వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం ! ఏటీఎంలో డబ్బులు తీయడానికి వెళ్లిన ఓ కస్టమర్.. అక్కడే ఉన్న శానిటైజర్ బాటిల్‌ను దొంగిలించాడు. కాసేపు ఏటీఎంలో ఉన్న ఆ వ్యక్తి.. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం గమనించి వెంటనే శానిటైజర్ బాటిల్‌ను తన బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. అక్కడే ఏటీఎం సెంటర్లోని సీసీ కెమెరాల్లో ఈ తతంగమంతా రికార్డయిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వీడి కక్కుర్తి పాడు గాను అని అనుకుంటున్నారు.