e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home వీడియోలు ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ 'జాతిర‌త్నాలు' టీజ‌ర్ విడుద‌ల‌

ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ‘జాతిర‌త్నాలు’ టీజ‌ర్ విడుద‌ల‌

న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం ‘జాతిర‌త్నాలు’. కామెడీ క్యాప‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి అనుదీప్ కె.వి. ద‌ర్శ‌కుడు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. థియేట‌ర్ల‌లో ఈ సినిమా న‌వ్వులు పూయిస్తుంద‌ని టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది.    ముగ్గురు ప్ర‌ధాన పాత్ర‌ధారులు న‌వీన్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి జైలులో ఖైదీలుగా న‌డ‌చుకుంటూ రావ‌డంతో  టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. ఆ న‌డ‌వ‌డంలోనూ  స్టైల్ ఉండ‌టం న‌వ్వు తెప్పించే విష‌యం. సెల్‌లో నుంచి ప్రియ‌ద‌ర్శి త‌న‌వైపు ముగ్గురు ఉన్నార‌ని.. వారు త‌మ‌న్నా, స‌మంత అని చెప్పి, మూడో పేరు కోసం త‌డుముకుంటుంటే ర‌ష్మిక అని అందిస్తాడు న‌వీన్‌.

వినోదం మాత్ర‌మే కాకుండా ఈ మూవీలో సీరియ‌స్ విష‌యం కూడా ఒక‌టి ఉంద‌ని ముర‌ళీ శ‌ర్మ ఎపిసోడ్ తెలుపుతోంది. రూ. 500 కోట్ల చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతున్న‌ది. న‌వీన్‌కు ఓ ల‌వ్ స్టోరీ కూడా ఉంద‌నే సంగతి ఈ టీజ‌ర్‌లో చూడొచ్చు. ర‌ధ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సిద్దం మ‌నోహ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. మార్చి 11న ‘జాతిర‌త్నాలు’ థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ 'జాతిర‌త్నాలు' టీజ‌ర్ విడుద‌ల‌

ట్రెండింగ్‌

Advertisement