శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Jan 13, 2020 , 00:48:41

ఆదర్శనీయుడు స్వామి వివేకానంద

ఆదర్శనీయుడు స్వామి వివేకానంద
  • - యువత ఆయన అడుగు జాడల్లో నడవాలి
  • - జయంతి వేడుకల్లో పలువురు నాయకులు

తాండూరు టౌన్‌: భారతదేశ ఖ్యాతిని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద అందరికి ఆదర్శనీయుడని పలువురు నేతలు అభివర్ణించారు. ఆదివారం తాండూరులో స్వామి వివేకానంద 157వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పలువురు నేతలు పూల మాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా సాయిపూర్‌లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటడంతో పాటు సమాజాన్ని జాగృతం చేసిన స్వామి వివేకానంద అందరికి ఆదర్శనీయుడని అభివర్ణించారు. అందరు స్వామి వివేకానంద అడుగు జాడల్లో నడిచి.. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కొట్రిక విజయలక్ష్మి, నాయకులు మురళీకృష్ణగౌడ్‌, పట్లోళ్ల నర్సింలు, వినోద్‌జైన్‌, పి. రామకృష్ణ, తిప్పయ్య, బీడే వీరభద్రప్ప, యువకులు జగదీశ్‌ యాదవ్‌, రాజు, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దేముల్‌: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో యువజన సంఘాల సభ్యులు, వివిధ పార్టీ నాయకులు స్వామి వివేకానంద 157వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాలకు, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. యువత సన్మార్గాన్ని ఎంచుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండి జీవనం కొనసాగించాలన్నారు. ప్రతి ఒక్కరూ వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడువాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల యువజన సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, సర్పంచ్‌, ఎంపీటీసీ, గ్రామస్తులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
తాండూరు రూరల్‌: స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని తాండూరు మండలం గౌతాపూర్‌ సర్పంచ్‌ రాజప్ప సూచించారు. ఆదివారం   పంచాయతీ కార్యాలయంలో స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌రావు, యువత, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని కరణ్‌కోట, జినుగుర్తి గ్రామాల్లో కూడా యువత స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. స్వామి వివేకానంద విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

యాలాల: వివేకానంద అడుగుజాడల్లో యువత నడవాలని యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి అన్నారు. ఆదివారం లక్ష్మీనారాయణపూర్‌ చౌరస్తాలో ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

హిందూ సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నతుడు వివేకానందుడని, ఆయన అడుగు జాడలో ప్రతి యువత నడవాలన్నారు. సమస్యలు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలోఅగ్గనూర్‌ సర్పంచ్‌ భీమప్ప, ఎస్‌ఎంసీ చైర్మన్‌ వెంకటయ్య, చెన్నారం మాజీ సర్పంచ్‌ శివకుమార్‌, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ సురేందర్‌రెడ్డి, నాయకులు నాగయ్యగౌడ్‌, యాదప్ప, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo