మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jan 15, 2020 , 00:16:32

ఆదర్శంగా మారాలి

ఆదర్శంగా మారాలి
  • ఈ నెల 16 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
  • ఎన్నికలకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ నారాయణ
  • నాలుగు మున్సిపాలిటీల పరిధిలో స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన
  • కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా

బొంరాస్‌పేట : పారిశుధ్య నిర్వహణలో గ్రామాలు ఆదర్శంగా మారాలని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తుంకిమెట్లలో చౌదర్‌పల్లి, మెట్లకుంట గ్రామాలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ట్రాక్టర్లను ఎమ్మెల్యే స్వయంగా నడిపి సర్పంచ్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంగా మార్చడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగానే గత ఏడాది సెప్టెంబరులో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ఈ ఏడాది జనవరిలో 11 రోజుల పాటు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. రెండు విడుతలుగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారాయని అన్నారు.

గ్రామాల్లో సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్‌ యార్డులకు తరలించేందుకు, హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోసి బతికించేందుకు ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను అందజేయాలని నిర్ణయించిందని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. ట్రాక్టర్లను సర్పంచ్‌లు సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో పారిశుధ్య లోపించకుండా చర్యలు తీసుకోవాలని, నాటిన మొక్కలను కాపాడి పచ్చదనం పెంచాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మెట్లకుంట, తుంకిమెట్ల సర్పంచ్‌లు కావలి నారాయణ, స్వరూప, బొంరాస్‌పేట ఎంపీటీసీ శ్రావణ్‌గౌడ్‌, మండల టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, పార్టీ నాయకులు నెహ్రూ, రవిగౌడ్‌, అంజిలయ్య, కృష్ణ పాల్గొన్నారు.       


logo