e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home రంగారెడ్డి నేటి నుంచి కొత్త కార్డులు

నేటి నుంచి కొత్త కార్డులు

  • రంగారెడ్డి జిల్లాలో 35,488 కొత్త రేషన్‌ కార్డులు
  • వికారాబాద్‌ జిల్లాలో 6,691 …
  • రాజేంద్ర నగర్‌, బాలాపూర్‌, పరిగిలలో అందజేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో …
  • వచ్చేనెల నుంచి లబ్ధిదారులకు రేషన్‌ సరఫరా

రంగారెడ్డి, జూలై 25, (నమస్తే తెలంగాణ): నేటి నుంచి కొత్త రేషన్‌ కార్డు లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాలశాఖ అధి కారులు కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని రాజేంద్రనగర్‌తోపాటు మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్‌లో రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పాల్గొని లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి ఇప్పటికే ముద్రణ పూర్తికాగా, ఆయా నియో జకవర్గాల్లో రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను ఆయా మండలాల తాసిల్దార్లు పర్యవేక్షించనున్నారు. జిల్లాలో రేషన్‌ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ దాదా పు పదిహేను రోజులపాటు క్షుణ్ణంగా నిర్వహించారు. అయితే రేషన్‌ కార్డుల పరిశీలన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించిన జిల్లా పౌరసర ఫరా ల శాఖ యంత్రాంగం నిజమైన అర్హులను మాత్రమే ఎంపిక చేసి జాబితాను సిద్ధం చేసింది. జిల్లాలో కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ దాదాపు సోమవారం పూర్తి కానుండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రోజుల్లోగా పూర్తి చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్త రేషన్‌ కార్డుదారులకు వచ్చేనెల నుంచి రేషన్‌ బియ్యం తోపాటు ఇతర సరుకులను పంపిణీ చేయనున్నారు.

జిల్లాలో 47,342 దరఖాస్తులురాగా, 11,854 దరఖాస్తులను తిరస్కరించిన అధికారులు 35,488 కార్డులకు ఆమోదం తెలిపారు. కొత్త రేషన్‌ కార్డు ల్లో గ్రామీణ ప్రాంతంలో 14,280 కార్డులుండగా, పట్టణ ప్రాంతంలో 21,208 కార్డులున్నాయి.జిల్లాలో ఇప్పటివరకు 4,89,294 తెల్లరేషన్‌ కార్డులుండగా, కొత్త కార్డులతో జిల్లాలో తెల్లరేషన్‌ కార్డుల సంఖ్య 5,24, 782కు పెరుగనుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌-1303, ఆమన్‌గల్లు-281, బాలాపూర్‌-1936, చేవెళ్ల-310, చౌదరిగూడెం-186, ఫారూఖ్‌నగర్‌-692, గండీపేట-1350, ఇబ్రహీంపట్నం-1091, కడ్తాల్‌-180, కందుకూరు-1042, కేశంపేట-245, కొందుర్గు-164, కొత్తూరు-295, మాడ్గు ల-361, మహేశ్వరం-837, మంచాల-375, మొయినాబాద్‌-797, నందిగామ- 187, షాబాద్‌-305, శంషాబాద్‌-988, యాచారం-593, శంకర్‌పల్లి-453, తలకొండపల్లి-309, శేరిలింగంపల్లి-5050, రాజేం ద్రనగర్‌-6096, ఎల్‌బీనగర్‌లో 10,062 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. జిల్లావ్యాప్తంగా కొత్త తెల్లరేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా అర్బన్‌ పరిధిలోని సరూర్‌నగర్‌, బాలాపూర్‌, గండిపేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలా ల్లో ఉన్నాయి. జిల్లాలో అందిన దరఖాస్తుల్లో సగానికిపైగా సరూర్‌నగర్‌ మండలంలోనే ఉండడం గమనార్హం. ప్రస్తుతం 4,89,294 కార్డుదారులకు జిల్లాలో నెలకు 26,937 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా పెరిగిన తెల్లరేషన్‌ కార్డులతో 250 మెట్రిక్‌ టన్నుల బియ్యం అదనంగా అవసరమని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు.

- Advertisement -

వికారాబాద్‌ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి…
వికారాబాద్‌ జిల్లా పరిధిలో 6,691 నూతన తెల్లరేషన్‌కార్డులు జారీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని చర్యలను చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా మీ సేవ ద్వారా తెల్లరేషన్‌కార్డుల కోసం మొత్తం 7,424 మంది దరఖాస్తు చేసుకున్నారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఆయా గ్రామాలలోని దరఖాస్తుదారులను స్వయంగా కలిసి వివరాలు సేకరించారు. తెల్లరేషన్‌కార్డులకు అర్హులా కాదా అని నిర్ణయించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లాలో 733 దరఖాస్తులను తిరస్కరించగా, 6,691 తెల్లరేషన్‌కార్డులు మంజూరయ్యాయి. పేదలకు తెల్లరేషన్‌కార్డులు అందజేయనుండడంతో వారిలో సంతోషం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతిగా మారోసారి నిరూపించుకున్నారని పేర్కొంటున్నారు. కొత్తగా కార్డులు జారీ చేయడంతో వారికి సబ్సిడీపై రేషన్‌ బియ్యం అందనున్నాయి. నవాబుపేట్‌ మండలంలో 202 తెల్లరేషన్‌కార్డులు, బొంరాస్‌పేట్‌లో 261, దౌల్తాబాద్‌లో 326, కొడంగల్‌లో 254, దోమలో 453, కులకచర్లలో 229, పరిగిలో 398, పూడూరులో 331, బషీరాబాద్‌లో 440, పెద్దేముల్‌ లో 372, తాండూరులో 1,157, యాలాల్‌లో 525, బంట్వారంలో 159, ధారూర్‌లో 361, కోట్‌పల్లిలో 205, మర్పల్లిలో 245, మోమిన్‌పేట్‌లో 306, వికారాబాద్‌లో 467 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు మం జూరయ్యాయి. వాటిని ఆయా మండలాల్లో పంపిణీ చేపట్టనున్నారు.

నేడు పరిగిలో ప్రారంభించనున్న మంత్రి సబితారెడ్డి

ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్న తెల్ల రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సోమవారం పరిగి పట్టణంలో ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలోని మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి మంత్రి పరిగి మండలానికి సంబంధించి 398 మంది లబ్ధిదారులు, దోమ మండలానికి సంబంధించిన 453 మంది లబ్ధిదారులకు తెల్ల రేషన్‌కార్డులు అందజేయనున్నారు.

నెరవేరనున్న కల…
పేదల కష్టాలు ఎరిగిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రేషన్‌ కార్డుల పంపిణీకి పూనుకున్నది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల నెరవేరనుంది. సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతిగా మారోసారి నిరూపించుకు న్నా రు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వేల మందికి లబ్ధిచేకూరనుంది.
-మ్యాకల సునిత, అయినాపూర్‌ దోమ మండలం

మేలు కలిగించే నిర్ణయం
తెల్లరేషన్‌కార్డులు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం పేదలకు మేలు కలిగించే నిర్ణయం తీసుకున్నది. కొం దరికి రేషన్‌కార్డులు లేకపోవడం వల్ల ఇబ్బంది కలి గేది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులకు రేషన్‌ కా ర్డులు మంజూరు చేయడం ద్వారా రేషన్‌ సరుకులు పొందడానికి అవకాశం కల్పించింది.

-గండి మహేశ్వరి, కులకచర్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana