శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Jan 12, 2020 , 01:06:43

జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులు

జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులు

పరిగి, నమస్తే తెలంగాణ : స్మార్ట్‌ జీనియస్‌ అబాకస్‌ సంస్థ వారు గత నెలలో నిర్వహించిన ప్రతిభా పరీక్షలో పరిగిలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూ ల్‌ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 200పాఠశాలలకు చెందిన 8వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరిగి కృష్ణవేణి పాఠశాలకు చెందిన హర్షవర్ధన్‌, సిద్ధార్థ, మహ్మద్‌ అయ్యాన్‌, శ్రీవర్ధన్‌లు జాతీయస్థాయి చాంపియన్‌షిప్‌లో గెలుపొందారు. అలాగే మొదటి బహుమతిని రిషిక(యూకేజీ), ఆరాధ్య(ఒకటవ తరగతి), హరీశ్‌(రెండవ తరగతి), మోక్ష(మూడవ తరగతి), ఎన్‌.స్వాతి, రెండవ బహుమతిని మహమ్మద్‌ ఆలీ(రెండవ తరగతి), సాద్విక(మూడవ తరగతి), జయశ్రీ(మూడవ తరగతి)లు, మూడవ బహుమతిని పర్వీన్‌బేగం, గంగాదేవి, అనూహ్య, అశ్వీత్‌, అనన్య, హేమశ్రీ, నిఖిలేశ్వర్‌రెడ్డిలు గెలుపొందారు. వారందరికీ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్య, విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డిల చేతులమీదుగా బహుమతు లు అందజేశారు. అబాకస్‌ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం. శ్రీనివాస్‌ రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.


logo