పూర్వం ప్రమాదకర జంతువులు, విష ప్రాణుల నుంచి రక్షణ కోసం కర్రలు, కత్తులు వినియోగించేవారు. కర్రసాము, కత్తిసాము వంటి విద్యల్లో శిక్షణ తీసుకునేవారు. ప్రస్తుతం ఆ విద్యలు కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మహిళల ఆత్మరక్షణ కోసం ఈ విద్యలను వారధిగా మలుస్తోంది… తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ద్వారా మహిళలు, యువతులు, చిన్నారుల్లో ఆత్మస్థైర్యం పెంచుతోంది.