తాండూరు : తాండూరు నియోజకవర్గం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా తాండూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్‌ను నియమిస్తూ తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్‌కుమార్ శనివారం నియామక పత్రం అందజేశారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షుని సూచన మేరకు బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా శ్రీకాంత్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఎల్లప్పడు యువతకు, విద్యార్థులకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ప్రతినిధులు, విద్యార్థులు ఉన్నారు.