సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jan 09, 2020 , 19:33:17

ఇంకుడుగుంతలు తప్పనిసరి

ఇంకుడుగుంతలు తప్పనిసరి

ధారూరు : గ్రామాల్లోని ప్రజలు ఇంటింటికీ ఇంకుడుగుంత, వ్యక్తి గత మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలని జిల్లా ఎస్సీ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ అధికారి విజయలక్ష్మి అన్నారు. బుధవారం ధారూరు మండల పరిధిలోని స్టేషన్‌ ధారూరు గ్రామంలో రెండో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో కంపోస్టు షెడ్డు, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, శ్మశానవాటికలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ డెవలప్‌మెంట్‌ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి డంపింగ్‌యార్డు, కంపోస్టు షెడ్డు, శ్మశానవాటిక తప్పనిసరిగా నిర్మించుకోవాలని, నిర్మించుకోవానివారు త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామంలో మురుగు కాల్వలను శుభ్రం చేసుకొని, ఎక్కడ మురుగు నీరు నిలువకుండ చూసుకోవాలన్నారు. హరితహారం నాటిన మొక్కలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. రోడ్లకు ఇరువైపున ఉన్న మొక్కలకు ట్రీ గాడ్స్‌ ఏర్పాటు చేసి వాటిని రక్షించాలన్నారు. గ్రామం స్వచ్ఛ గ్రామంగా ఏర్పడాలంటే ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రం చేసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. రెండో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలు, ఐకేపీ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.


logo