e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News వాస్తు : ద‌క్షిణం పిశాచ స్థానం అంటే ఏంటి? ఆ స్థ‌లాన్ని వ‌దిలేసి ఇల్లు క‌ట్టాల‌ని అంటారు? ఎందుకు?

వాస్తు : ద‌క్షిణం పిశాచ స్థానం అంటే ఏంటి? ఆ స్థ‌లాన్ని వ‌దిలేసి ఇల్లు క‌ట్టాల‌ని అంటారు? ఎందుకు?

‘దక్షిణం పిశాచ స్థానం’ కాబట్టి కొంత స్థలం వదిలి నిర్మాణం చేపట్టాలంటారు. ఎంత వదలాలి? -కొండ శ్రీదేవి, దేవరుప్పల

దక్షిణం, పశ్చిమం దిక్కులను హద్దు చేసి ఇండ్లు కడితే వాటిలోకి గాలి, వెలుతురు సరిగ్గా ప్రసరించవు. దాంతో ఆ ఇండ్లలో ఉండేవాళ్లు ఎవరో ఒకరు అనారోగ్యంతో అవస్థలు పడుతుంటారు. కాబట్టి, అలాంటి గృహాలు పిశాచ నివాసాలు అవుతాయని అంటారు. అలా ప్రజల నోళ్లలోనూ నిలిచిపోయింది. ఏ ఇల్లయినా సరే చుట్టూ స్థలం వదిలిపెట్టకుండా నిర్మాణం చేపట్టకూడదు. అందువల్ల ఉన్న స్థలాన్ని బట్టి పెద్ద ఇల్లు నిర్మించకుండా, స్థలాన్ని సమానంగా విభజించాలి. ఇంటిచుట్టూ ప్రదక్షిణంగా ఖాళీ వదిలి ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. అయితే దక్షిణం, పశ్చిమ దిశల్లో తక్కువ ఖాళీని, తూర్పు, ఉత్తర దిక్కుల్లో ఎక్కువ ఖాళీని వదిలిపెట్టి ఇల్లు కట్టుకోవాలి. శాస్త్రపరంగా కట్టని‘చీకటి ఇండ్లన్నీ’ పిశాచ నివాసాలే అవుతాయి.

- Advertisement -

సుద్దాల సుధాకర్‌ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement