e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home vikarabad అభివృద్ధి పథంలో అంతారం చెరువుముందలితండా గ్రామ పంచాయతీ…

అభివృద్ధి పథంలో అంతారం చెరువుముందలితండా గ్రామ పంచాయతీ…

కులకచర్ల, ఆగస్టు : అది కొత్తగా ఏర్పడిన నూతన గ్రామ పంచాయతీ. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా వివిధ అభివృద్ధి పనులలో ముందుకెళుతున్న గ్రామ పంచాయతీ. తక్కువ కాలంలో ఎక్కవ అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీ. అదే కులకచర్ల మండలం చెరువుముందలితండా(ఎ) గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో గ్రామ సర్పంచ్ ఉత్సాహంగా పనులు చేయడం వల్ల ఆ గ్రామం అతి తక్కువ సమయంలో పల్లె ప్రగతిలో నిర్వహించాల్సిన అన్ని పనులు పూర్తయ్యాయి.

పల్లె ప్రగతిలో నిర్వహించాల్సిన పనులు స్మశానవాటిక నిర్మాణం, డంపింగ్ యార్డు ఏర్పాటు, కంపోస్ట్ షెడ్ నిర్మాణం, పల్లె ప్రకృతి వనం, గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపుల అహ్లాదకరంగా కనిపించే మొక్కలు, సీసీ రోడ్లు, రైతులకు కల్లాలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు, అదనపు గ్రామాలకు మట్టి రోడ్ల ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చెరువుముందలితండా గ్రామ సర్పంచ్ పద్మరవిలాల్ చర్యలు తీసుకుంటున్నారు. చెరువుముందలితండా(ఎ) అభివృద్ధిపై పల్లె ప్రగతిలో భాగంగా నమస్తే తెలంగాణ ప్రత్యేక పథనం…

- Advertisement -

చెరువుముందలితండా(ఎ) గ్రామ పంచాయతీ అంటే కులకచర్ల మండలం అంతారం గ్రామ పంచాయతీ నుండి నూతనంగా గ్రామ పంచాయతీగా ఏర్పడినదే చెరువుముందలితండా గ్రామ పంచాయతీ. చెరువుముందలితండాలో 517జనాభ ఉండగా, 450 మంది ఓటర్లు ఉన్నారు. 150 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీకి నేరెళ్లకుంట తండా, హరిశ్చంద్రనాయక్‌తండాలు రెండు అనుబంధ గ్రామాలు ఉన్నాయి. అంతారం గ్రామ పంచాయతీ నుంచి విడిపోయిన చెరువుముందలితండా గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఇతర గ్రామ పంచాయతీలతో పాటు పోటిపడుతోంది. తెలంగాణ పల్లె ప్రగతిలో వివిద అభివృద్ధి పనులు పూర్తి చేసిన గ్రామ పంచాయతీ. కులకచర్ల మండల కేంద్రానికి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువుముందలితండా పెద్ద గ్రామ పంచాయతీలతో పాటు అభివృద్ధిలో పోటి పడుతోంది.

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు గ్రామ సర్పంచ్ పద్మరవిలాల్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి గ్రామంలో అభివృద్ధికి నోచుకోలేని గ్రామం తెలంగాణ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన తరువాత చెరువుముందలితండా ప్రత్యేకించి గ్రామ పంచాయతీగా ఏర్పడిన తరువాత గ్రామంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. పల్లె ప్రగతిలో నిర్వహించాల్సిన పనులను పూర్తి చేశారు. ముఖ్యంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు నడుంభిగించిన సర్పంచ్ గ్రామంలో అతితక్కువ కాలంలోనే వివిద అభివృద్ధి పనులను పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు.

35 లక్షలతో అభివృద్ది పనుల నిర్వహణ…

కులకచర్ల మండల పరిధిలోని చెరువుముందలితండా గ్రామ పంచాయతీలో 35 లక్షతో వివిద అభివృద్ధి పనులు నిర్వహించారు. ముఖ్యంగా గ్రామంలో నిర్వహించాల్సిన అభివృద్ధి పనులు పూర్తి చేయడంతో పాటు నిర్వహించాల్సిన పనుల గురించి ప్రణాళికలు చేసి పెట్టుకొని గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు సర్పంచ్ చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక నిధులను కేటాయిచడంతో పల్లె ప్రగతి పనులకు భారీగా నిధులను కేటాయించడంతో గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. మరిన్ని నిధులను తీసుకువచ్చి గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో ఉంచేందుకు గ్రామ సర్పంచ్ ప్రయత్నం చేస్తున్నారు.

అహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం…

మండలంలో ఎక్కడ లేని విదంగా పల్లె ప్రకృతి వనంలో మొక్కలు పెంచి, పల్లె ప్రకృతి వనానికి ముఖద్వారం ఏర్పాటు చేసి పట్టణాల్లో ఉండే పార్క మాధిరిగా పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. చెరువుముందలితండా గ్రామ పంచాయతీ సమీపంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం చూపరులను ఆకట్టుకుంటోంది. పల్లె ప్రకృతి వనాన్ని గుట్టపై ఏర్పాటు చేసి అన్ని రకాలైన మొక్కలను నాటారు.

పూర్తైన స్మశానవాటిక, కంపోస్ట్ షెడ్ నిర్మాణం….

చెరువుముందలితండా గ్రామ పంచాయతీలో స్మశానవాటిక నిర్మాణం, కంపోస్ట్ షెడ్ నిర్మాణం పనులు పూర్తి చేశారు. గ్రామాల్లో స్మశానవాటికలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భావించిన తెలంగాణ సర్కార్ ప్రతి గ్రామంలో స్మశాన వాటికలు ఏర్పాటు చేసేవిదంగా చర్యలు తీసుకుంది. కంపోస్ట్ షెడ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. కంపోస్ట్ ఎరువుతయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. కంపోస్ట్ షెడ్‌లో వివిద రకాల వ్యర్థాలను వేరు చేసి వేరుగా వేసేందుకు ఏర్పాటు చేశారు.

పరిసరా పరిశుభ్రతకు చర్యలు…

చెరువుముందలితండా గ్రామ పంచాయతీలో పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో గ్రామంలో మురుగునీటి కాల్వలు సక్రమంగా లేక దోమలు ప్రభలడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. కాని నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడిన తరువాత పల్లె ప్రగతి ద్వారా వివిద పారిశుద్ధ్యపు పనులను నిర్వహించడంతో గ్రామంలో దోమల బెడద తప్పిందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ప్రతి రోజు గ్రామంలో ఉన్న చెత్తను తొలగించేందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామస్తులు ప్రతి రోజు సేకరించిన చెత్తను గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో వేయడంతో చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో గ్రామ పరిసరాల పరిశుభ్రత సక్రమంగా తయారైంది.

రోడ్డుకు ఇరువైపులా చెట్లు….

తెలంగాణ పల్లె ప్రగతిలో భాగంగా చెరువుముందలితండా గ్రామ పంచాయతీకి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో అవి గ్రామ పంచాయతీకి వెళ్లేదారిలో అహ్లాదాన్ని అందిస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం ద్వారా గ్రామానికి వెళ్లే దారి పచ్చగా కనిపిస్తుంది.

రైతులకు కల్లాలు, పశువుల పాకలు…

చెరువుముందలితండా గ్రామ పంచాయతీలో రైతులు పండించిన ధాన్యాన్ని శుభ్రం చేయడానికి కల్లాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో సుమారుగా 25 మంది రైతులు కల్లాలను, పశువుల షెడ్లను నిర్మించుకున్నారు. తద్వారా పంటను కల్లాలలో ఆరబెట్టుకుంటున్నారు.

అనుబంధ గ్రామాలకు రోడ్లు…


చెరువుముందలితండా గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామాలు ఉన్న హరిశ్చంద్రనాయక్‌తండా, నేరెళ్లకుంట తండాకు గ్రామ పంచాయతీ నిధుల ద్వారా మట్టి రోడ్లను ఏర్పాటు చేశారు. ప్రజలు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీతో పాటు అనుబంధ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు.

ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు…

చెరువుముందలితండాలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా నీటిని అందిస్తున్నారు. గతంలో నీటికోసం ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం మిషన్ భగీరధ ద్వారా నీటిని అందించడంతో గ్రామంలో తాగునీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం జరిగిందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.

ఒకే దగ్గర అన్ని వసతులు…

చెరువుముందలి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఒకే దగ్గర తెలంగాణ పల్లె ప్రగతిలో నిర్వహించాల్సిన అభివృద్ధి పనులు పూర్తి చేశారు. స్మశానవాటిక, డంపింగ్ యార్డు ఏర్పాటు, కంపోస్ట్ షెడ్ నిర్మాణం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు వంటి పనులు నిర్వహించారు.

“చెరువుముందలి తండా గ్రామ పంచాయతీని మండలంలోనే ఆదర్శగ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే గ్రామంలో వివిద అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగింది. స్మశానవాటిక నిర్మాణం, డంపింగ్ యార్డు ఏర్పాటు, పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశాం… గ్రామాన్ని మండలంలోనే ఆదర్శగ్రామ పంచాయతీగా తిర్చిదిద్దుతాం…” పద్మరవిలాల్, గ్రామ సర్పంచ్ చెరువుముందలితండా.

“గ్రామంలో అభివృద్ధి పనులు నిర్వహించి గ్రామాన్ని అన్ని విధాలుగా మండంలోనే అదర్శంగా తీర్చిదిద్దేందుకు ,ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేందుకు తమవంతు కృషిచేస్తాం”. పల్లె ప్రగతి పనులు పూర్తి చేశాం…భీమ్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, చెరువుముందలితండా.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana