e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 23, 2021
Advertisement
Home బతుకమ్మ వాస్తు

వాస్తు

వాస్తు

గుట్ట మీద ఇల్లు కడితే దిశలు చూడాలా? అదీ అప్పుడప్పుడు వెళ్లడం కోసమే.
వివరంగా చెప్పండి. అసలు కట్టుకోవచ్చా?- సింగరేణి ఆమని, ఖమ్మం.

ఇల్లు ఏ చోటున కట్టాలి అనేది, ఆయా స్థలాలు చూశాకనే నిర్ణయించాలి. ఎత్తుమీద, ‘గుట్టమీద’ ఇల్లు కట్టవద్దు అనే నియమం లేదు. దిశ అనుకూలత, భద్రత ఉన్నచోట గృహం నిర్మించుకోవచ్చు. అలాగని ‘కళ్లు చూసిన అన్ని ప్రదేశాలకూ శాస్త్రం కాళ్లు వెళ్లలేవు. మీరు కట్టాలనకున్న ఎత్తయిన ప్రాంతంపై.. గుట్టమీద దిశ కలిగిన స్థానాన్ని ముందు ఎంచుకోండి. అది నలు చదరంగా చేసుకోవాలి. దానిపైకి రావడానికి సరైన రోడ్డును ఆ స్థలానికి ‘పోటు రాకుండా’ వేసుకోండి. ఆ స్థలంలో చుట్టూ కావాల్సినంతం ఖాళీ వదిలి, ఇంటి ప్లాను వేసుకోండి. అన్నీ కుదిరాక ఇంటి నిర్మాణం మొదలు పెట్టండి. గుట్టమీద అయినా, నేలమీద అయినా దిశలు చక్కగా కుదిరిన స్థలం ఉంటేనే ఇల్లు కట్టాలి. ఎత్తు ఉందనో, బాగుందనో కట్టవద్దు. శాస్త్ర ఆమోదం ఉండాలి.

బేస్‌మెంట్‌ పెద్దగా చేసి షాపింగ్‌ కాంప్లెక్స్‌ కడుతున్నాం. ఆ బేస్‌మెంట్‌లోకరెంటు ప్యానల్‌ గది ఎక్కడ పెట్టాలి?l శ్రీధర్‌ పాండె, షాద్‌నగర్
మీరు బేస్‌మెంట్‌ పెద్దగా చేసి, మీ నిర్మాణ అవసరం కోసం కడుతున్నారు. అది అలాగే ఉండాలి. దానిలో స్థలం కలిసొస్తుందనో.. అంత ఎత్తు బేస్‌మెంట్‌ కదా, దానిలో ఒక ‘గదిని’ గ్రౌండ్‌ లెవెల్‌లో పెట్టుకొనే అవకాశం ఉందనో.. ‘వక్రమైన ఆలోచనలు’ చేయవద్దు. నిర్మాణం కోసం కొన్నిచోట్ల ఎలివేషన్‌ చేస్తారు. దాని కోసం బయటి నుంచి కొన్ని గోడలు, స్లాబ్‌లు బయటకు కడుతూ ఉంటారు. అందులో భాగమే ‘బేస్‌మెంట్‌’ఎత్తుకూడా. అలాంటివి దేనికో అవసరమని అనిపిస్తాయి కానీ, వాటిని ఇంటి కోసం వాడకూడదు. అలాగే ఇంటి లోపలికి కలుపకూడదు. ఇంటి నక్షను అన్ని రకాలుగా చూశాకే ఇంటి నిర్మాణం ఆరంభించాలి. ఈ దశలో ప్లాను చెడగట్టే ప్రయత్నం చేయవద్దు. బేస్‌మెంట్‌లో గదుల ప్రస్తావనే మంచిది కాదు. ఇక అందులో కరెంటు మీటర్ల రూమ్‌ కట్టాలనుకోవడం పూర్తిగా నిషేధం. ఆ ఆలోచనలు మానుకోండి.

రాజుల కోటలు రాళ్లతో కడతారు కదా! అలా ఇల్లంతా రాళ్లతో కట్టుకోవచ్చా?l సిద్దేశ్వర్‌, కోరుట్ల
జలదుర్గాలు, గిరిదుర్గాలు, వన దుర్గాలు, కృతిమ దుర్గాలు అని కోటలు నాలుగు రకాలుగా ఉండేవి. రాజుల కోటలను మన గృహాలతో పోల్చుకోవద్దు. అప్పటి రాజుల జీవన విధానం వేరు. అయితే అవికూడా నివాసాలే కదా అనిపించవచ్చు. కానీ ఆనాడు పాలకులు భద్రత ప్రధానంగా కోటలు కట్టుకున్నారు. నాటి పరిపాలనా విధానంలో, ఎవరు బలవంతులైతే వారు కోటలను ఆక్రమించుకొని రాజుగా ప్రకటించుకొనేవారు. అనేపథ్యంలో బలమైన రాళ్లతో గోడలు అవసరం ఉండేవి. అలాగని గృహాలకు పూర్తిగా రాతిగోడలు వాడవద్దు. ఆ గోడలు నైరాశ్యాన్ని, మానసిక అస్థిరతను పెంచుతాయి. రాతిగోడల మధ్య ఆనందం కన్నా ఘర్షణాత్మక జీవితం అధికంగా ఉంటుంది. అందుకే, రాజుల కుటుంబాలు నిత్యం సంఘర్షణలతో మునిగితేలేవి. అంతెందుకు, తెలంగాణ జమీందార్లు కూడా అలాంటి రాతి గోడల మధ్య ఛిద్రమైన జీవితాన్ని అనుభవించారు. కాబట్టి ఇంటి గోడల నిర్మాణానికి ఇటుకలను వాడటమే ఉత్తమం.

తూర్పు వైపు ఎదురు రోడ్డు ఈశాన్యంలో వస్తుంది. అలాగే, పడమర సగం తరువాత ఎదురుగా ఇంకో రోడ్డు వస్తుంది. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చా?l సత్యవంశీ, వైరా
తూర్పు ఈశాన్యం వీధి రావడం, పడమర మీద వాయవ్య వీధి రావడం అన్ని విధాల మంచిదే. అయితే రెండు వీధులు వచ్చినప్పుడు, అవి రెండు కూడా దిశాత్మకంగా ఉండి ఉచ్ఛమైన దిశలో వస్తేనే వాటి ఫలితాలు ‘అమోఘంగా’ ఉంటాయి. మీరు పంపిన ప్లానులో పడమర నుంచి వచ్చే ఎదురు రోడ్డు ఉచ్ఛమైన దిశలోనే ఉంది కానీ, తూర్పుకన్నా మీ ప్లాటు సైజు పడమరలో ఎక్కువ ఉంది. దాన్ని పూర్తిగా ‘పశ్చిమ వాయవ్యం వీధి చూపుగా’ మర్చాలి. అంటే, ఆ వీధి వచ్చి తగిలిన చోటు తరువాత స్థలాన్ని అక్కడికే ‘కట్‌’ చేసి, ఆ చోటు నుంచి స్థలాన్ని ఉత్తర ఈశాన్యం పెంచుతూ ఉత్తరం ప్రహరీ కట్టండి. అప్పుడు తూర్పు ఈశాన్యం వీధిచూపు కూడా సక్రమంగా నిలుస్తుంది. ఈ రెండూ వీధిచూపునకు నిలబడేలా స్థలం హద్దులు సరి చేసి, అందులో శాస్త్రబద్ధంగా ఇల్లు కట్టండి.

సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678

ఇవీ కూడా చదవండి…

జిహ్వకు.. ‘బిళ్ల’ బంట్రోతు! రుచి అదిరిపోవాల్సిందే!

వాస్తు- రోడ్డు ఎత్తుగా ఉంటే దాని ప్రభావం ఇంటిమీద ఉంటుందా?

బ్రహ్మండ విగ్రహాలు

సిరిజనులు!

తెలంగాణ సినిమా కవులు యాసే..శ్వాసగా!

Advertisement
వాస్తు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement