e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home Telangana ఏడేళ్లలో పోలీస్ శాఖలో పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు

ఏడేళ్లలో పోలీస్ శాఖలో పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు

ఏడేళ్లలో పోలీస్ శాఖలో పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు

ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు సజావుగా ఉంటేనే పరిపాలన సాఫీగా జరగుతుంది. జనజీవనం ప్రశాంతంగా ఉంటుంది. ప్రగతిశీల సమాజం రూపుదిద్దుకుంటుంది.వలస పాలనాకాలంలో అనేక అలజడులకులోనైన తెలంగాణ స్వయంపాలనలో బంగారు తెలంగాణ దిశగా పయనించాలన్నా, ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నా శాంతిభద్రతల పరిరక్షణే కీలకమని భావించి ప్రభుత్వంచర్యలు తీసుకుంది.2013-14 లో పోలీసు శాఖలో మొత్తం 63,181 మంది ఉద్యోగులుండగా, 2019-20 నాటికి వీరి సంఖ్య 86,829 కి పెరిగింది.

 1. పోలీస్ స్టేషన్ల నిర్వహణకు ప్రత్యేక నిధులు

పోలీస్ స్టేషన్లలో కాగితాల ఖర్చు, పెట్రోల్, డీజిల్, తిండి ఖర్చుల కోసం పోలీసు అధికారులు ఇబ్బందులుపడేవారు. ఫిర్యాదు చేసిన వారే ఖర్చులు భరించాల్సి వచ్చేది. స్టేషన్ కు వచ్చిన వారికి వారి సొంత సమస్యలతోపాటు ఈ అదనపు భారం మరింత బాధించేది. ఇది గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అటు సామన్య ప్రజలకు, ఇటు పోలీసులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ స్టేషన్లకు స్టేషనరీ తదితర ఖర్చుల నిమిత్తం నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నగరాల్లోని ఒక్కో పోలీస్ స్టేషన్  నిర్వహణ ఖర్చుకోసం నెలకు రూ. 75 వేలు (గతంలో రూ.5 వేలు), జిల్లా కేంద్రాలలో రూ.50 వేలు (గతంలో రూ.3 వేలు), గ్రామీణ ప్రాంతాల స్టేషన్లకు 25 వేల రూపాయలు (గతంలో 2 వేలు) ప్రభుత్వం అందిస్తున్నది.

 • పోలీస్ శాఖలో పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు

పోలీస్‌శాఖను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం పోలీసు శాఖలో భారీగా సిబ్బంది నియామకాన్ని చేపట్టింది.2014 జూన్ లో పోలీసు శాఖలో 8,447 పోలీస్ కానిస్టేబుల్స్ నియామకాలు జరిగాయి.  ఇందులో 1133 మంది మహిళలు ఉద్యోగం పొందారు. అనంతరం 2017లో రాష్ట్రంలో ఏర్పాటైన నూతన జిల్లాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పోలీస్‌ శాఖలో 18,290 పోస్టులను మంజూరు చేసింది. సివిల్ లో 9,629 పోస్టులు,  ఏఆర్  5,538 పోస్టులు, టి.ఎస్.ఎస్.పి.లో 2,075 పోస్టులు, కమ్యూనికేషన్స్  143 పోస్టులు, మినిస్టీరియల్ లో599 పోస్టులు మంజూరయ్యాయి.  ఈ మేరకు ప్రభుత్వం జులై 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరోమారు 2018 ఫిబ్రవరి 3నవివిధ హోదాల్లో కలిపి మరో 14,177 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ హోంశాఖ కార్యాలయంఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర డీజీపీ పరిధిలో ఉండే ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేశారు. మొత్తం 14,177 పోస్టుల్లో సివిల్ ఎస్సై 710 పోస్టులు, ఏఆర్ ఎస్సై 275 పోస్టులు, టీఎస్‌ఎస్పీ ఎస్సై 175 పోస్టులతోపాటు సివిల్ కానిస్టేబుల్ 5,002 సహా మొత్తం ఏడు క్యాటగిరీల్లో భర్తీచేశారు. 2013-14 లో పోలీసు శాఖలో మొత్తం 63,181 మంది ఉద్యోగస్తులు ఉండగా, 2019-20 నాటికి వీరి సంఖ్య 86,829 కి చేరింది.

 • పోలీసులతో సమానంగా నిత్యం విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుంది. ఎన్నోఏళ్లుగా అరకొర జీతాలతో అష్టకష్టాలు పడుతున్న హోంగార్డులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఎవరూ ఊహించనివిధంగా 18,491 హోంగార్డుల వేతనాలు పెంచడంతోపాటు, అనేక ఇతర సౌకర్యాలూ కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులకు కేవలం రూ.6 వేల జీతం వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2014 డిసెంబర్ 5న వారి జీతాన్ని రూ. 9 వేల నుండి రూ. 12 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన జీతాలను 2015 ఏప్రిల్ నుంచి అమలు చేశారు. నెలకు రెండుసార్లు పరేడ్‌ అలవెన్సు పేరిట ఇస్తున్న రూ. 28/- ని రూ.100/-లకు పెంచారు. 2017డిసెంబర్ 13న వారి వేతనాలను రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచారు. ముఖ్యమంత్రి కేసిఆర్ 2017 డిసెంబర్ 13న ప్రగతి భవన్‌లో (జనహిత) హోంగార్డుల జీతాల పెంపు  ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం 2018జనవరి 31న జారీ చేసింది.
 • పెరిగిన జీతాల మేరకు నెలకు రూ.20 వేల వరకు హోంగార్డులు తీసుకునే అవకాశం ఉంది. జీవోలో పేర్కొన్న మేరకు ప్రతిరోజూ రూ.675, ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి వెయ్యి రూపాయల పెంపు, ట్రాఫిక్ విభాగంలో పని చేసే వారికి కానిస్టేబుళ్లతో సమానంగా 30 శాతం ప్రత్యేక అలెవెన్సు, యూనిఫాం అలవెన్సు, మహిళా పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా మహిళా హోంగార్డులకు ఆరు నెలల మెటర్నరీ సెలవు, ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో చనిపోతే హోంగార్డు కుటుంబానికి ఇప్పుడు ఇస్తున్న రూ.5 వేలను రూ.10 వేలకు పెంపు, పోలీస్ యూనిట్ హాస్పిటల్స్‌లో పోలీసులకు అందిస్తున్న వైద్య చికిత్సలు అందజేత, ఆరోగ్య బీమాతోపాటు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతోపాటు హోంగార్డుల తొలగింపు లేకుండా ఉద్యోగ భద్రతకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ జనవరి 2018 నుంచి అమల్లోకి వచ్చాయి. జంట నగరాల్లో పనిచేసే హోంగార్డులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రస్తుతం వారి వేతనాలు, ఇతర భత్యాలకు ప్రభుత్వం ఏడాదికి రూ.285 కోట్లు ఖర్చు చేస్తుండగా.ఈ హామీల అమలుతో ఏటా అదనంగా రూ.265 కోట్ల భారం పడుతున్నది. మొత్తం వ్యయం రూ.550 కోట్లు అవుతున్నది.

హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు

 • నెలవారీ జీతం రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంపు
 • ప్రతీ ఏడాది నెలకు వెయ్యి చొప్పున ఇంక్రిమెంటు
 • హోంగార్డులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు
 • కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా హెల్త్ ఇన్సూరెన్సు
 • ట్రాఫిక్ హోంగార్డులకు ఇతర పోలీసుల మాదిరిగానే 30 శాతం అదనపు వేతనం
 • కానిస్టేబుళ్ల మాదిరిగా ప్రతీ ఏడాది నాలుగు యూనిఫామ్స్
 • మహిళలకు 6 నెలల మెటర్నటీ లీవులు
 • పురుషులకు 15 రోజుల పెటర్నటీ లీవులు
 • బందోబస్తు డ్యూటీ చేసే హోంగార్డులకు కానిస్టేబుళ్లతో సమానంగా డైట్ చార్జీలు
 • అంత్యక్రియలకు ప్రస్తుతం ఇచ్చే 5 వేలను 10 వేల రూపాయలకు పెంపు
 • కానిస్టేబుళ్ల మాదిరిగానే పోలీస్ హాస్పిటల్స్ లో హోంగార్డులకు చికిత్స

 కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో హోంగార్డుల రిజర్వేషన్ పెంపు

టి.ఎస్.ఎస్.పి.                   : ప్రస్తుతం 10 శాతం – ఇకపై 25 శాతం

ఎ.ఆర్                              : ప్రస్తుతం 5 శాతం – ఇకపై 15 శాతం

సివిల్                               : ప్రస్తుతం 8 శాతం – ఇకపై 15 శాతం

పిటిఓ (డ్రైవర్లు)                  : ప్రస్తుతం 2 శాతం – ఇకపై 20 శాతం

పిటిఓ (మెకానిక్స్)              : ప్రస్తుతం 2 శాతం – ఇకపై 10 శాతం

ఎస్.పి.ఎఫ్.                       : ప్రస్తుతం 5 శాతం – ఇకపై 25 శాతం

ఫైర్                                  : ప్రస్తుతం 10 శాతం – ఇకపై 25 శాతం

ఎస్.ఎ.ఆర్.సి.పి.ఎల్           : ప్రస్తుతం 5 శాతం – ఇకపై 25 శాతం

పోలీస్ కమ్యూనికేషన్స్        : ప్రస్తుతం 2 శాతం – ఇకపై 10 శాతం

 • పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్

దేశంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్న మొదటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో నిర్మిస్తున్నది. బంజారాహిల్స్‌ లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలీస్ ట్విన్‌టవర్స్‌ కు ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 నవంబర్ 22న శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్, కమాండ్, కంట్రోల్ సెంటర్ భవనాన్ని రూ.350 కోట్ల వ్యయంతో 7 ఎకరాల విస్థీర్ణంలో.. 6 లక్షల చదరపు అడుగుల్లో టవర్లను నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి 2016 సెప్టెంబర్ 16న పరిపాలనా అనుమతులు వచ్చాయి. డిసెంబర్ 2016 న నిర్మాణ పనులు ప్రారంభించారు. డిసెంబర్ 2020 నాటికి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ భవనాన్ని 4 టవర్లతో నిర్మిస్తున్నారు. టవర్ ఎ.ను 20 అంతస్తుల ఎత్తులో 1.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, టవర్ బి, సి, డి లను ఒక్కొక్కటి 16 అంతస్తుల ఎత్తులో 1.12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తున్నారు. మిగతా ప్రాంతాన్ని 1.24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.నాలుగు టవర్ల మధ్య ఉన్న స్థలంలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈమధ్యలో కింది ఖాళీ భాగాన్ని వివిధ అవసరాలకు ఉపయోగించనున్నారు. కమాండ్ సెంటర్ కోసం నాలుగంతస్తులను 44 వేల చదరపు అడుగుల విస్థీర్ణంలో నిర్మించారు. ఒక్కో అంతస్తు 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. నాలుగో అంతస్తు డేటా సెంటర్ కాగా అయిదారు అంతస్తులను కమాండ్ కంట్రోల్ సెంటర్ గా తీర్చిదిద్దుతున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో లక్ష కెమెరాల పుటేజీని ఒక్క నిమిషంలోనే పరిశీలించే ఆధునిక పరికరాలు, పరిజ్ఞానం  అందుబాటులో ఉన్నాయి.A టవర్మీదహెలీఫ్యాడ్కూడాఉండటంవిశేషం.

 • ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య అలవెన్సు

రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యంలో విధులు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ పోలీసులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న వీరి కోసం ప్రభుత్వం కాలుష్య అలవెన్స్ ఇవ్వాలని 2016 జనవరి 2న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. వారి మూలవేతనం మీద 30 శాతం పెంచింది.

 • తెలంగాణ రాకముందు పోలీసులకు ఏడాదికోసారి ఇచ్చే యూనిఫాం అలవెన్స్ ఏ మూలకూ సరిపోయేది కాదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ హామీ మేరకు.. ప్రభుత్వం  2018 ఫిబ్రవరి 20న యూనిఫాం అలవెన్స్ ను రూ.3,500 నుంచి రూ. 7,500లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
 • పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ

పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు, ఆధునీకరించేందుకు ఖర్చుకు వెనుకాడకుండా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. పోలీసు శాఖకు ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లలో కూడా అధిక నిధులనే కేటాయిస్తున్నది. 2014-15 బడ్జెట్లో 3306.91 కోట్లు, 2015-16 లో 4312.73, 2016-17లో 4817.80, 2017-18 లో 4828.18 కోట్లు, 2018-19లో 5,790 కోట్లు, 2019-20 బడ్జెట్లో రూ.4,540 కోట్లు, 2020-21లో రూ.5,852 కోట్లుకేటాయించారు.2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వాలు పోలీసు శాఖకు రూ.30,349 కోట్లు కేటాయించగా, టిఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2020 వరకు ఆరు సంవత్సరాల కాలంలో రూ.33,820 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో 2017 మే 19న 1500 మంది పోలీస్‌ అధికారులతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ‌కు రూ.500 కోట్ల నిధులు ఇస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నిధులను కొత్త వాహ‌నాలు, మౌలిక స‌దుపాయాల కోసం వినియోగించారు.

పోలీసుశాఖ పునర్వ్యవస్థీకరణ :

శాంతి భద్రతలను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు అత్యంత శాస్త్రీయ పద్ధతిలో పోలీసుశాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం రెండు పోలీస్ కమీషనరేట్లు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా ఏడు పోలీస్ కమీషనరేట్లన్లను నెలకొల్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది పోలీస్ కమీషనరేట్లున్నాయి. పోలీస్ సబ్ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 164కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 719కు, పోలీస్ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 815కు ప్రభుత్వం పెంచింది.

ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఐ.టి.ఎం.ఎస్.

హైదరాబాద్ లో రోజురోజుకు ఎక్కువవుతున్న ట్రాఫిక్ రద్దీని శాస్త్రీయ పద్ధతిలో క్రమబద్ధీకరించేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. రూ.98.89 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న ఈ పద్ధతి ప్రకారం ఆన్ లైన్ లోనే నిరంతరం ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాంగురూట్లో వెళుతున్న వారిని గుర్తిస్తారు. ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువుందో గుర్తించి, రూట్లను డైవర్టు చేస్తున్నారు. నంబర్ ప్లేట్లను గుర్తించడానికి, నకిలీ నెంబరు ప్లేట్లు పెట్టుకుని తిరిగే వారిని గుర్తించేందుకు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని ఆపి, చానళ్లు రాయడం వల్ల మరింత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున, ఆన్ లైన్ ద్వారానా చానాళ్లను రూపొందించి, వాహన యజమానులకు పంపుతున్నారు.

జీపీఎస్‌, ఇంటర్నెట్‌తో కూడిన ల్యాప్‌టాప్‌

 ప్రభుత్వం హైదరాబాద్ లోని ఒక్కో పోలీస్ స్టేషన్  నిర్వహణ ఖర్చుకోసం నెలకు రూ. 75 వేలను (గతంలో రూ.5 వేలు), జిల్లా కేంద్రాలలో రూ.50 వేలు(గతంలో రూ.3 వేలు), గ్రామీణ ప్రాంతాల స్టేషన్లకు రూ. 25 వేలు (గతంలో 2 వేలు) అందిస్తున్నది.

జీహెచ్ఎంసీ పరిధిలో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం కోసం రూ.657.22 కోట్ల వ్యయంతో 10 వేల సిసి కెమెరాల ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. నవంబర్ 2020 నాటికి సుమారు 6 వేల కెమెరాలు అమర్చారు. ఇవన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ రూముకు అనుసంధానం అయి ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని పోలీస్ కంట్రోల్ రూములు కూడా హైదరాబాద్ కంట్రోల్ కమాండ్ సెంటర్ కు అనుసంధానం అయి ఉండడం వల్ల శాంతి భద్రతల పర్యవేక్షణ మరింత పకడ్బందీగా జరుగుతుంది.

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రభుత్వం రిజర్వు  బెటాలియన్ఏర్పాటు చేస్తోంది.

పోలీస్ శాఖ నియామకాల్లో వయో పరిమితి మూడేండ్ల సడలింపు ఇచ్చింది.

అగ్రిమాపక కేంద్రాలు లేని అసెంబ్లీ నియోజక వర్గాల్లో 18 నూతన అగ్నిమాపక కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది.

2017-18లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.232.82 కోట్ల నిధులతో వివిధ జిల్లాల్లో 590 పోలీస్ స్టేషన్ల భవనాలను నిర్మించారు.రూ.375 కోట్లతో 2 కమిషనరేట్ భవనాలు నిర్మించారు.

పోలీసులకు కొత్త వాహనాలు

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు స్టేషన్లకు కొత్త వాహనాలు సమకూర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 2014 లో 3,800 వాహనాలు, 2018లో 11,500 వాహనాలను కొనుగోలు చేశారు.తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల పోలీస్‌ స్టేషన్లకు 550 కొత్త వాహనాలు సమకూర్చింది. ఆధునిక వసతులతో హైదరాబాద్ నగరంలో 4012 కొత్త వాహనాల కొనుగోలుకు 300 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. ఈ వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఆగష్టు 14న పోలీసులకు అందజేశారు.2020డిసెంబర్నాటికి మొత్తం వివిధ రకాల 20,004వాహనాలను పోలీసు శాఖకు మంజూరు చేశారు. ఇందులో ఇన్నోవాలు, బస్సులు, బైకులు తదితర వాహనాలు ఉన్నాయి.2013-14 లో పోలీసులకు రాష్ట్ర వ్యాప్తంగా కలిపి కేవలం 5,703 వాహనాలు మాత్రమే ఉండేవి.

 1. పోలీసుశాఖ  ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. దేశంలోనే తొలిసారిగా అనుమానితుల ఫోటోలు క్షణాలలో సరిపోల్చే ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. ఇది పోలీసుల చేతిలో ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. నేరస్తులతోపాటు, అనాథశవాలను, తప్పిపోయినవారిని కూడా  దీంతో గుర్తిస్తున్నారు.
 1.  ‘నేను సైతం’ – ఊరూరా సీసీ కెమెరాలు

సమాచార సాంకేతికాభివృద్ధి మానవాభివృద్ధికి వారి సుఖసంతోషాలకోసం ఉపయోగపడాలె అనే ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని పోలీసుశాఖ అనుసరిస్తున్నది. అందులో భాగంగా పల్లె పల్లెనా శాంతి భద్రతలను పటిష్ట పరిచేందుకు సీసీ కెమెరాలను వినియోగించాలని నిర్ణయించింది. ఎవరూ చూడట్లేదనుకుని నేరాలకు తెగబడే నేరస్థులకు, తమను ఎప్పటికప్పుడు గమనించే  పైవాడు వొకడున్నాడనే భయం నేర నిరోధానికి తద్వారా నివారణకు దోహదం చేస్తుంది.

హైదరాబాద్ నగరంలో ‘నేను సైతం’ 

రాష్ర్ట జిడిపిలో హైదరాబాద్ వాటా40 నుంచి 50 శాతం ఉంటుంది. అందుకే హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ‘నేను సైతం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.  నగరంలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం సీసీ కెమెరాల పుటేజీల్లో దొరికే ఆధారాల ద్వారానే ఛేదిస్తుండటం గమనార్హం.

గ్రామాలకూ ‘నేను సైతం’  విస్తరణ

హైదరాబాద్‌లో సత్ఫలితాలు ఇస్తున్న ‘నేను సైతం’ కార్యక్రమాన్ని గ్రామాలకూ విస్తరించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తునకు ఉపయోగపడే సీసీ టీవీ కెమెరాలను గ్రామాల్లో ఏర్పాటు చేయనుంది. ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లు, నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి… వాటిని మండల కేంద్రంలోని ఠాణాల్లో కమాండ్‌ కంట్రోల్‌ రూంలకు అనుసంధానం చేయనున్నారు. జిల్లాల్లో ఠాణాల పరిధిలోని ప్రాంతాలు విస్తీర్ణపరంగా పెద్దవి. దొంగతనాలు, మద్యం, ఇసుక అక్రమ రవాణా, పోకిరీల బెడద, రోడ్డు ప్రమాదాలు… వీటన్నింటినీ పోలీసులు చూడలేరు. కావున గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు. అన్ని మండలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన జిల్లాగా యదాద్రి-భువనగిరి నిలిచింది.

 1. (2019-20లో 7,03,373 కెమెరాలు – క్లాలిఫై చేసుకోవాలి)

దేశవ్యాప్తంగా పోలీసులు ఉపయోగిస్తున్న 4,27,529 కెమెరాల్లో 2020 నాటికి 65 శాతం (2,75,528) తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ – నివేదికలో పేర్కొన్నది. తెలంగాణలో ఏదైనా పనిమీద బయటకొచ్చినవారు ఇంటికి వెళ్లేలోపు 50 కెమెరాల్లో చిక్కే అవకాశం ఉంది. ఇలా రాష్ట్రంలోని ప్రతి అంగుళాన్ని పోలీస్ రాడార్ లోకి తెచ్చుకొని,  నేరాలను అదుపు చేసేందుకు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్ని నియంత్రించేందుకు నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ సెంటర్ 2020 చివరినాటికి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎక్కడ నేరం జరిగినా క్షణాల్లోనే పోలీసులకు సమాచారం అందడంటో నేరాలు తగ్గుతాయి.

-తెలంగాణ పోలీసు శాఖలో బ్లూకోల్డ్స్ బైక్ లు మొదలు ఉన్నతాధికారులు ఉపయోగించే ఖరీదైన కార్లు10 వేల వరకు ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఈ సంఖ్య ఎక్కువ.

-పోలీస్ కమిషనరేట్ల విషయంలోనూ తెలంగాణ ముందు వరుసలోనే ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం 63 కమిషనరేట్లు ఉండగా, తెలంగాణ 9 కమిషనరేట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ( ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు (ఉమ్మడి రాష్ట్రంలో),తెలంగాణ ఏర్పడ్డాక రాచకొండ, వరంగల్ కమిషనరేట్లు, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం, సిద్ధిపేట కమిషనరేట్లు మనుగడలోకి వచ్చాయి). మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో వీటి సంఖ్య 11.

 1. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సెంటర్

కేసుల దర్యాప్తు, విచారణలో ఎదురయ్యే సమస్యలు, ఇతరత్రా ఇబ్బందులను చాకచక్యంగా పరిష్కరించేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖ వినూత్న చర్యలు చేపట్టనుంది. సంచలనాత్మక కేసుల విచారణలో దర్యాప్తు అధికారులకు సూచనలు, సలహాలు, సందేహాల నివృత్తికి ప్రత్యేకంగా సెల్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పోలీసుశాఖ కార్యాచరణ రూపొందించింది. రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సెల్‌లో అనుభవమున్న పోలీస్‌ అధికారి, న్యాయ నిపుణులు, ఫోరెన్సిక్‌ నిపుణులు, ఫింగర్‌ ప్రింట్స్, టెక్నాలజీ అనుభవమున్న వ్యక్తులు ఉంటారు. కేసు విచారణ సమయంలో ఏ సమస్యతో దర్యాప్తుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి? వాటిని ఎలా అధిగమించాలి? ఆధారాల సేకరణలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన సూచనలు, సలహాలు ఈ సెల్‌ నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కేసుల పెండింగ్‌ తగ్గడంతో పాటు దర్యాప్తు అధికారికి కూడా అనుభవం వస్తుందన్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌ను తీర్చిదిద్దుతున్నారు.

 1. దేశంలోనే తొలిసారిగా ఐటీ అండ్ సీ

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు కమ్యూనికేషన్ విభాగాన్ని ఐటీ అండ్ సీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్)గా మార్చారు. కమ్యూనికేషన్‌తోపాటు అన్ని పోలీస్ స్టేషన్లలోని కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాల నిర్వహణలో ఈ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుంది. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో టెక్నాలజీ వాడకం పెరిగేలా ఇది ఉపకరిస్తుంది. సీసీటీఎన్‌ఎస్ అమలులో రెండేండ్లుగా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణ పోలీసు శాఖ. క్రిమినల్ జస్టిస్‌లోని అన్ని వ్యవస్థలను ఏకంచేస్తూ సీసీటీఎన్‌ఎస్‌లో ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టంను దేశంలోనే తొలిసారిగా వరంగల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు.

 1. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య తగ్గించేందుకు పోలీసుశాఖ చర్యలు

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలతోపాటు, మృతుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్‌శాఖ చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే 2020 సంవత్సరాన్ని రోడ్‌, విమెన్‌సేఫ్టీ ఇయర్‌గా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులు, ఇతర రోడ్లలో 2015 నుంచి 2018 వరకు 3,517 బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. ఇక్కడ పోలీసులు, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌పోర్టు, మెడికల్‌, ఫైర్‌ విభాగాలతో కలసి బృందంగా ఏర్పడి ప్రమాద స్థలాలను  గుర్తించి, ప్రమాద కారణాలను విశ్లేషిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో మూల మలుపు, సరైన వెలుతురు, సైన్‌బోర్డు లేకపోవడం, ఇరుకైన వంతెనలు తదితర సమస్యల్ని గుర్తించి, పరిష్కరిస్తుండటంతో ప్రమాదాలు తగ్గుతున్నాయి. 

 1. ఫింగర్ప్రింట్టెక్నాలజీలోఅధునాతనఫీచర్లు

నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ) జారీ అయి.. కోర్టులకు హాజరుకాకుండా తిరిగే నిందితులను గుర్తించేందుకు తెలంగాణ పోలీసుశాఖ సరికొత్త ఫీచర్‌ను రూపొందించింది. దీంతో ఎన్బీడబ్ల్యూ జారీ  అయిన నిందితుడు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఇతర పోలీస్‌స్టేషన్ల పరిధిలో, ఇతర నేరాలు చేస్తూ దొరికినా వెంటనే తెలిసిపోతుంది. రాత్రివేళల్లో గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు వాడుతున్న ఫింగర్‌ప్రింట్‌ మొబైల్‌చెక్‌ డివైజ్‌ల్లో వేలిముద్రవేసినా వెంటనే సంబంధిత పోలీస్‌అధికారి వద్ద ఉన్న ట్యాబ్‌లో రెడ్‌మార్క్‌తో పాప్‌అప్‌ వస్తుంది. దానిని ఓపెన్‌ చేయగానే ఏ స్టేషన్‌ పరిధిలోని కేసులో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది అనే సమాచారం వస్తుంది. దీంతో ఆ నిందితుడ్ని వెంటనే అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంటుంది. 2020 ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఈ టెక్నాలజీని తెలంగాణ పోలీసులు అందుబాటులోకి తెచ్చారు.

 1. పోలీసుల సేవలపై థర్డ్ పార్టీ సర్వే(సిటిజన్ ఫీడ్ బ్యాక్)

గతంలో ఏదేని సమస్యపై పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిర్యాదు చేసినప్పటికీ వారు కేసు నమోదు చేశారో లేదో తెలిసేదికాదు. కేసు నమోదు చేసినా దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో కూడా తెలిసేది కాదు. కొన్ని సందర్భాల్లో పోలీసులు సరిగా స్పందించేవారు కాదు. ప్రజలతో దురుసుగా ప్రవర్తించేవారు.  దీంతో ప్రజలు అభద్రతాబావానికి లోనయ్యేవారు. ఇటువంటి ఇబ్బందులు వుండకుండా ప్రభుత్వం.. నూతన టెక్నాలజీని వినియోగించుకుంటూ థర్డ్ పార్టీ సర్వే (సిటిజన్ ఫీడ్ బ్యాక్) ను అమల్లోకి తెచ్చింది. జంట నగరాలకే పరిమితమైన ఈ విధానాన్ని 01 జనవరి, 2019 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ. ఇందులో భాగంగా ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్ కి పిర్యాదు చేయగానే అతని ఫోన్ నెంబర్ తో సహా కేసు నమోదు చేస్తారు. ఆ నెంబర్ డిజిపి కార్యాలయానికి వెలుతుంది. పోలీసు శాఖ వారు నియమించిన ప్రైవేటు ఏజన్సీ (థర్డ్ పార్టీ) వారికి ఆ నెంబర్లు చేరుతాయి. వెంటనే ‘మీ ఫిర్యాదు స్వీకరించడం జరిగింది’ అంటూ ఎఫ్ఐఆర్ నంబరు సహా బాధితుడి ఫోన్ కు ఎస్.ఎం.ఎస్. వస్తుంది. వారు ఎప్పటి కప్పుడు ఫిర్యాదుదారులకు పోలీసు వారు అందిస్తున్న సేవల తీరును ఫోన్ ద్వారా కనుక్కుంటారు. అలానే కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో తెలుసుకునే వీలుంది. పోలీసు అధికారుల తీరు సంతృప్తికరంగా ఉందా లేదా అని తెలుసుకుంటారు. ఎవరైనా బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, డబ్బులు తీసుకున్నట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే భవిష్యత్తులో వారికి పోస్టింగులు, బదిలీలు, పదోన్నతులు ఇవ్వనున్నారు.

 1. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ ల్యాబ్స్

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.70 కోట్లతో సైబర్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. వీటిలో అడిషనల్ ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు వివిధ స్థాయిల్లోని 165 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ సైబర్ టూల్స్ వాడకం, సైబర్ నేరాల పరిశోధనలో అనుసరించాల్సిన వ్యూహాలు, మెళకువలు, అత్యాధునిక పద్ధతులపై స్వదేశీ, విదేశీ సైబర్ నిపుణులు శిక్షణనిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాల పరిశోధన వేగవంతమవుతున్నది. ఏదైనా కేసులో సాంకేతిక ఆధారాలైన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, తదితరాల విశ్లేషణకు సైబర్‌ ల్యాబ్‌లే కీలకం. విదేశాల నుంచి భారీ ఖర్చుతో కొన్ని ముఖ్యమైన టూల్స్‌ కొనుగోలు చేస్తున్న పోలీసుశాఖ వీటి ద్వారా విరిగిపోయిన సీడీల్లోని డేటాను కూడా బయటపెట్టగలదు. అలాగే లాక్‌అయిన ఫోన్లలోని డేటాను తిరిగి తీయవచ్చు.

సైబర్ నేరాలపై అవగాహన కోసం సైబ్ హర్ ప్రోగ్రాం

రోజు రోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలపై మహిళలు చిన్నారులకు అవగాహన కోసం సైబ్ హర్ పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇంచార్జి స్వాతి లక్రా ఆధ్వర్యంలో నెలరోజుల పాటు రోజుకో అంశంపై క్విజ్లు, ఆన్ లైన్ చర్చలు,సైబర్ నిపుణులతో సలహాలు, సూచనలు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్, యూ ట్యూబ్, రేడియో, టీవీ మాధ్యమాల ద్వారా నిర్వహిస్తామని 2020 జూలై 15న ఆమె ప్రకటించారు.

 1. మిషన్‌ వుమెన్‌ ప్రొటెక్షన్‌

మహిళలు, బాలికల భద్రత, రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో మహిళ భద్రతకు అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం వుమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసింది. అలాగే బాలికలు, మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడిన వారిపై అత్యంత కఠినంగా చర్యలు తీసుకునే విధంగా గతంలో ఉన్న చట్టానికి ప్రభుత్వం మార్పులు చేసింది. నేరస్తులకు 10 ఏళ్ల నుండి జీవిత కాలం శిక్ష విధించే విధంగా చట్టంలో మార్పులు తేనుంది. నేరస్తులకు జరిమానా విధించి ఆ డబ్బులను బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేసే విధంగా చట్టంలో మార్పులు తీసుకురానుంది.

 • మహిళల భద్రతకు ‘షీ టీమ్స్’

ఈవ్ టీజింగ్‌కు ముగింపు పలకాలనే ఉద్దేశంతో 2014అక్టోబర్ 24న షీ టీములను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహిళలు, యువతులు, విద్యార్థినులను రక్షించండం, వారి భద్రతకు ఈ బృందాలను ఏర్పాటుచేసింది. షీ టీమ్స్ మహిళల గౌరవాన్ని, హక్కులను కాపాడుతున్నాయి.షీ టీమ్స్‌ సభ్యులైన పోలీసులు  కాలేజీల్లోనూ, బస్టాండ్‌ల్లోనూ, రద్దీ ఉన్న ప్రదేశాలలో మఫ్టీలో సంచరిస్తారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రవేశపెట్టిన షీ టీం ప్రయోగం సక్సెస్ కావడంతో తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వం షీ టీంలను రంగంలోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో మొత్తం 200 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. 6,546 ఫిర్యాదులు అందగా 5,179 కేసులు రిజిస్టర్ చేశారు.  1547 మందిని జైలుకు పంపారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని  చాలా రాష్ర్టాలు ‘షీ టీమ్స్’ ను ప్రవేశపెడుతున్నాయి. వేదింపులకు గురవుతున్న మహిళలు డయల్ 100 ఫోన్ చేసి కానీ, ఈ మెయిల్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, హాక్ ఐ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదులు అందిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే షీ టీమ్స్ స్పందిస్తున్నాయి.

మహిళా భద్రతకోసం షీటీమ్ వాట్సాప్ నెంబర్

ఏదైనా ఆపదొస్తే సమాచారం అందించేలా రాష్ట్రస్థాయిలో షీటీమ్‌ వాట్సప్‌నంబర్‌ 9441669988ను 28 జనవరి, 2020న  ఐజీ స్వాతిలక్రా ప్రారంభించారు. 

కళాశాల్లోవిద్యార్ధినులభద్రతకోసం‘షీఫర్హర్’వాలంటీర్లు

బహిరంగప్రదేశాల్లోమహిళలభద్రతకోసంషీటీమ్స్పనిచేస్తున్నాయి. డెకాయిఆపరేషన్స్ద్వారాషీటీమ్స్సురక్షితవాతావరణాన్నికల్పించేందుకువారుకృషిచేస్తున్నారు. కానీకాళేజీల్లోచదివేవిద్యార్ధినిలుఈవ్టీజింగ్భారినపడినప్పుడువారుపోలీసులనుసంప్రదించడంలేదు. దీన్నిగమనించినప్రభుత్వంకాళేజీల్లోచదివేవిద్యార్ధినులరక్షణకోసంప్రతీకళాశాలనుంచిఇద్దరుసీనియర్విద్యార్ధినులనుఎంపికచేసివీరికిచట్టాలు, శిక్షలు, మహిళలపైహింసలువంటిఅంశాల్లోఓరియంటేషన్శిక్షణఇవ్వాలనినిర్ణయించింది. మహిళాభద్రతలోభాగంగారాచకొండసీపీపరిధిలోషీఫర్హర్పేరిటవెయ్యమందివలంటీర్లనుషీటీమ్స్సిబ్బందిసహకారంతోఏర్పాటుచేశారు.

క్యాబ్ లతో పోలీసు గస్తీ వాహనాల అనుసంధానం

తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు క్యాబ్ లలో ప్రయాణించే మహిళలు, పౌరుల భద్రత కోసం పోలీసు గస్తీ వాహనాలను క్యాబ్ లతో అనుసంధానం చేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. రాజధాని నగరం విస్తరిస్తున్నందున అన్నివేళల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులకు ఏ ఆపద ఎదురైనా, అనుకోని ప్రమాదాల్లో చిక్కుకున్నా వారిని సులువుగా కాపాడవచ్చు. ఈ క్యాబ్ లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 24 గంటల పర్యవేక్షణ ఉంటుంది.

భరోసా కేంద్రాలు

వేధింపులకు గురైన మహిళలు, పిల్లల సమస్యల్ని పరిష్కరించి, వారికి భద్రత కల్పించడానికి ప్రభుత్వం భరోసా కేంద్రాల్ని ప్రారంభించింది.ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మే 2016 న ప్రవేశపెట్టింది.ఈ సెంటర్‌ ద్వారా న్యాయంతోపాటు బాధితుల కోసం ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే, న్యాయం కోసం బాధితులు వివిధ ఏజెన్సీల చుట్టూ తిరగడం భారంగా మారినందున నిపుణులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి సత్వర న్యాయం అందిస్తున్నారు. లైగింక వేధింపుల ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైనపక్షంలో బాధితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.సైకాలజిస్టులు, లీగల్‌ కౌన్సెలర్లతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు.

ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్

నగరంలో క్యాబ్‌ల్లో ప్రయాణించే ప్రతి మహిళకు మేమున్నామని భరోసా కల్పించే విధంగా హైదరాబాద్ పోలీసులు హాక్ ఐ యాప్ ను ఉపయోగిస్తున్నారు. హాక్ ఐలో మహిళల భద్రతపై ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఒకచోట నుంచి మరోచోటకు బస్సు, రైలు, క్యాబ్ లు, ఆటోలు, ట్యాక్సీలలో ప్రయాణం చేసే ముందు ఆ వాహనం నంబర్ కన్పించేలా ఫొటోవీడియోలు తీసుకొని అప్‌లోడ్ చేయాలి.సురక్షితంగా గమ్యస్థానానికి చేరాక ప్రయాణం గురించి మీ అభిప్రాయాలు పంపించే వెసులుబాటు ఉండేది. అయితే దీన్ని మరింత సరళతరం చేశారు. మహిళలు ప్రయాణించే రూట్‌ను ట్రాక్ చేసేలా అప్షన్లను జోడించారు. హాక్ ఐ మొబైల్ యాప్ ఉన్న మహిళ ఒక వాహనం ఎక్కిన తరువాత అందులో ఉండే ఎస్‌ఓఎస్ (సేవ్ మై సోల్) బటన్‌ను నొక్కితే చాలు. అది ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నారనే విషయాన్ని అడుగుతుంది.మీరు వాహనం ఎక్కిన ప్రాంతంగమ్య స్థానంను అందులో ఎంచుకొని రూట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆటోమెటిక్‌గా మీ రూట్ ట్రాక్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఎంచుకున్న రూట్ మారిందంటే క్షణాల్లో పోలీసులు అప్రమత్తవుతారు. మీరు ఎక్కిన వాహనందిగే వరకు పోలీసుల నిఘాలో ఉంటుంది. దీంతో ప్రతి మహిళ సురక్షితంగా ప్రయాణం చేసేందుకు అవకాశముంటుంది. ప్రస్తుతం ఓలా క్యాబ్ నిర్వాహకులతో వారి మొబైల్ యాప్‌లోకిఆటోమెటిక్‌గా హాక్ ఐ అనుసంధానమయ్యే విధంగా టెక్నాలజీని ఏర్పాటు చేశారు.

 • మహిళల భద్రత కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇన్స్ పెక్టర్ జనరల్ ఆద్వర్యంలో ఒక విభాగం పనిచేస్తున్నది. భరోసా, షీ టీమ్స్ ను కూడా ఈ వింగ్ పర్యవేక్షిస్తుంది. ఉమెన్ సేఫ్టీ వింగ్ రాష్ట్రం లోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లతో కలిసి పనిచేస్తున్నది.

26.            మహిళల హెల్ప్‌లైన్ 181

మహిళల రక్షణ కోసం, అత్యాచారాలకు వ్యతిరేకంగా వెంటనే స్పందించడానికి సమీకృత మహిళా హెల్ప్‌లైన్ 181 ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది 24 గంటలు పనిచేస్తుంది. మహిళలు ఎలాంటి హింసకు గురైనా దీనిద్వారా తక్షణమే స్పందించడానికి పోలీసు, హాస్పిటల్, నిర్భయ సెంటర్లకు తక్షణమే సమాచారం తెలియజేస్తారు.

 • మహిళలు, యువతల భద్రత కోసం తెలంగాణ పోలీసులు సేఫ్టీ క్లబ్బులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వుమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జ్, ఐజీ స్వాతిలక్రా నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఈ క్లబ్బుల్లో తొలుత ప్రతి కళాశాల నుంచి కనీసం 45 మంది విద్యార్థులకు ప్రాతినిధ్యం కల్పించారు. తొలుత హైదరాబాద్‌లోని ఐదు కాలేజీల్లో ఈ క్లబ్బులను 11 ఫిబ్రవరి 2020న బ్రిటిష్‌ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ప్రారంభించారు.  వీటిలో హైదరాబాద్ భద్రుక కాలేజీ, అరోరా, జాగృతి డిగ్రీ, పీజీ కళాశాలలు, ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, శ్రేయాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ కాలేజీలున్నాయి.
 • హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో టెక్నాలజీ పరమైన సంస్కరణలు తెచ్చి ప్రజల కు వేగవంతంగా సేవలు అందిస్తున్నారు. నగర ప్రజలకు చేరవయ్యేందుకు మూడేండ్ల క్రితం హైదరాబాద్ పోలీసులు అందుబాటులోకి తెచ్చిన హాక్ ఐ మొబైల్ యాప్ సామాన్యులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నది. ప్రజా ప్రయోజనాల కోసం ఈ మొబైల్ అప్లికేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇది అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ యాప్ సమాజంపై డేగ కన్నుగా ఉపయోగపడుతూప్రతి పౌరుడు పోలీసులు సేవలను వేగంగా పొందే విధంగా దీనిని తీర్చిదిద్దారు. హాక్ ఐ యాప్‌లో మహిళల భద్రత కోసం మహిళలు ప్రయాణించే వాహనం రూట్‌ను ట్రాక్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఓలా క్యాబ్ యాప్‌లో పోలీసులకు సంబంధించిన హాక్ ఐలోని ఈ ఆప్షన్ఉంటుంది. నగర పోలీసులు ఉపయోగిస్తున్న హైదరాబాద్ కాప్ మొబైల్ యాప్ ప్రత్యేకంగా పోలీస్ శాఖలో అంతర్గతమైన సేవలకు ఉపయోగపడుతుండగాహాక్ ఐ అనేది ప్రజలకు,  పోలీసులకు మధ్య వారధిగా ఉపయోగపడుతున్నది.

హైదరాబాద్ లో టాస్క్‌ ఫోర్సులు

హైదరాబాద్‌ నగరంలో మహిళలపై, మహిళా ఉద్యోగులు, యువతులపై అఘాయిత్యాలు జరుగకుండా అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. ఇది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆద్వర్యంలో పనిచేస్తుంది. నగరంలోని ఐదు జోన్ లలో, 5 టాస్క్ ఫోర్స్ లు పనిచేస్తున్నాయి. ఒక్కో టాస్క్ ఫోర్స్ నగరంలోని నలుదిక్కుల ఈ టాస్క్‌ఫోర్స్‌ కార్యకలాపాలు వుంటాయి. వాటిని కమిషనరేట్‌లో ప్రత్యేకంగా మానిటరింగ్‌ చేస్తున్నారు.

‘డయల్ 100’ బలోపేతం

రాష్ట్రంలో అమలులో ఉన్న డయల్ 100 ను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు14,500 వాహనాలను ప్రభుత్వంపంపిణీ చేసింది. ఈ వాహనాలకు జిపిఎస్ తదితర ఉపకరణాలను సమకూరుస్తున్నారు. కెమెరాలను కూడా అమర్చనున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగేలా ప్రెటోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, బాధితుల నుంచి ఫోన్‌కాల్ వచ్చిన త్వరాత ఘటనాస్థలానికి వేగంగా చేరేలా రెస్పాన్స్ టైంను తగ్గిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెస్పాన్స్ టైం 8.5 నిమిషాలుగా ఉన్నది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ సమయం 5 నిమిషాలుగా ఉన్నది.

ఆపదలో ఉన్నవారిని ఆదుకునే డయల్ 100కు మరిన్ని హంగులు  – 30.01.2020

ఆపదలో ఉన్నవారెవరైనా డయల్ 100కు కాల్ చేశాక, వారి ఫోన్ స్విచ్ఛాఫ్ అయితే.. వారుఎక్కడున్నదీ గుర్తించడం కష్టం. కానీ, తెలంగాణ పోలీసులు ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారంకనుగొన్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా, డయల్ చేసిన వారిది స్మార్ట్ ఫోన్ కాకున్నా లొకేషన్ గుర్తించి క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకునేలా సరికొత్త సాఫ్ట్ వేర్ రూపొందించారు. అన్ని పోలీస్స్టేషన్లలో పెట్రోలింగ్ వాహనాల్లో ఉండే ట్యాబ్ లకు 100కు డయల్ చేసిన వారి లొకేషన్ కనిపిస్తుంది. దీంతో జీపీఎస్ సహకారంతో పోలీసులు అక్కడకు చేరుకొని, ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారు.

పోలీసు అమరవీరుల ఎక్స్ గ్రేషియా భారీగా పెంపు

పోలీసు అమరుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌ గ్రేషియాను భారీగా పెంచారు.  కానిస్టేబుల్‌ నుంచి అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హోదావరకు ఉన్న సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి ఇస్తున్న పరిహారాన్ని రూ. 25 నుంచి రూ.40 లక్షలకు పెంచారు.  ఎస్‌ఐ హోదా అధికారి చనిపోతే రూ.25 నుంచి రూ. 45 లక్షలకు, సిఐ, డిఎస్పి, అడీషినల్‌ ఎస్పి హోదా గల అధికారులు మృతి చెందితే ఇస్తున్న మొత్త్తాన్ని రూ. 30 నుంచి రూ. 50లక్షల వరకు, ఎస్పీ స్థాయి లేదా ఐపిఎస్‌ అధికారి మృతి చెందితే రూ. 50 లక్షల నుంచి రూ. ఒక కోటికి పెంచారు.

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో రిజర్వు బెటాలియన్

కొత్తగూడెం జిల్లాకేంద్రంలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ టీఎస్.పీ.ఎస్ (6) ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1500 మంది జవాన్లు ఉండే ఈ బెటాలియన్ కోసం చాతకొండ – పెనగడపలో రాష్ట్ర ప్రభుత్వం 140 ఎకరాల భూమిని కేటాయించగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఎస్పీ కార్యాలయం పనులు కూడా జరుగుతున్నాయి. ఎన్.సి.సి. రెజిమెంట్ కూడా ఇక్కడే ఉంది.

పోలీస్ శాఖ నియామకాల్లో వయో పరిమితి మూడేండ్ల సడలింపు

పోలీస్ శాఖ నియామకాల్లో అభ్యర్థుల కనీస వయోపరిమితిని ప్రభుత్వం సడలించింది.వివిధ క్యాటగిరీల్లో ఉన్న వయో పరిమితిని మూడేండ్లకు పెంచుతూ ఆఫైలు మీద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2015 నవంబర్ 8న సంతకం చేశారు. దీని ప్రకారం కానిస్టేబుళ్లనియామకాల్లో జనరల్ క్యాటగిరీ అభ్యర్థులకు 22 ఏండ్ల వయోపరిమితిని 25 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితిని 27 నుంచి 30 ఏండ్లకు పెంచారు. సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) పోస్టుల నియామకానికి జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయోపరిమితిని 25నుంచి 28 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ,బీసీరిజర్వు కేటగిరీ అభ్యర్థులకు 30నుంచి 33 ఏండ్లకు పెంచారు.

పోలీసుశాఖలో 17,292 ఉద్యోగాల భర్తీ

రాష్ట్ర పోలీసుశాఖలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 17,292 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇందులో 5,882 సివిల్ కానిస్టేబుళ్లను, 4,264 ఆర్ముడు రిజర్వు కానిస్టేబుళ్లను, 53 స్పెషల్ ఆర్ముడు రిజర్వు పోలీసు కానిస్టేబుళ్లను, 4,734 స్పెషల్ పోలీసు కానిస్టేబుళ్లతో 479 మంది స్పెషల్ పోలీస్ ఫోర్సు కానిస్టేబుళ్లను, 164 మంది ఎస్.డి.ఆర్.ఎఫ్ ఫైర్ మెన్లను, 185 మంది పురుష వార్డర్లను, 34 మంది మహిళా వార్డర్లను, 142 మంది ఐటీ కమ్యూనికేషన్స్ కానిస్టేబుళ్లను, 18 మంది మెకానిక్ పీసీలను, 70 మంది డ్రైవర్ పీసీలను ప్రభుత్వం నియమించింది.

అలాగే 710 మంది సివిల్ ఎస్సైలను, 275 మంది ఏఆర్ ఎస్సైలను, ఐదుగురు స్పెషల్ ఆర్ముడు రిజర్వుడు ఎస్సైలను, 175 మంది స్పెషల్ పోలీస్ ఎస్సైలను, 16 మంది ఎస్పీఎఫ్ ఎస్సైలను నియమించింది. అలాగే, 19 మంది డిసాస్టర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్లను, 15 మంది డిప్యూటీ జైలర్లను, ఇద్దరు అసిస్టెంట్ మాట్రన్లను, 29 మంది ఐటీ కమ్యూనికేషన్స్ ఎస్సైలను, 26 మంది ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఏఎస్సైలను కూడా ప్రభుత్వం నియమించింది.

గ్యాంబ్లింగ్‌ సెంటర్లు, పేకాట క్లబ్బుల మూసివేత

మనుషులను వ్యసనపరులుగా మార్చి వారి జీవితాలను ఆగం చేయడంలో ప్రధాన పాత్ర పేకాట గ్యాబ్లింగులది. తెలంగాణ వంటి వెనుకబాటుకు గురైన రాష్ట్రాల్లో చేతినిండా పనిలేక అనేక దురలవాట్లకు లోనైన చరిత్ర గత పాలనతోనే అంతం కావాలని నూతన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పేకాటక్లబ్బులను మూసేయాలని తెలంగాణ వచ్చిన కొత్తలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తదుపరి కాలంలో సత్పలితాలనిచ్చింది.చాలామంది జీవితాలను ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్న గ్యాంబ్లింగ్‌ సెంటర్లు, పేకాట క్లబ్బులను మూసివేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ దందాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఉండవద్దనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. ప్రభుత్వం పేకాట క్లబ్బులను మూసివేసినా ఆన్‌లైన్‌లో గేమింగ్, గ్యాంబ్లింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో… రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో రమ్మీ, పేకాట ఆడటాన్ని నిషేధించాలని 2017 జూన్17న కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు గ్యాంబ్లింగ్, గేమింగ్‌ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. అప్పటినుంచి తెలంగాణలో ఆన్లైన్ పేకాట ఆడటం రద్దయ్యింది.

 • వ్యక్తులను అనారోగ్యం పాలు చేసి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా శక్తిహీనులను చేసే మహమ్మారి కల్తీ. ఇది కేవలం మానవ తప్పిదం కావడం దురదృష్టకరం. కంచే చేను మేసిన చందంగా, నమ్మకంగా కొనుక్కుని వినియోగిస్తున్న ప్రతి వస్తువులో కల్తీ మయం కావడం రోజురోజుకూ పెరుగుతున్న దుర్మార్గం. ఇటువంటి దుర్మార్గాలకు చెక్ చెప్పకపోతే రానున్న భావి తరాల భవిష్యత్తు నిర్వీర్యమైపోతుందనే ముందు చూపుతో కల్తీని అరికట్టే దిశగా ముఖ్యమంత్రి తీసుకున్న కఠిన చర్యలు మహిళల ఆదరణ చూరగొంటున్నవి.

ఈ దిశగా ప్రభుత్వం పీడీ యాక్టులోకి మరో పది అంశాలను చేర్చింది. ఈ మేరకు 2017 జూన్17న జరిగిన కేబినెట్‌ ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం తెలిపింది.  ఆయా మోసాలకు పాల్పడేవారిని కూడా పీడీ యాక్టు కింద అదుపులోకి తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.కల్తీ నిరోధానికి పోలీసు శాఖ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది.

పీడీ యాక్టులో చేర్చిన మరో పది మోసాలు..

 • , ఎరువులు, పురుగుమందుల విక్రేతలు
 • , నూనె, పప్పు, కారం తదితర ఆహార పదార్థాల కల్తీకి పాల్పడేవారు
 • , సర్టిఫికెట్లు తయారుచేసేవారు
 • , ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసేవారు
 • , వైట్‌ కాలర్‌ నేరాలు చేసేవారు
 • టెక్నాలజీ వినియోగంలో దేశంలో నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ పోలీసులు మరో ముందడుగు వేశారు. దేశంలో తొలిసారిగా ఐసీజేఎస్ (ఇంటర్ ఆపెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం) పైలట్ ప్రాజెక్టును వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్ నుంచి 15 డిసెంబర్, 2018న ప్రారంభించారు. వరంగల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించారు. దీనిని క్రమంగా రాష్ట్రం మొత్తం విస్తరిస్తారు. ఏదైనా ఒక కేసు సమాచారాన్ని పోలీసులు, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్ అధికారులతోపాటు ప్రాసిక్యూషన్ విభాగాలకు వెంటనే చేరవేసేందుకు ఐసీజేఎస్ విధానం తోడ్పడుతుంది. ఈ విధానంతో పోలీస్, జ్యుడీషియల్ అధికారుల మధ్య సమన్వయం పెరిగి.. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

చిన్నారి మిత్ర’ కోర్టు

లైంగిక వేదింపులకు, అత్యాచారాలకు గురవుతున్న చిన్నారులు, మైనర్లకు సత్వర న్యాయం జరిగేందుకు ప్రభుత్వం హైదరాబాద్ లో ‘చిన్నారి మిత్ర’ కోర్టును ఏర్పాటు చేసింది. న్యాయస్థానంలో విచారణ గది, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం, బాధితుల నమోదు వాంగ్మూలం కేంద్రం ఏర్పాటుచేశారు. నగరంలోని హాకా భవన్ ప్రాంగణంలో ఉన్న కోర్టు తరహాలోనే ఉమ్మడి పది జిల్లాల్లో కూడా వీటిని నెలకొల్పాలనే ఆలోచన చేస్తున్నారు.

తెలంగాణలోని జైళ్లలో అవినీతిని అరికట్టేందుకు,  జైళ్లలో మరణాలను తగ్గించడానికి, జైళ్లశాఖలో ఆదాయాన్ని పెంచడానికి నూతన సంస్కరణలను జైళ్లశాఖ అమలు చేస్తున్నది. ఈ సంస్కరణలు అమలు చేయడంతో జైళ్లలో అవినీతిని అరికట్టారు. పెట్రోల్ బంక్ ల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. 2013 జైళ్ల శాఖ ఆదాయం రూ.1.5 కోట్లు వుంటే, అది 2018 లో రూ.17కోట్లకు పెరిగింది. 2014 లో 56మంది ఖైదీలు మరణిస్తే, 2018 లో మరణాల సంఖ్య 8 కి తగ్గింది. విడుదలైన ఖైదీలపై నిఘా పెడుతున్నారు. ఖైదీలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో పరివర్తన తీసుకొస్తున్నారు.

ోనిజీవితఖైదీలకుటుంబాలకుఆర్థికసాయం

జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీల కుటుంబాలకు భరోసాను కల్పిస్తూ.. వారి పిల్లల చదువులకు, ఆడపిల్లల పెళ్లిళ్లకు వడ్డీ లేకుండా రూ.50 వేల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దేశంలో ఏ జైళ్లలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దీన్ని 2016 నుంచి అమలుపరుస్తున్నారు. రూ.50 వేల రుణాన్ని రూ.లక్షల వరకు పెంచాలని భావిస్తున్నారు.

 • గ్రామీణ ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం గ్రామాల్లోనే కోర్టులను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రంలోని 55 చోట్ల విలేజ్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు 01 ఫిబ్రవరి, 2019 న వెలువెడ్డాయి. విలేజ్ కోర్టు జడ్జిగా జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ వ్యవహరిస్తారు. ఒక్కో కోర్టులో హెడ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, అటెండర్ ఉండనున్నారు. జడ్జి మినహా మిగతా వారందరినీ కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నారు. వీరి వేతనాలకు రూ.90 కోట్లు, ఇతర ఖర్చులకు రూ. 3 కోట్ల వ్యయం కానుంది.

39. పోలీసు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ

శాంతిభద్రతల విషయంలో జాగిలాల పాత్రను గుర్తించిన తెలంగాణ పోలీస్‌శాఖ 37 జాగిలాలకు ప్రత్యేక శిక్షణనిప్పించింది. ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఐఐటీఏ) ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ జాగిలాలను 14  ఫిబ్రవరి 2020 న పోలీసుశాఖకు అప్పగించారు. పేలుడు పదార్థాల గుర్తింపు, ప్రమాదకర ప్రాంతాలకు చేరుకోవడం, వీఐపీల భద్రత వంటి అంశాల్లో, కీలక కేసులను ఛేదించడంలో పోలీసులకు జాగిలాలు ఎంతో సహకరిస్తున్నాయి.

 • రాష్ట్రంలో నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై తెలంగాణ పోలీసులు డ్రోన్లతో పహారా కాస్తున్నారు. ఒక్కో కానిస్టేబుల్ మూడు కిలోమీటర్ల పరిధిలో ఏం జరుగుతుందో తెలుసుకునే వీలుంటుంది. 2017 నుంచి ఈ డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. డ్రోన్ పెట్రోలింగ్ వల్ల పేకాట, మద్యపానం, మట్కా జూదం, ఇసుక అక్రమ రవాణా, గంజాయి సాగు గుట్టు రట్టవగా, వందల సంఖ్యలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నిందితులపై అభియోగాలను నిరూపించి, శిక్షపడేలా చేయడంలో డ్రోన్ కెమెరాలు గగనతలం నుంచి తీసిన వీడియోలు కీలకంగా మారుతున్నాయి. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో, ఊరేగింపుల సమయంలో కూడా డ్రోన్ కెమెరాల వాడకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

తెలంగాణలో తగ్గిన నేరాల సంఖ్య

తెలంగాణ ప్రభుత్వం ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తూ, అత్యాధునిక సాంకేతిక వినియోగాన్ని ఉపయోగిస్తూ, నూతన ఆవిష్కరణలు సృష్టిస్తూ.. పోలీసు శాఖలో నూతన సంస్కరణలు తీసుకువచ్చింది. పోలీసుల్లో జవాబుదారీ తనాన్ని పెంచింది. ప్రజలకు పోలీసులకు మద్య అంతరాన్ని తగ్గించింది. స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచింది. దీంతో క్రమంగా నేరాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది.

 • ,కిడ్నాపుల్లో 19 శాతం తగ్గుదల రికార్డైంది.
 • , ఎస్టీలపై నేరాలు 3 శాతం పెరిగాయి.
 • , దోపిడీలు, బ్యాంకు రాబరీల్లో చోరీకి గురైన సొమ్ములో దాదాపు 69 శాతం రికవరీ చేశారు.

సాధించిన విజయాలు, అవార్డులు

-అందుబాటులోకి టీఎస్‌కాప్, ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్), కాప్‌కనెక్ట్ టెక్నాలజీ. 
-ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీతో 354 కేసులు ఛేదించి, 6,832 మంది పాత నేరస్తులను గుర్తించారు. 
-పోలీసులకు 8.51 లక్షల ఫోన్‌కాల్స్ ద్వారా ఫిర్యాదులు అందాయి. 
-పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా గుర్తింపు.
-అత్యంత వేగంగా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పూర్తిచేస్తున్నందుకు వరుసగా నాలుగోసారి బెస్ట్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌అవార్డు దక్కింది.
-సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టు అమలులో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉండటంతో స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కింది.

ప్రధాన లక్ష్యాలు

-అన్ని జిల్లాకేంద్రాల్లో భరోసా కేంద్రం, అన్ని పీఎస్‌లలో షీటీమ్స్ ఏర్పాటు. 
-హైదరాబాద్ మాదిరిగా అన్ని పట్టణ పోలీస్ స్టేషన్లను సిటిజన్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దడం. 
-ఈ-చలాన్ విధానాన్ని అన్ని పోలీస్ స్టేషన్లను విస్తరించడం. 
-ఈ-పెట్టీ కేసు విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం. 
-ప్రతి జిల్లా కేంద్రంలో డాటా ఎనాలటిక్ సెంటర్, ఫింగర్‌ప్రింట్స్ ఐడెంటిఫికేషన్, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్, సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సపోర్ట్ సెంటర్ల ఏర్పాటు.
-ప్రతి జిల్లా కేంద్రంలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ల్ల ఏర్పాటు.
-రాష్ట్రం నుంచి వెళ్తున్న అన్ని జాతీయ రహదారులపై పెట్రోలింగ్.

సైనికుల సంక్షేమం

దేశ రక్షణకోసం ప్రాణాలర్పించిన అమరజవాన్ల కుటుంబాలపట్ల తెలంగాణ ప్రభుత్వం  బాధ్యతతో వ్యవహరించింది. సైనికులు, మాజీ సైనికులు, అమరజవాన్ల కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర పరిధిలోని అంశాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 24 డిసెంబర్, 2016న మాజీ సైనికోద్యోగులు, సైనికాధికారులతో జరిగిన సమావేశంలో వారి సమస్యలు, ఇబ్బందులు సావధానంగా విన్న సీఎం కేసీఆర్వారికి లబ్ధి చేకూర్చేనిర్ణయాలనుతీసుకున్నారు. వీర జవానుల సంక్షేమానికి రూ.80 కోట్ల నిధులను మంజూరు చేశారు.

 • మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. సైనికులెవరైనా రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే డబుల్ పెన్షన్ పొందే వెసులుబాటు ఉంది. అయితే  ఈ సదుపాయం మరణించిన మాజీ సైనికుల భార్యలకు వర్తించడం లేదు.  కేంద్రం ఇచ్చేది కానీ, రాష్ట్రం ఇచ్చేది కానీ ఏదో ఒక పెన్షన్ మాత్రమే పొందాలనే విధానం అమల్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన మాజీ సైనికులు రెండు పెన్షన్లు పొందే వెసులు బాటు కల్పిస్తున్నది. ఆ మాజీ సైనికుడు మరణిస్తే ఆయన భార్య కూడా రెండు పెన్షన్లు పొందే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం కల్పిస్తుంది.
 • సర్వీసుకాలంలో యుద్ధంలో మరణించిన సైనికులకు, ఇతర కారణాలతో మరణించిన సైనికులకు ఇస్తున్న పరిహారంలో ప్రస్తుతం వ్యత్యాసం ఉన్నది. ఇతర సదుపాయాల్లోనూ తేడా ఉన్నది. అయితే, యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు ఏ రకమైన పరిహారం, సదుపాయాలు ఇస్తున్నారో… సర్వీసులో ఉండి అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల లాంటి ఇతర కారణాల వల్ల మరణించిన సైనికుల కుటుంబాలకు కూడా అదే పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.
 • స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న మాజీ సైనికోద్యోగుల వేతనాలను కూడా ప్రతీ నెలా ఇతర ఉద్యోగులతోపాటు విధిగా చెల్లించాలని నిర్ణయించింది.
 • రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేయనున్నది. ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న బోర్డులను రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో ఏర్పాటు చేస్తుంది. ఈ బోర్డుల ద్వారానే సైనిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు.
 • సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి రిజర్వేషన్ కల్పించనుంది. మిలటరీ నిర్వహించే స్కూళ్లకు రాష్ట్ర గుర్తింపు ఇవ్వనుంది. విద్యా సంస్థల్లో స్కౌట్స్, గైడ్స్, ఎన్.సి.సి. శిక్షణ తీసుకునే విధంగా విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టనుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన విద్యార్థులకు ప్రోత్సహించడం కోసం ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు.  
 • వరంగల్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.95 కోట్లు విడుదల చేయనుంది.
 • ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైనికులు తిరుగుతుంటారు. రాష్ట్రం మారిన ప్రతీసారి వారి సొంత వాహనాలకు తిరిగి లైఫ్ ట్యాక్సులు చెల్లించాల్సి వస్తున్నది. దేశంలో ఎక్కడ పన్ను చెల్లించినప్పటికీ, మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది.
 • సైనికులు నిర్మించుకునే ఇండ్లకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపునిచ్చింది. సైనికుల భార్య పేర ఉన్న ఇంటికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. డబుల్ బెడ్ రూమ్ పథకంలో మాజీ సైనికులకు రెండు శాతం కేటాయింపు, డబుల్ పెన్షన్ విధానం అమలు, రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులు, వారి భార్యలకు ఇచ్చే పెన్షన్ ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచటం వంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది.
 • యుద్ధరంగంలో శౌర్యప్రతాపాలు ప్రదర్శించినందుకూ,  ప్రాణాలు త్యాగం చేసినందుకూ గ్యాలంటరీ అవార్డు పొందిన సైనికులకు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గౌరవంగా కొంత నగదును అందిస్తున్నాయి.  పరమ వీర చక్ర, మహావీరచక్ర, వీరచక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, సేనా మెడల్ అవార్డులు పొందిన వారికి ఇతర రాష్ట్రాల్లో  ఇస్తున్న దానికన్నా ఎక్కువ నగదు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
క్ర.సంఅవార్డుఅత్యధికంరాష్ట్రంఉమ్మడి ఎ.పి.తెలంగాణ  
1పరమవీర చక్ర/అశోకచక్ర2 కోట్లుపంజాబ్10 లక్షలు2.25 కోట్లు
2మహావీరచక్ర/కీర్తిచక్ర1 కోటిపంజాబ్8 లక్షలు1.25 కోట్లు
3వీరచక్ర/శౌర్యచక్ర50 లక్షలుపంజాబ్6 లక్షలు75 లక్షలు
4సేనా మెడల్21 లక్షలుహర్యానా23,25030 లక్షలు
5మెన్షన్ ఇన్ డిస్పాచెస్10 లక్షలుపంజాబ్12,00025 లక్షలు
6సర్వోత్తమ యుద్ధ సేవా20 లక్షలుకేరళలక్షా 27వేలు25 లక్షలు
7ఉత్తమ యుద్ధసేవా పతకం16 లక్షలుకేరళ75 వేలు20 లక్షలు
8యుద్ద సేవా పతకం2 లక్షలుకేరళ34 వేలు5 లక్షలు

 

ఎస్పీవోలుగా పనిచేస్తున్న మాజీ సైనికులకు జీతభత్యాలు పెంపు

రాష్ట్ర పోలీస్ శాఖలో ఎస్పీవోలుగా విధులు నిర్వహిస్తున్న మాజీ సైనికులకు జీతభత్యములు నెలకు రూ.10 వేల నుంచి 20 వేలకు పెంచుతూ ప్రభుత్వం 2017 మార్చి 17న ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వెయ్యి మంది మాజీ సైనికులు లబ్ధి పొందనున్నారు. మాజీ సైనికులు లేదా వారి భార్య పేరుపై ఉన్న ఇంటికి ఆస్తి పన్ను మినహాయింపును అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో అనేక మంది మాజీ సైనికులు లబ్ధి పొందనున్నారు. మాజీ సైనికుల భార్యలకు ప్రభుత్వం పెన్షన్ అందించనుంది. కేంద్రం ఇచ్చే పెన్షన్‌తోపాటు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనుంది.

కల్నల్ సంతోష్ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం(22జూన్2020)

భారత్-చైనాసరిహద్దుల్లోజరిగినఘర్షణలోమరణించినకల్నల్బిక్కుమళ్లసంతోష్బాబుకుటుంబాన్నిముఖ్యమంత్రికె.చంద్రశేఖర్రావు22 జూన్ 2020నసుర్యాపేటలోపరామర్శించారు. ముందుగాసంతోష్చిత్రపటానికిపూవులుచల్లిఅంజలిఘటించారు. అనంతరంసంతోష్భార్యసంతోషి, తల్లితండ్రులుమంజుల, ఉపేందర్, సోదరిశృతిలనుఓదార్చారు.  సంతోష్పిల్లలు, అభిగ్న, అనిరుధ్తేజలతోమాట్లాడారు. దేశరక్షణకోసంసంతోష్ప్రాణత్యాగంచేశారనిముఖ్యమంత్రికొనియాడారు.  సంతోష్మరణంతననుఎంతగానోకలచివేసిందనిముఖ్యమంత్రిచెప్పారు.  ప్రభుత్వంసంతోష్కుటుంబానికిఎల్లవేళ్లలాఅండగావుంటుందనిహామీఇచ్చారు.   ఎప్పుడుఏఅవసరంవచ్చినాతమనుసంప్రదించాలనిచెప్పారు.   సంతోష్కుటుంబబాగోగులుచూసుకోవాలనిమంత్రిజగదీశ్రెడ్డినిసీఎం కోరారు.  సంతోష్భార్యసంతోషీకిగ్రూప్ఒన్ఉద్యోగంఇచ్చేనియామకపత్రాన్నిముఖ్యమంత్రిస్వయంగాఅందజేశారు. హైదరాబాద్లోనిబంజారాహిల్స్లో711 గజాలస్థలానికిసంబంధించినపత్రాన్నిసంతోష్భార్యకుముఖ్యమంత్రిఅందించారు.   సంతోష్భార్యకురూ. 4 కోట్లచెక్కును, తల్లితండ్రులకురూ.1 కోటిచెక్కునుముఖ్యమంత్రిఅందించారు. 

కల్నల్సంతోష్బాబుకుటుంబానికికేసీఆర్అండ.. దేశానికేఆదర్శం

కాంగ్రెస్జాతీయఅధికారప్రతినిధిఅభిషేక్సింఘ్వీ(22జూన్2020)

కల్నల్సంతోష్బాబుకుటుంబానికిముఖ్యమంత్రికె.చంద్రశేఖర్రావుఅండగానిలిచి, దేశానికేఆదర్శంగానిలిచారనికాంగ్రెస్జాతీయఅధికారప్రతినిధిఅభిషేక్సింఘ్వీప్రశంసించారు. ఈమేరకుఆయన22 జూన్2020నట్వీట్చేశారు. కల్నల్సంతోష్బాబుకుటుంబానికిరూ.5 కోట్లనగదుసాయంఅందించడం, ఆయనసతీమణిసంతోషికిగ్రూప్-1 అధికారిగాఉద్యోగమివ్వడంహర్షణీయం. సంతోష్మరణంతోతల్లడిల్లుతున్నఆకుటుంబానికిఅండగానిలిచేందుకుసీఎంకేసీఆర్తీసుకున్నచొరవనుకేంద్రప్రభుత్వం,మిగతారాష్ట్రాలుఆదర్శంగాతీసుకోవాలి.. అనిసింఘ్వీట్వీట్చేయగా, ఐటీశాఖమంత్రికేటీఆర్, మాజీఎంపీకవితరీట్వీట్చేశారు.

వీర జవాన్ మహేష్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం – 9 నవంబర్, 2020

సరిహద్దుల్లోజరిగినకాల్పుల్లోనిజామాబాద్జిల్లాకుచెందినజవాన్మహేశ్మరణంపట్లముఖ్యమంత్రికె. చంద్రశేఖర్రావుతీవ్రదిగ్భ్రాంతివ్యక్తంచేశారు. దేశరక్షణకోసంప్రాణాలుఅర్పించినయోధుడుమహేశ్కుటుంబానికిప్రభుత్వంఅండగాఉంటుందనిప్రకటించారు. జవాన్కుటుంబానికిప్రభుత్వంపరంగారూ. 50లక్షలఆర్థికసాహాయంఅందించనున్నట్లువెల్లడించారు. అర్హతనుబట్టికుటుంబసభ్యుల్లోఒకరికిప్రభుత్వఉద్యోగంఇస్తామనితెలిపారు. మహేశ్కుటుంబానికిఇంటిస్థలంకూడాకేటాయస్తామనివెల్లడించారు.

సీఎంకేసీఆర్గారూ.. మీరుగ్రేట్‌! (26జూన్2020)

అమరజవాన్లకుసాయంపైముఖ్యమంత్రికేసీఆర్‌ఔదార్యాన్నిభారతనౌకాదళడిప్యూటీచీఫ్‌.. వైస్‌అడ్మిరల్‌ఎంఎస్‌పవార్‌ప్రశంసించారు. ఈమేరకుఆయనముఖ్యమంత్రికిఒకలేఖరాశారు. ‘విజయనగరంకోరుకొండసైనిక్‌స్కూల్‌పూర్వవిద్యార్థి (సాయికొరియన్‌)’ హోదాలోఈలేఖరాస్తున్నట్టుపేర్కొన్నపవార్‌ముఖ్యమంత్రికికృతజ్ఞతలుతెలిపారు. ఒకసారి కోరుకొండ సైనిక్ స్కూల్ ను తప్పక సందర్శించాలని కోరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏడేళ్లలో పోలీస్ శాఖలో పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు

ట్రెండింగ్‌

Advertisement