గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jan 09, 2020 , 19:32:40

గ్రామాల పారిశుద్ధ్యం మన బాధ్యత

గ్రామాల పారిశుద్ధ్యం మన బాధ్యత

మోమిన్‌పేట : మన గ్రామాలను పరిశుభ్రం చేసే బాధ్యత మనమే తీసుకోవాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ బి.విజయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం మోమిన్‌పేట మండల కేంద్రంలో రెండో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్‌ చైర్మన్‌ బి.విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ పల్లెప్రగతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించుకొని ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. గ్రామానికి శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, కంపొస్టు షెడ్లను నిర్మించుకొని ఉపయోగించుకోవాలన్నారు. తడి,పొడి చెత్తలను వేరు చేసి డంపింగ్‌యార్డులకు తరలించాలన్నారు. నర్సరీల్లో మొక్కలను వచ్చే సంవత్సరానికి పెంచాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను రక్షించే బాధ్య త అందరు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికా రి శాంతి, శ్రీనివాస్‌రెడ్డి, శంకరయ్య, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, లలిత, రాజశేఖర్‌, సావిత్రమ్మ, శశిధర్‌రెడ్డి, వసంత, చం ద్రకళ, వార్డు సభ్యులు ఎజాజ్‌, పాషా, నాయకులు వెంకట్‌, మోహన్‌రెడ్డి, నరేష్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.


logo