మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jan 12, 2020 , 01:04:37

పాఠశాలల్లో ముగ్గుల పోటీలు

పాఠశాలల్లో ముగ్గుల పోటీలు

పూడూరు : విద్యార్థినీలు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని హెచ్‌ఎంలు కిషన్‌, మల్లేశంలు పేర్కొన్నారు. శనివారం పూడూరు మండలం నిజాంపేట్‌ మేడిపల్లి, తుర్కే ఎన్కెపల్లిలోని ప్రాథమిక పాఠశాలల్లో సంక్రాంత్రి పండుగా సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉదయం నుంచి పాఠశాల ఆవరణలో పలు రంగులతో ముగ్గులు వేశారు. ముగ్గుల మద్యలో గొబ్బెమ్మలను అలంకరించి, నవధాన్యాలు వేసి పూజలు చేసిన అనంతరం గాలి పటాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధానోప్రాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం పుస్తకాల్లో పాఠాలు బోధించడం కాకుండా పండుగలు వాటిని జరుపుకునే విధానం పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. చిన్న పిల్లలు, పెద్దలు గాలి పటాలు ఎగురవేస్తు సంతోషంగా జరుపుకునే పండుగ అని తెలిపారు. ముగ్గులు వేసిన విద్యార్థులకు ప్రోత్సాహం కోసం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్లు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.


logo