక్టర్‌ సాయిబాబా పాల్గొన్నారు.logo