మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jan 15, 2020 , 00:14:53

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

వికారాబాద్‌ టౌన్‌ : ప్రజలు ఆశీర్వదిస్తే వార్డు అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర విద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్‌ నాగేంద్‌గౌడ్‌ అన్నారు. ఆయన మంగళవారం వికారాబాద్‌ పట్టణంలోని 34వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనంతలక్ష్మి విజయేందర్‌గౌడ్‌కు మద్దతుగా  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.   కాలనీ వాసులందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్నామని వివరించారు. వికారాబాద్‌ పట్టణ వాసులందరికీ తమ కుటుంబం తెలుసునన్నారు. తాను  విద్య మౌళిక సదుపాయాల కల్పన చైర్మన్‌గా పనిచేస్తున్నాని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని స్పష్టం చేశారు.  దివ్యాంగులు, వృద్ధులకు ఆసరా పింఛన్‌లను అందించడం జరుగుతుందని తెలిపారు. కాలనీ ప్రజలకు ఎలాంటి సమస్యలు తలేత్తకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు..  టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలందరి మద్దతు కూడగట్టాలన్నారు. ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు.  సీఎం కేసీఆర్‌ ఆశయ సాధనకు పని చేస్తామన్నారు. తాజావార్తలు


logo