బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Jan 15, 2020 , 00:15:24

మున్సిపోల్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

మున్సిపోల్స్‌కు  పకడ్బందీ  ఏర్పాట్లు
  • మున్సిపాలిటిల్లో స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ
  • 16నుంచి ఇంటింటికీ ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ
  • పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ పూర్తి
  • పోలింగ్‌ స్టేషన్ల వద్ద పటిష్ట బందోబస్తు

వికారాబాద్‌ టౌన్‌ : త్వరలో జరుగబోయే మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్‌ అన్నా రు. మంగళవారం ఎస్పీ నారాయణతో కలిసి వికారాబాద్‌ జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌, పరిగి కౌం టింగ్‌ హాల్స్‌, స్ట్రాంగ్‌ రూంల ఏర్పాట్లను  పరిశీలించారు. వికారాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ను ఎస్‌ఏపీ కళాశాలలో ఏర్పాటు చేయగా, తాండూరులో సెయింట్‌మాక్స్‌ ఉన్నత పాఠశాలలో, కొడంగల్‌లోని ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలో, పరిగిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 22న జరిగే మున్సిప ల్‌ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయ డం జరిగిందన్నారు. పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా జరిగిందన్నారు. బ్యాలెట్‌ పేపర్లను డిజైన్‌ చేసి ప్రింటింగ్‌కు పంపడం జరిగిందన్నారు. ఈ నెల 16నుంచి ఫొటో ఓటర్‌ స్లిప్పులను బీఎల్‌వోల ద్వా రా నాలుగు మున్సిపల్‌లో ఇంటింటికీ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పంపిణీకి ముందు ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా నిర్భయంగా ఓటు వేసేందుకు ముం దుకు రావాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నా రు. కౌంటింగ్‌ సెంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా సిబ్బంది ఏజెంట్లు, రిటర్నింగ్‌ ఆఫీసర్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మున్సిపల్‌ అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో తాండూరు, కొడంగ ల్‌, పరిగి, వికారాబాద్‌ మున్సిపల్‌ అధికారులు, తాండూరు ఆర్డీవో వేణుమాదవ్‌, తదితరులు ఉన్నారు. 


పరిగిలో..

పరిగి, నమస్తే తెలంగాణ : పరిగిలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల నెం.1లో ఏర్పాటు చేయబోయే కౌంటింగ్‌ కేంద్రాన్ని ఎస్పీతో కలిసి కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నామినేషన్‌ల ఉపసంహరణ తర్వాత అభ్యర్థులకు గుర్తులు కేటాయించి, బ్యా లెట్‌ పత్రాల ముద్రణకు పంపించడం జరుగుతుందన్నారు. 


ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు ఎస్పీ నారాయణ 

తాండూరు టౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నారాయణ తెలిపారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఫ్లయిం గ్‌ స్కాడ్‌, స్టాటికల్‌ సర్వేలైన్‌ బృందాలను ఏర్పాటు చేయ డం జరిగిందన్నారు. తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌లోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 1.50లక్షల నగదు, రూ. 2.2లక్షల విలువైన వెండిని స్వాదీనం చేసుకున్నామని వెళ్లడించారు. అదే విధం గా దాదాపు 68మంది రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులను బైండోవర్‌ చేయడం జరిగిందని వివరించారు. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల నుంచే వివిధ ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు గుర్తుచేశారు. ఎన్నికల్లో శాంతి భద్రతలకు ఎవరైన విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట సహాయ ఎన్నికల నిర్వహణ అధికారి, తాండూరు మున్సిపల్‌ కమిషనర్‌ సాబేర్‌అలీ, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రవికుమార్‌, మున్సిపల్‌ అధికారులు ఉన్నారు. 


ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ఎస్పీ

కొడంగల్‌ రూరల్‌ : మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్‌, ఎస్పీ మంగళవారం పరిశీలించారు. ఎన్నికల తరువాత బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచే, ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పా టు చేసిన కేంద్రాలను వారు పరిశీలించారు. బ్యాలెట్‌ బాక్సులకు భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలను వారు అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా కలెక్టర్‌, ఎస్పీ అధికారులకు సూచించారు.


logo