e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home బతుకమ్మ వాస్తు:టాయిలెట్ల ద్వారాలు ఎత్తు తక్కువ చేసుకొని, మిగతా ద్వారాలు ఎత్తుగా ఉంచొచ్చా?

వాస్తు:టాయిలెట్ల ద్వారాలు ఎత్తు తక్కువ చేసుకొని, మిగతా ద్వారాలు ఎత్తుగా ఉంచొచ్చా?

పశ్చిమం పోర్టికో ఎలా, ఎక్కడ వేసుకోవాలి? – కోలన్‌ శ్రీనివాస్‌, నిజాంపేట

ఇంటి శరీరం ప్రత్యేకంగా ఉండాలి. ఎనిమిది దిక్కులా పుష్టితో నిర్మించిన తర్వాత, మిగిలిన ఏ నిర్మాణాన్ని అయినా ప్రధాన నిర్మాణంతో అంటుకోకుండానే కట్టుకోవడం ముఖ్యం. మనిషికీ మనిషికీ మధ్య ఎడం పాటించినట్లే, ఇంటి లోపలి ఆవరణంలో పశ్చిమ దిక్కుకు సంబంధించిందే అయినా, పోర్టికోను ప్రత్యేకంగా నాలుగు పిల్లర్లతో, ఇంటి స్లాబ్‌ను తాకకుండా వేసుకోవాలి. ఇంటికి పోర్టికోకు మధ్య గ్యాప్‌ ఇస్తూ, ఇంటి కప్పు కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పోర్టికో కప్పును పిరమిడ్‌ ఆకారంతో వేసుకోవాలి. వాన నీళ్లు జారి పడకుండా దాని అంచున గట్టర్స్‌ (దోని) ఏర్పాటు చేసుకోవాలి. పోర్టికోను పశ్చిమ మధ్యలో సింహద్వారం ఎదుటనే కట్టుకోవాలి.

- Advertisement -

చిన్న ఫ్యాక్టరీలో నైరుతిలో పెద్ద మిషనరీ ఉండాలా? లేదంటే, మేనేజర్‌ గది ఉంటే మంచిదా?- పెద్ది సుకుమార్‌, రాయిగిరి

యజమాని గది ఎప్పుడూ ప్రధానమైనదే. ఇక ఫ్యాక్టరీ నిర్మాణం ఒక్కో ప్లాంట్‌ను బట్టి ఒక్కోవిధంగా టెక్నికల్‌ ప్రాధాన్యంతో నిర్మితం అవుతుంది. కాగా, పెద్ద షెడ్డుతో కట్టినప్పుడు దానిలోనే యజమాని గది పెట్టడానికి, యంత్ర పరికరాలు, వాటి అమరిక, వాటి ప్రాముఖ్యం అడ్డు వస్తుంటే… ఆ షెడ్డులో కాకుండా, దానికి నైరుతి దిక్కులో ఒక ‘ప్రత్యేక నిర్మాణం’తో యజమాని స్థానాన్ని ఏర్పాటుచేసుకోవచ్చు. ఇది మంచి విధానం అవుతుంది. మేనేజర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్స్‌ మొదలైన పరిపాలనా యంత్రాంగం ఉచ్ఛస్థానంలోనే ఉంటారు. ప్రత్యేకించి, మేనేజర్‌ గది ఒకే షెడ్డులో ఉండాలి అనుకుంటే మాత్రం దాని నైరుతిలో ‘మెజనైన్‌’ ఏర్పాటుచేసి, దాని మీద ఉండొచ్చు. లేదా నైరుతిలో పార్టిషన్‌ చేసి, ‘ఎమ్‌డీ’ గదులను పెట్టుకోవచ్చు.

ఆలయాలకు పశ్చిమంలో, దక్షిణంలో నదులు, వాగులు ఉంటే దోషం ఏమీ ఉండదా? ఆదాయం బాగానే ఉంటుందా?-ఆదిభట్ల వెంకటేశ్‌, బచ్చన్నపేట

పూర్వీకులు తీర్థాల పక్కన, నదీ తీరాల్లో, సముద్రం ఒడ్డున, కొండలమీద, నదులు కలిసే చోట, వనాల దగ్గర, సిద్ధులు నివసించే చోట, పురాలు, పట్టణాలలో ఆలయాలను కట్టేవాళ్లు. ఈ నేపథ్యంలో కొన్ని ఆలయాలు నదులను ప్రధానంగా చేసుకొని నిర్మితమయ్యాయి. ఆలయాలకు ఆ నదులు విరుద్ధ దిశల్లో ఉంటే, ఆ నదుల ప్రాశస్త్యం అక్కడ ఉన్నతమైనదై ఉంటుంది. భారతదేశంలో క్షేత్రాలు, తీర్థాలు చాలా మహిమాన్వితంగా ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో గుడికన్నా నదీ సంగమ స్థలాలు ‘అద్భుతమైన శక్తి’ని కలిగి ఉన్నాయి. జనాలను తరింపజేస్తున్నాయి. అలాంటి ప్రదేశాల్లో ఆలయాలు వక్రంగా కనిపించినా, తీర్థాల విశిష్టతతో చారిత్రకమైనవిగా వర్ధిల్లుతాయి. అన్నిటినీ డబ్బుతో, ఆదాయంతో ముడిపెట్టవద్దు.

టాయిలెట్ల ద్వారాలు ఎత్తు తక్కువ చేసుకొని, మిగతా ద్వారాలు ఎత్తుగా ఉంచొచ్చా? సరిసంఖ్యతో ముడిపెట్టవచ్చా?-వి. శర్మ, ఆలేరు

ఇంట్లోని ద్వారాలు సరిసంఖ్యలో పెట్టుకుంటే వాటి నిర్మాణం, కొలతలు సరిగ్గా ఉండేలా చూసుకోవాల్సిందే. మన ఇష్టంతో హెచ్చుతగ్గులు చేసుకోవద్దు. మంచిది కాదు. ఇంటి సింహద్వారం ఎత్తును నిర్ధారించుకొని, దానితో సమానంగా పడకగదులు, హాలు, డ్రాయింగ్‌ రూం, వంటగదుల ద్వారాలు ఉండాల్సిందే. ఇంట్లోని టాయిలెట్ల ద్వారాలు వెడల్పు తక్కువ ఉంటాయి. కానీ, ఎత్తు మాత్రం మిగిలిన వాటితో సమానంగానే ఉంటాయి. కొలతల విషయానికి వస్తే… సింహద్వారం ఫ్రేమ్‌
(చౌకోటు)తో సమానంగా కొలవాలి. దానిమీద ఉండే గ్లాస్‌, ఇతర ఎలివేటెడ్‌ నిర్మాణాలతో అవసరం లేదు. గృహంలో దేని ప్రాధాన్యం దానిదే. వాటిని చిన్నచూపు చూడవద్దు. చిన్నగా చేయ
కూడదు.

సుద్దాల సుధాకర్‌ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement