e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home బతుకమ్మ వాస్తు: ఇంట్లోని ఏ గదిని ఇతరులకు అద్దెకు ఇవ్వొచ్చు?

వాస్తు: ఇంట్లోని ఏ గదిని ఇతరులకు అద్దెకు ఇవ్వొచ్చు?

ఇంటి పిల్లర్‌ గుండ్రంగా ఉండొద్దని అంటారు. మరి ఈశాన్యంలోని బావిపైన గుండ్రంగా రింగులు వేస్తే దోషం కాదా? – చంద్రకళ, గుండాల

గుండ్రంగా ఉండే వాటి కన్నా, చతురస్రంగా ఉండే నిర్మాణాల ‘విశిష్టత’ వేరు. మీరు అడిగిన ప్రశ్న పిల్లర్లకే కాదు, నిర్మాణాల రూపాలన్నిటికీ వర్తిస్తుంది. గృహ నిర్మాణంలో గుండ్రటి పిల్లర్లు పనికి రావు. చతుర్రసం, దీర్ఘ చతురస్రం మాత్రమే ఉండాలి. ఇంటి ముందు ఉండే బావి పైభాగంలో గోడ గుండ్రంగానే కట్టాలి. చతురస్రంగా కడితే, దాని కోణాలు ఇంట్లోకి పడుతాయి. బావి స్వరూపం దాదాపు గుండ్రంగానే ఉంటుంది. మోట బావులు మినహా, చేదబావుల స్వరూపం దాదాపు రౌండ్‌గానే ఉంటుంది. పోర్టికో పిల్లర్లు, వరండా పిల్లర్‌ గుండ్రంగా ఉండవచ్చు. ఇంటి నిర్మాణంలో మాత్రం అవి పనికిరావు.

- Advertisement -

ఇంట్లోని ఏ గదిని ఇతరులకు అద్దెకు ఇవ్వొచ్చు? – పి.చంద్రశేఖర్‌, బాలానగర్‌
మనం నివాసం ఉండే ఇంటిని ఇతరులకు అద్దెకు ఇవ్వాలంటే ఓసారి ఆలోచించాల్సిందే. ఇంటిని ఒక మూల కోసి ఇచ్చినట్టు. ‘అద్దెకివ్వడం అవసరమా’ అన్నది ఆలోచించండి. మీది ఆరు గదుల పంపకం కలిగిన ఇల్లుగా కట్టి ఉంటే.. అంటే ఉత్తరం నుంచి దక్షిణం వరకు మూడు గదుల ప్రమాణంతో కడితే, అలాగే తూర్పు నుంచి పడమరకు మూడు గదుల లెక్కతో కడితే ఆ ఇంట్లోని వాయవ్యం గదిని అద్దెకు ఇవ్వవచ్చు. అదీ తప్పదు అనుకుంటేనే. కిరాయిల కోసమే అనుకుంటే పైన ఒక అంతస్తు పెంచి దానిని వాస్తుపరంగా రెండు లేదా మూడు పోర్షన్లుగా చేసి అద్దెకివ్వండి. మనం ఉండే ఇంటిని విభజించడం కన్నా ఇది మంచి మార్గం. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చివరగా ఒక మాట, ఏ ఫలమైనా మీరే పొందుతారు.

తూర్పువైపు పార్కింగ్‌ ప్లేస్‌లో కాంపౌండ్‌ వరకు మొత్తం రేకులు వేసుకొని హాలులాగా చేసుకోవచ్చా? -ఆకుల శివ, రఘునాథపల్లి

ఇంటి తూర్పు కాంపౌండ్‌ను ఇంటి ముందు వచ్చే ఏ నిర్మాణమూ తాకవద్దు. మీకు కారు పార్కింగ్‌ మాత్రమే కావాలని అనుకుంటే, మొత్తం ఎందుకు ఆక్రమించాలి? ఎంత అవసరముంటే అంత ఆగ్నేయ భాగంలో ఇంటిని, ప్రహరీలను అంటకుండా వేసుకోండి. పార్కింగ్‌ రేకులతోనే కదా వేస్తున్నారు. ఒకవేళ ఇంటి ఎదురు పందిరిలా కప్పు వేసుకోవాలని అనుకుంటే.. పడమర ఖాళీ కన్నా, ఒకటి రెండు అడుగులు వదిలి, ఇంటి వెడల్పు ఎంత ఉంటే అంత పందిరి వేసుకోవచ్చు. అప్పుడు, దానికింద కార్లు పెట్టుకోవచ్చు. శుభకార్యాలకూ వాడుకోవచ్చు. ‘హాలు మాదిరిగా రాదు’. పందిరి వేరు, హాలు వేరు. తూర్పునంతా ఇంటి లోపలికి తీసుకోవద్దు. ఏం చేసినా, ఎంత అవసరం ఉన్నా గృహాన్ని వికృతంగా మార్చుకోవద్దు.

రోడ్ల వైపు ఇల్లు కానీ, ఇంటి బాల్కనీ గానీ చొచ్చుకొని ఉండవచ్చా? – రేచర్ల శివధర్మ, కొలనుపాక
గృహాలు మన స్థలంలో హద్దులు నిర్ధారించుకున్న తర్వాతే కట్టుకోవాలి. ఇల్లు రోడ్డు మీదికి తొంగి చూసేలా కట్టుకోవడం సరికాదు. పైగా గృహ నిర్మాణ చట్టాలు ఇందుకు ఒప్పుకోవు కూడా. ప్రభుత్వం చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు. బోలెడు ఖర్చు చేసి కట్టుకున్న ఇంటిని కూల్చివేసే ప్రమాదమూ ఉంది. శాస్త్ర పరంగానూ వీధిని ఆక్రమించి నిర్మించిన ఇండ్లు సమస్యలు తెచ్చిపెడతాయి. దక్షిణం రోడ్డుపైకి ఇల్లు చొచ్చుకు రావడం, ఇంటి బాల్కనీ రోడ్డులోకి రావడం వల్ల ఇంట్లో స్థలం పెరుగుతుందేమో! కానీ, సమస్యలు అధికం అవుతాయి. ఇలా నిర్మించిన ఇంటికి ‘వీధి పోటు’ దోషం కలుగుతుంది. మీ స్థలం సరిహద్దు దాటకుండా ఇంటిని కట్టుకోవడం శ్రేయస్కరం.

సుద్దాల సుధాకర్‌ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana