e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home బతుకమ్మ వాస్తు:ఇంటి చుట్టూ హాస్పిటల్స్‌ ఉంటే, ఆ ఇంట్లో ఉండకూడదా? వెంటనే ఇల్లు మారాలా?

వాస్తు:ఇంటి చుట్టూ హాస్పిటల్స్‌ ఉంటే, ఆ ఇంట్లో ఉండకూడదా? వెంటనే ఇల్లు మారాలా?

‘దక్షిణం పిశాచ స్థానం’ కాబట్టి కొంత స్థలం వదిలి నిర్మాణం చేపట్టాలంటారు. ఎంత వదలాలి? -కొండ శ్రీదేవి, దేవరుప్పల

దక్షిణం, పశ్చిమం దిక్కులను హద్దు చేసి ఇండ్లు కడితే వాటిలోకి గాలి, వెలుతురు సరిగ్గా ప్రసరించవు. దాంతో ఆ ఇండ్లలో ఉండేవాళ్లు ఎవరో ఒకరు అనారోగ్యంతో అవస్థలు పడుతుంటారు. కాబట్టి, అలాంటి గృహాలు పిశాచ నివాసాలు అవుతాయని అంటారు. అలా ప్రజల నోళ్లలోనూ నిలిచిపోయింది. ఏ ఇల్లయినా సరే చుట్టూ స్థలం వదిలిపెట్టకుండా నిర్మాణం చేపట్టకూడదు. అందువల్ల ఉన్న స్థలాన్ని బట్టి పెద్ద ఇల్లు నిర్మించకుండా, స్థలాన్ని సమానంగా విభజించాలి. ఇంటిచుట్టూ ప్రదక్షిణంగా ఖాళీ వదిలి ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. అయితే దక్షిణం, పశ్చిమ దిశల్లో తక్కువ ఖాళీని, తూర్పు, ఉత్తర దిక్కుల్లో ఎక్కువ ఖాళీని వదిలిపెట్టి ఇల్లు కట్టుకోవాలి. శాస్త్రపరంగా కట్టని‘చీకటి ఇండ్లన్నీ’ పిశాచ నివాసాలే అవుతాయి.

- Advertisement -

ప్లాటుకు పశ్చిమంలో ఉన్న స్థలంలో పెద్ద బావి ఉంది. అక్కడ ఇల్లు కట్టుకోవచ్చా? -ఆదె శివ, వైరా, ఖమ్మం జిల్లా

పశ్చిమ దిశలో ఉన్న స్థలం ఇతరులది. అందులో ఉన్న బావిని ఒకవేళ స్థల యజమానులు వాడుకుంటూ ఉంటే.. మీరు మీ స్థలానికి స్థిరమైన, ఎత్తయిన (7.6 అడుగుల ఎత్తు) కాంపౌండు కట్టుకుని ఇల్లు కట్టుకోవచ్చు. ఇక ఆ బావికి యజమానులు లేకుంటే అది బంజరు భూమి కిందికి వస్తుంది. అయితే దాని ప్రభావం చుట్టుపక్కల వారిమీద ఉంటుంది. అలా కాకుండా బావినీళ్లను ఊరికోసం వాడుతూ ఉన్నా, లేదంటే ఆ బావి స్థలం ఇతరుల పేరు మీద ఉన్నా మీరు మీ స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు.

పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో రోడ్డు ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చా? -సాతాని లక్ష్మణ్‌, గజ్వెల్‌

ఒక రోడ్డుకంటే రెండు రోడ్లు ఉండటం ఇంటికి, ఆఫీసుకు మంచిది. ఇల్లు పక్క ఇల్లు, పక్కపక్కనే వస్తున్న గృహ సముదాయంలోని ఇండ్లకు, రెండు లేదా మూడు రోడ్లు ఉన్న ఇంటికి గాలి, వెలుతురు ప్రసరించే విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. పశ్చిమం, ఉత్తరం వైపు రోడ్లుంటే ఆఫీసుకు మాత్రమే కాకుండా ఇంటికి కూడా ఆ స్థలం అనుకూలమైంది. అయితే స్థలాలు, వీధుల నిర్మాణంతోపాటు దాని దిశా విధానం కలిసివచ్చే మంచి లే అవుట్‌ చేసిన కాలనీ అయితే మీ స్థలం గొప్ప ఫలితాలను ఇస్తుంది. అదే దిశలు తిరిగితే మాత్రం ఫలితాలు మారతాయి. ప్లాటు వాయవ్య స్థలం విషయంలో పశ్చిమ వీధి ప్లాటుకు పశ్చిమ పాదులోనే ఉందా లేదా స్థలం ముందుకు ఉందా, రోడ్డు స్థలానికి రెండు వైపులా తగులుతుందా అనేది నిర్ధారించుకోవాలి. ఒకవేళ రోడ్డు తగిలినట్లుగా ఉంటే మాత్రం స్థలాన్ని కట్‌ చేసి అందులో ఆఫీసు కట్టుకోవాలి.

ఇంటి చుట్టూ హాస్పిటల్స్‌ ఉంటే, ఆ ఇంట్లో ఉండకూడదా? వెంటనే ఇల్లు మారాలా? -వి.హరగోపాల్‌, కొడంగల్‌

పరిసరాలు ఎప్పుడెలా రూపాంతరం చెందుతాయో ఎవరూ ముందుగా అంచనా వేయలేరు. కాబట్టి, అన్నిటినీ శాస్ర్తానికి ఆపాదించకూడదు. మీరు ఇల్లును కట్టినప్పుడే అన్నీ చూసుకొని కట్టామని రాశారు. అయితే, చుట్టుపక్కల వాతావరణం కలుషితమైతే అది ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుంది. ఒక దగ్గర మనం ఇల్లు కట్టుకున్న తర్వాత దగ్గర్లో పెద్ద ఫ్యాక్టరీ ఏర్పడవచ్చు. రైల్వే స్టేషన్‌ రావచ్చు. కాలక్రమంలో ఏదైనా జరగవచ్చు. అయితే, హాస్పిటల్‌ పక్కన మాత్రం ఉండకూడదు. మనం ఒక పనిచేశాక ఆ తర్వాత ఏ మార్పూ రాకూడదని శాసించలేం కదా! కాబట్టి మీరు కావాలనుకుంటే మరోచోటుకు వెళ్లండి. మీ ప్రశాంతతకు భంగం కలగని నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు.

సుద్దాల సుధాకర్‌ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement