శనివారం 31 అక్టోబర్ 2020
Vikarabad - Sep 28, 2020 , 01:08:43

బాపూజీ సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే

బాపూజీ సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే


వికారాబాద్‌ : కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు మరువలేనివని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. ఆదివారం  స్థానిక సబితాఆనంద్‌ ఆవరణలో కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేకుండా పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాపూజీ ఆశయ సాధన కోసం పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ టౌన్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు లక్ష్మణ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

వికారాబాద్‌ : మున్సిపల్‌ కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేశ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పుష్పలతరెడ్డి, రామస్వామి, అనంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముత్తార్‌షరీఫ్‌, కో ఆఫ్షన్‌ సభ్యులు షకీల్‌ అహ్మద్‌, రాజమల్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు గిరిశ్‌ కొటారీ, మల్లికార్జున్‌, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, మున్సిపల్‌ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.