సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jan 09, 2020 , 19:31:58

పల్లె ప్రగతి పనులు భేష్‌

పల్లె ప్రగతి పనులు భేష్‌

బషీరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులపై ఫ్లైయింగ్‌ స్కాడ్‌ అధికారి, అడిషనల్‌ చీఫ్‌ కంజర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, ఐఎస్‌ఏఫ్‌(ఏపీసీసీఎఫ్‌) స్వర్గం శ్రీనివాస్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని కాశీంపూర్‌, కోత్లాపూర్‌ గ్రామాల్లో పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ముందుగా కాశీంపూర్‌లో పర్యటించిన ఆయన పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శితో సమావేశమై మొదటి విడుతలో నిర్వహించిన పల్లె ప్రగతి పనులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. రెండో విడుత పల్లెప్రగతి ద్వారా చేపట్టే పనులపై ఆరా తీశారు. తడి,పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని సర్పంచ్‌కు, కార్యదర్శికి సూచించారు. చెత్త బుట్టలను పంపిణీ చేయకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దాతల సహాయంతో చెత్త బుట్టలను పంపిణీ చేసేలా చూడాలని పేర్కొన్నారు. గ్రామలో నిర్మిస్తున్న ఇంకుడుగుంతలను, మురుగు కాల్వలను చూశారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పంపిణీ చేస్తున్న మిషన్‌ భగీరథ నీళ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలో సూచించారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న నర్సరీని పరిశీలించా రు. ఎన్ని మొక్కలను పెంచుతున్నారు. గత సంవత్స రం ఎన్ని మొక్కలను నాటారు అనే విషయంను పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బందిని అడిగారు. కోత్లాపూర్‌లో పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఓ రైతు పొలంలో నాటిన టేకు మొక్కలను పరిశీలించి సంతో షం వ్యక్త పర్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో రమేశ్‌, ఉపాధి హామీ ఏపీవో శారద, ఈసీ నర్సింహరెడ్డి, సర్పంచ్‌లు వెంకటయ్య, రవి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.


logo