e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home బతుకమ్మ వాస్తు: స్థలం బాగుండాలా? కట్టిన ఇల్లు బాగుండాలా? ఏది ముఖ్యం?

వాస్తు: స్థలం బాగుండాలా? కట్టిన ఇల్లు బాగుండాలా? ఏది ముఖ్యం?

షాపులు,ఇల్లు కలిపి నిర్మించాం. మేము కాంపౌండ్‌ ఎలా కట్టుకోవాలో సూచించగలరు? – వర్లు అనిరుధ్‌, నకిరేకల్‌

షాపులు జనాకర్షణతో ఉండాలి. ఇల్లు ‘ప్రైవసీ’తో ఉండాలి. ఇలా ఇల్లు, వాణిజ్య స్థలం ఒకటిగా చేసుకొన్నప్పుడు ఇంటిని మొదటి అంతస్తులో, షాపును కింది భాగంలో నిర్మిస్తుంటారు. మీరు దక్షిణం ముఖంగా ఉన్న స్థలంలో ఇల్లు కట్టారు. ఎటువైపు షాపులు వేస్తారో అటు కాంపౌండ్‌ పెట్టడం కుదరదు. షాపులకు, తూర్పు ప్రహారీకి మధ్య ఉన్న స్థలాన్ని బట్టి దక్షిణ ఆగ్నేయంలో గేటు పెట్టండి. పడమర ప్రహరీని దక్షిణం గోడ దగ్గర ఆపి, దక్షిణ నైరుతి మూసి షాపులకు ఆనించి కట్టండి. దక్షిణంలో షాపు ఫ్లోరింగ్‌తో సమానంగా అరుగు వేసుకోండి. మీకున్న స్థలం మేరకు తూర్పు-ఉత్తరంలో ప్రహరీ ఎత్తును నాలుగు అడుగులు ఉండేలా చూసుకోండి. పడమర ప్రహరీని ఐదు అడుగులు కట్టుకోండి. ఇంట్లో నుంచి షాపులకు ద్వారం పెట్టకండి. బయట నుంచే
వాడుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

స్థలం బాగుండాలా? కట్టిన ఇల్లు బాగుండాలా? ఏది ముఖ్యం? – కందగట్ల లక్ష్మి, రాయగిరి

గృహం, స్థలం రెండూ తల్లీబిడ్డల్లాంటివి. స్థల లక్షణాలు గృహంపై ఉంటాయి. కడుపులో పుట్టిన బిడ్డకు ఆమ్మానాన్న ఆలోచనలు, అభిరుచులు వస్తాయని కచ్చితంగా చెప్పలేం. కానీ, భూమి లక్షణాలు, అందులోని శక్తి గృహావరణంలో నిరంతరం ఉంటాయి. అదే బలం ఇంటిపై పని చేస్తుంది. అందుకే, శాస్త్ర సమ్మతమైన స్థలాన్ని ఎంచుకొని, అవసరాలకు తగిన ఇంటిని వాస్తు పద్ధతిలో కట్టుకున్నప్పుడే అది పరిపూర్ణ గృహం అనిపించుకుంటుంది. చాలా ప్రదేశాలు పనికిరాకుండా ఉంటాయి. వాటిని ఎంతో గొప్పగా చూపించి ఇండ్లు కడుతూ ఉంటారు. ఇంటిని ఆ స్థలం ఆక్రమిస్తుంది. తద్వారా దాని ప్రభావం ఇంటిపై ప్రస్ఫుటంగా ఉంటుంది. అలాగే ఆ ఇంటి ప్రభావం అందులో ఉంటున్న వారిపైనా పడుతుంది. ఇక గొప్ప స్థలంలో శాస్ర్తానికి విరుద్ధంగా ఇంటిని కట్టినా, ఆ గృహం ప్రభావం ఇంట్లోని వారిపై తప్పకుండా ఉంటుంది.

మా ఇంటికి దక్షిణ నైరుతి నుంచి ఇంటి సగభాగంలో పోటు పడుతుంది. ‘ఆ సగం’ అమ్మి మిగతా సగభాగంలో ఉండొచ్చా? – దొంతుల రమ్య, ఎల్‌.బి.నగర్‌

వీధిపోటు పడ్డ స్థలాన్ని వదులుకోవడం, తొలగించడం మంచి నిర్ణయం. మీ ఇంటి తూర్పు, పడమరల పొడవును బట్టి ఇంటిని సగభాగం చేసేటప్పుడు వీధి పోటు ఎంత వరకు పడుతుందో దానికి ఒక అడుగు ఎక్కువగానే తీసుకొని కట్‌ చేయండి.‘తూర్పు-పడమర’ రెండు భాగాలు పోర్షన్లుగా విడిపోయాక మధ్యలో ఎవరి గోడలు వాళ్లు కట్టుకోవాలి. స్థలం పోతుందని ‘పొత్తు’ గోడ కట్టుకోకూడదు. పోటు పడిన పోర్షన్‌ పోగా మిగతా తూర్పు భాగం ఇంట్లో ఆగ్నేయం వంటగది, నైరుతి, వాయవ్య భాగాల్లో ఒక్కో గది తీసుకొని, మధ్యలో హాలు వదిలి ‘వాస్తు’ను సవరించుకోండి.

మెట్ల రెయిలింగ్‌ కిటికీలో పడుతుంది. అలా ఉండొచ్చా? – చిట్ల శ్రీలక్ష్మి, కొంపల్లి

గది మూలలు, ద్వారం అంచులు, మెట్ల రెయిలింగ్‌ వాటికి ఎదురుగా ఉన్న ద్వారంలో పడటం దోషంగా భావించాలి. దీనినే ‘కోణాలు పడటం’గా చెబుతారు. ద్వారం అందరూ నడిచేదారి. పిల్లలు ద్వారాల నుంచి వేగంగా, నేరుగా పరిగెత్తుతూ ఉంటారు. అలాంటి సమయాల్లో వాటికి ఎదురుగా ఉండే మూలలు తగిలి ప్రమాదాలు జరుగవచ్చు. అంతేకాదు, మూలలు ద్వారంలో పడినప్పుడు బీరువాలు, మంచాలు తీసుకెళ్లడం కూడా కష్టం అవుతుంది. అందుకని, ద్వారాలకు ఎదురుగా, మూలలు అడ్డుగా ఉండకూడదు. మరో ద్వారం వచ్చినా, మెట్ల రెయిలింగ్‌ వచ్చినా సమంగా ఉండేలా చూసుకోవాలి. గమన వేగానికి నిరోధం కలుగకుండా చూసుకోవాలి. అయితే, మీ రెయిలింగ్‌ కిటికీలో పడుతుందని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి దోషమూ లేదు. ‘కిటికీ నడిచే మార్గం కాదు’ కాబట్టి దోషంగా భావించవద్దు.

సుద్దాల సుధాకర్‌ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana