e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News వాస్తు: ఒకే ఇంట్లో రెండు వంట గదులు ఉండవచ్చా?

వాస్తు: ఒకే ఇంట్లో రెండు వంట గదులు ఉండవచ్చా?

ఒకే ఇంట్లో రెండు వంట గ‌దులు ఉండ‌వ‌చ్చా? అన్న‌ద‌మ్ములు వేరుప‌డితే రెండో కిచెన్ ఎక్క‌డ క‌ట్టుకోవాలి.. దీంతో పాటు మ‌రికొన్ని సందేహాల‌కు వాస్తు నిపుణులు సుద్దాల సుధాక‌ర్ తేజ స‌మాధానాలిచ్చారు. అవి ఒక‌సారి చూద్దాం..

వాస్తు:ఒకే ఇంట్లో రెండు వంట గదులు ఉండవచ్చా?

ఒకే ఇంట్లో రెండు వంట గదులు ఉండవచ్చా? బొడిగె జగన్నాథ్‌, చేర్యాల

- Advertisement -

వంటగదిని ఈమధ్య ఫ్యాషన్‌గా మార్చేశారు. చూపించడానికి ఒకటి, వండుకోవడానికి ఒకటి కట్టేస్తున్నారు. నిజానికి కిచెన్‌ ఒక్కటే ఉండాలి. ‘ఒక కప్పుకింద రెండు పొయ్యిలు మంచిది కాదు’ అని మన పెద్దలు సమష్టి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని చెప్పారు. కుటుంబాల్లో విభేదాలు రాకుండా ఉండటానికి దీనిని సూత్రీకరించారు. అది వాస్తవం కూడా! ఆగ్నేయంలో ఒక వంటగది వచ్చాక, రెండోది ఎక్కడ పెడతారు? ఒకవేళ నిర్మించినా, అది ఆగ్నేయంలో కాకుండా దక్షిణానికి కానీ, తూర్పునకు కానీ విస్తరించి ఉంటుంది. ఇది శాస్త్రపరంగా దోషం. అన్నదమ్ములు వేరు పడితే, ఇంటి పైపోర్షన్‌లో ఆగ్నేయంలో కిచెన్‌ పెట్టుకోవాలి. ఒకే అంతస్తు ఉన్నట్లయితే ఇంటిని రెండు భాగాలు చేసినప్పుడు రెండు కిచెన్‌లు పెట్టుకోవచ్చు. యజమాని ఒక్కడే అయితే మాత్రం రెండు కిచెన్లు ఉండకూడదు.

వాస్తు: ఒకే ఇంట్లో రెండు వంట గదులు ఉండవచ్చా?

ఇంటి నిర్మాణంలో పిల్లర్లకోసం తీసే గుంతలన్నీ ఒకే పొడవు- వెడల్పు- లోతు ఉండాలా? తేడాలు ఉండవచ్చా? కోవెల అనుపమ, ఆలేరు

ఇంటి ప్లాన్‌ ప్రకారం ‘పిల్లర్స్‌ డిజైన్‌’ను ఇంజినీర్‌ నిర్ధారిస్తారు. ఆయా గదుల పొడవు, వెడల్పులనుబట్టి ‘కాలమ్‌ గుంతలు’ ఆధారపడి ఉంటాయి. ప్రధానంగా భూమి లక్షణాన్నిబట్టి గుంత లోతు నిర్ణయిస్తారు. ప్రత్యేకంగా ఇంత వెడల్పు, లోతు ఉండాలని చెప్పలేం. దగ్గరగా ఉన్న రెండు పిల్లర్లకు రెండు గుంతలు తీయడం వల్ల మట్టి కూలిపోయే అవకాశం ఉంటుంది. దీనిని నివారించడానికి రెండు, మూడు పిల్లర్లకూ ఒకే గుంత తవ్వుతారు. ఫౌండేషన్‌ విషయంలో ఇంజినీరు చెప్పే అంశాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఇంటి కాలమ్స్‌ అన్నిటికీ ఒకే గుంత తీయాల్సిన అవసరం లేదు.

వాస్తు: ఒకే ఇంట్లో రెండు వంట గదులు ఉండవచ్చా?

పక్కింటివాళ్ల బాల్కనీ మా ఇంటిస్థలంలోకి వచ్చింది. దోషం కాదా? అనంతుల సోమిరెడ్డి, శనిగచెర్ల

ఇంటి పరిధిని ఎవరికి వారు చాలా జాగ్రత్తగా స్థిరపరుచుకోవాలి. ఒకరి ఇంటి పరిధిలోకి మరొకరి బాల్కనీ చొచ్చుకొని రావడం మంచిది కాదు. అందుకే, మన పల్లెల్లో ఇప్పటికీ ‘షేర్‌ సందులు’ వదులుతూ ఉంటారు. దాని వల్ల ఎవరి పరిధి వారికి ఉంటుంది. ఇలా మరొకరి స్థలంలోకి బాల్కనీ రావడం వల్ల ఇద్దరికీ రక్షణ ఉండదు. కాంపౌండ్‌ దాటి బాల్కనీలు అస్సలు బయటకు రాకూడదు. ఇతరుల స్థానాలను చూడటం దోషమే అవుతుంది. అది మీకన్నా ఆ ఇంటివాళ్లకే ఇబ్బంది. ఇరుగు పొరుగు కాబట్టి, సామరస్యంగా మాట్లాడుకొని సరిచేసుకోండి.

మాస్టర్‌ బెడ్‌రూమ్‌ ఈశాన్యంలో టాయ్‌లెట్‌ ఉంది. అక్కడ స్థలం కూడా అంతే ఉంది. ఇలా ఉండవచ్చా? చింతల నాగార్జున, కరీంనగర్‌

మాస్టర్‌ బెడ్‌రూమ్‌లో స్థలం సగం వరకే ఉంది. మిగతా సగం లేదంటే, ఆ భాగాన్ని పక్కగదిలో కలుపుకొని ఉంటారు. అది తప్పు. ‘మాస్టర్‌’ అని ప్రధాన పడక గదిని పిలుస్తున్నాం. అది దోషరహితంగా ఉండాలి. ఆ గది నాలుగు మూలలూ కలిపి అందులోనే టాయ్‌లెట్‌ ఏర్పాటు చేయాలి. ఏ విధంగా కొలిచినా ఏ మూలకూడా పక్కగదిలోకి కానీ, హాలులోకి కానీ వెళ్లకూడదు. కొందరు హాలు సైజు నాలుగు మూలలు ఉండాలని, పెరగాలని మాస్టర్‌ బెడ్‌రూమ్‌ను ‘వాష్‌ బేసిన్‌’కోసం, ‘ఫ్రిజ్‌’కోసం కట్‌ చేస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు. మీరు మీ పడక గదిని సరి చేసుకొని దానిలోని టాయ్‌లెట్‌ను ‘వాయవ్యం’ వైపు మార్చుకొని ఈశాన్యం ఫ్రీ అయ్యేలా చేయండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

వాస్తు : గుట్ట మీద ఇల్లు క‌ట్ట‌వ‌చ్చా? ఒక‌వేళ ఇల్లు కడితే దిశలు చూడాలా?

వాస్తు : ఇల్లు పూర్తి కాకముందే గృహ ప్రవేశం చేయవచ్చా?

మాది మూడంతస్తుల ఇల్లు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లాన్‌ ఎక్కడ వేసుకోవాలి?

ఆలయ శంకుస్థాపన ఏ ప్రదేశంలో జరపాలి?

కూతురు, అల్లుడు మా ఇంటి పైపోర్షన్‌లో నివాసం ఉండకూడదని చెబుతున్నారు! నిజమేనా?l

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాస్తు: ఒకే ఇంట్లో రెండు వంట గదులు ఉండవచ్చా?
వాస్తు: ఒకే ఇంట్లో రెండు వంట గదులు ఉండవచ్చా?
వాస్తు: ఒకే ఇంట్లో రెండు వంట గదులు ఉండవచ్చా?

ట్రెండింగ్‌

Advertisement