గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jan 12, 2020 , 01:02:49

“ప్రగతి” పనులు భాగున్నాయి

“ప్రగతి” పనులు భాగున్నాయి
  • -ైప్లెయింగ్‌ స్కాడ్‌ అధికారి, డీఆర్వ్‌ మోతీలాల్‌

కోట్‌పల్లి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పనుల్లో నాణ్యతను పెంచి, గ్రామాలను అందంగా తీర్చిదిద్దుకోవాలని ైప్లెయింగ్‌ స్కాడ్‌ అధికారి, డీ ఆర్‌వ్వో మోతీలాల్‌ అన్నారు. శనివారం మండల పరిధిల్లోని బీరోల్‌, నాసన్‌పల్లి, కరీంపూర్‌, మో త్కుపల్లి, బార్వాద్‌, ఎన్కెపల్లి తదితర గ్రామాలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పనులను సందర్శించి పరిశీలించారు. ఏఏ పనులు చేశారని అడిగి.. గ్రా మాల్లో తిరిగి చూశారు. కొన్ని గ్రామాల్లో ప్లాస్టిక్‌ వాడకాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరీంపూర్‌, బార్వాద్‌, మోత్కుపల్లి గ్రామాల్లో పనులు బాగున్నాయని కితాబిచ్చారు. తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్‌ యార్డులకు తరలించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ఎవరైతే అధికారులకు సహకరించకుండా, వ్యతిరేకంగా ఉంటారో వారికి జరిమానా విధించాలని ఆయన సూచించా రు. గ్రామాల్లో ఎలాంటి ప్లాస్టిక్‌, చెత్త కనిపించరాదని, కనిపిస్తే ఎవరు వేశారో తెలుసుకుని వారికి పంచాయతీ నుంచి జరిమానా విధించి వసూలు చేయాలని కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు (కరీంపూర్‌ సర్పంచ్‌) అనిల్‌కుమార్‌, సర్పంచ్‌ల సం ఘం మండల అధ్యక్షులు వెంకటేశ్‌యాదవ్‌, సర్ప ంచ్‌లు, ఆయా గ్రామాల కార్యదర్శులు, నోడల్‌ అ ధికారులు పాల్గొన్నారు.


logo