శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Jan 13, 2020 , 00:49:34

అభివృద్ధిని చూసే చేరికలు

అభివృద్ధిని చూసే చేరికలు
  • - టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
  • - పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌
  • - టీఆర్‌ఎస్‌లో చేరిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు

పరిగి, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి భారీ వలస వస్తున్నారని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పరిగిలోని ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన ఈశ్వరయ్య, పి.మహిపాల్‌, తిర్మలయ్య, రాంచంద్రయ్య, రాజు, అశోక్‌, రతన్‌సింగ్‌, మల్కయ్య, బాబా, మైసయ్య, సోమ్లనాయక్‌, మక్బుల్‌, కె.మల్లేశ్‌, పి.అనంతయ్య, బి.నవీన్‌, నర్సిహుంలు, అరుణ్‌, బి.శ్రీనివాస్‌, అనంతమ్మ, దేవమ్మ, పద్మమ్మ, లలిత, ప్రవీణ్‌లతోపాటు సుమారు 40మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ పరిగి అభివృద్ధిని కోరుకునే వారంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. పరిగిలోని అన్ని కాలనీల నుంచి ఈ వలసలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. అందరూ కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ఎమ్మెల్యే ఆనంద్‌ సమక్షంలో..

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. వికారాబాద్‌ పట్టణం ఆలంపల్లిలోని కాంగ్రెస్‌ మాజీ కౌన్సిలర్‌ చింతకింది రామస్వామితో పాటు 100మందికి పైగా అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులను చూసే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారన్నారు. ముఖ్యమంత్రి రాజకీయాలకు అతీతంగా నిరుపేదలందరికి లబ్ధిచేకూరేలా చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా  పార్టీలో చేరిన రామస్వామి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్‌ ఎన్నికల్లో చింతకింది రామస్వామి 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. కాగా 14వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన అభ్యర్థి మంచన్‌పల్లి సురేశ్‌ అధిష్టానం సూచన మేరకు నిర్ణయాన్ని గౌరవించి తన నామినేషన్‌ను ఆదివారం విత్‌డ్రా చేసుకున్నాడు. 


logo