టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య, పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం వరుడు కావలెను. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని లక్ష్మీ సౌజన్య (డెబ్యూట్) డైరెక్ట్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు నుంచి కోల కళ్లే ఇలా..అంటూ రొమాంటిక్ టచ్‌తో సాగే పాట ప్రోమో వీడియోను మేకర్స్ విడుదల చేశారు. నాగశౌర్య హీరోయిన్ రీతూవర్మ ఫాలో చేస్తూ సాగుతున్న ఈ పాట అందరినీ అలరించడం ఖాయమని వీడియో చూస్తే తెలిసిపోతుంది.