e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News లోటు విద్యుత్ నుంచి.. మిగులు విద్యుత్ దిశగా..

లోటు విద్యుత్ నుంచి.. మిగులు విద్యుత్ దిశగా..

లోటు విద్యుత్ నుంచి.. మిగులు విద్యుత్ దిశగా..

హైద‌రాబాద్ : తెలంగాణ వస్తే ఏం వస్తుంది? అనే వారికి రాష్ట్ర ప్రభుత్వం కోతల్లేని కరెంటు సరఫరా చేసి మొదటి జవాబు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయగీతికలో పల్లవిగా నిలిచింది విద్యుత్ విజయం. పాలనే చేతకాదు అనే వాళ్ల నోళ్లు మూయించిన మొదటి అంశం విద్యుత్ సంక్షోభం నుంచి విజయవంతంగా గట్టెక్కడం. తెలంగాణ వస్తే ఇక చిమ్మచీకట్లే అని విమర్శించిన నోళ్లు మూయించిన సక్సెస్ స్టోరీ నిరంతర కరెంటు సరఫరా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టి పెట్టిన రంగం విద్యుత్. చాలా వేగంగా ఫలితం వచ్చి ప్రజలు నూటికి నూరు శాతం సంతృప్తితో ఉన్న అంశం విద్యుత్. 13 వేల మెగావాట్లకు పైగా డిమాండ్ వచ్చినప్పటికీ ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేసిన ఘనతను తెలంగాణ విద్యుత్ సంస్థలు దక్కించుకున్నాయి. తెలంగాణ వచ్చేనాటికి లోటు విద్యుత్ గా ఉన్న దుస్థితి నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.

తెలంగాణ వ‌చ్చే నాటికి ప‌రిస్థితి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది. నిత్యం కరెంటు కోతలు, పవర్ హాలిడేలు విధించేవారు. హైదరాబాద్ నగరంలో రోజూ 2 నుంచి 4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలు విద్యుత్ కోతలు అమలయ్యేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలుండేవి. కావాల్సినంత కరెంటు లేకపోవడంతో పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడ్డవి. కరెంటు కోసం పారిశ్రామిక వేత్తలు నిత్యం ధర్నాలు చేసేవారు. అటు ఇందిరాపార్కు, ఇటు విద్యుత్ సౌధలో ఎప్పుడూ ఆందోళనలే జరిగేవి. హైదరాబాదులో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే వాతావరణం ఉండేది. వ్యవసాయానికి రెండు, మూడు గంటల కరెంటు కూడా అందకపోవడంతో పంటలు ఎండిపోయేవి. భూగర్భంలో నీళ్లున్నా తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంట కళ్లెదుటే నాశనం అయ్యేది. లో ఓల్టేజీ  సమస్యల వల్ల నిత్యం మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కూడా ఈ దుస్థితి కొనసాగింది. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన కరెంటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కొరత 2,700 మెగావాట్లు. ఆ లోటు ఎలా పూడుతుందో తెలియని పరిస్థితి ఉండేది.

తెలంగాణలో కరెంటు సంక్షోభానికి కారణం ?

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ. ఆంధ్రలో విద్యుత్ డిమాండ్ తక్కువ. తెలంగాణలో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువున్న హైదరాబాద్ నగరానికి రెండువేలకుపైగా మెగావాట్ల విద్యుత్ కావాలి. తెలంగాణలో 25.29 లక్షల  వ్యవసాయ పంపుసెట్లున్నాయి. దీనికి మరో 3500 మెగావాట్లకు పైగా విద్యుత్ కావాలి. విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపనకు అవసరమయ్యే బొగ్గు, నీరు తెలంగాణ ఉంది. తెలంగాణలో డిమాండ్ ఉంది. ఉత్పత్తి అవకాశాలున్నాయి. ఆంధ్రలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. అక్కడ విద్యుత్ డిమాండ్ తక్కువ. బొగ్గు లేదు. అయినా సరే.. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను తెలంగాణలో తక్కవ, ఆంధ్రలో ఎక్కువ నెలకొల్పారు. విజయవాడ, కడప, నెల్లూరులో బొగ్గు లేకున్నా అక్కడ థర్మల్ పవర్ స్టేషన్లు పెట్టారు. ఫలితంగా రెండురకాల నష్టాలు ఏర్పడ్డాయి. బొగ్గు లేనిచోట కరెంటు ఉత్పత్తి చేయడం వల్ల రవాణా భారం అధికమైంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ థర్మల్ కేంద్రాలు ఆంధ్రకు పోవడం వల్ల తెలంగాణకు లోటు కరెంటు, ఆంధ్రకు మిగులు కరెంటు దక్కింది. ఈ పరిస్థితి గమనించే విభజన చట్టంలో ఉభయ రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన కరెంటులో ఆంధ్ర 47 శాతం, తెలంగాణ 53 శాతం వాడుకోవాలని పేర్కొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పరిధిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి తెలంగాణకు ఇవ్వాల్సిన 53 శాతం కరెంటును ఇవ్వకపోవడంతో విద్యుత్ సంక్షోభం ఎక్కువైంది.

విద్యుత్ సంక్షోభాన్ని సవాల్ గా తీసుకున్న ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడమనే సవాల్ ను మొదటగా స్వీకరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు వేశారు. ముందుగా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. సరఫరాలో, పంపిణీలో కలుగుతున్న నష్టాలను బాగా తగ్గించుకోగలిగారు. నత్తనడకన నడుస్తున్న భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించారు. అవి వేగంగా పూర్తయి ఉత్పత్తి ప్రారంభించే వరకు వెంటపడ్డారు. తెలంగాణలో పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ అత్యవసం కాబట్టి, ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఎక్కడ కరెంటు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి తీసుకున్నారు. ఉత్తరాది నుంచి కరెంటు పొందడానికి వీలుగా ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని పిజిసిఎల్ ద్వారా కొత్త లైను నిర్మాణం చేయించారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూపకల్పన చేశారు. విద్యుత్ సంస్థలు సింగరేణికి బకాయిపడిన 5,772 కోట్ల రూపాయలను ప్రభుత్వమే చెల్లించింది. గరిష్ట డిమాండ్ వచ్చినప్పుడు జరిపే అదనపు విద్యుత్ కొనుగోళ్లకు అయ్యే వ్యయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వమే భరిస్తున్నది. మొత్తంగా ప్రభుత్వం ఏర్పడిన ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 42,632 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించింది.

సంస్థ ఉద్యోగులకే సారథ్య బాధ్యతలు

విద్యుత్ సంస్థలో నాలుగు భాగాలుంటాయి. విద్యుత్ ను ఉత్పత్తి చేసే జెన్ కో, సరఫరా చేసే ట్రాన్స్ కో, విద్యుత్ పంపిణీ చేసే ఎస్పీడిసిఎల్, ఎన్పీడిసిఎల్. ఈ నాలుగు సంస్థల నిర్వహణ బాధ్యతను ఆ సంస్థలో పనిచేసిన అనువజ్ఞులకే అప్పగిస్తూ కీలకమైన విధానం నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. విద్యుత్ సంస్థలను నడపడంలో అనుభవం ఉన్న విద్యుత్ ఉద్యోగులకే పగ్గాలు అప్పగించారు. వారికైతేనే సాధకబాధకాలు తెలుస్తాయని భావించారు. విద్యుత్ సంస్థలో నాలుగు దశాబ్దాలపాటు వివిధ స్థాయిల్లో పనిచేసిన అనుభవం కలిగిన దేవులపల్లి ప్రభాకర్ రావును జెన్ కో, ట్రాన్స్ కో సంస్థలకు సిఎండిగా నియమించారు. ఆ సంస్థలకు కావాల్సిన నిధులు సమకూర్చడంతోపాటు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ తదితర విషయాల్లో ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కూడా ఇచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించి, ఆచరణ బాధ్యతలను కూడా వారికే అప్పగించారు. దీంతో కేసీఆర్ ఆశించిన ఫలితాలు వెనువెంటనే వచ్చాయి.

విద్యుత్ సంక్షోభంపై స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు

తెలంగాణ విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహం అనుసరించింది. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో పకడ్బందీ వ్యూహం రూపొందించింది.

స్వల్పకాలిక వ్యూహం

 • సంస్థ అంతర్గత సామర్ధ్యం మెరుగుపరుచుకోవడం. ప్లాంటు లోడ్ ఫాక్టర్ (పిఎల్ఎఫ్) పెంచుకోవడం, పంపిణీలో నష్టాలను నివారించుకోవడం.
 • అప్పటికప్పుడు సంక్షోభంలోంచి బయటపడి ప్రజలకు కావాల్సిన విద్యుత్ అందించడం కోసం ఎక్కడ దొరికితే అక్కడ విద్యుత్ కొనుగోలు చేయడం.
 • స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 2000 మెగావాట్ల విద్యుత్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు.

మధ్యకాలిక వ్యూహం

 • కొద్దికాలం పాటు స్థిరంగా విద్యుత్ అందించగలిగే సంస్థలతో కొనుగోలు ఒప్పందాలు.
 • 8 సంవత్సరాలపాటు విద్యుత్ అందించడం కోసం పిపిఎలు
 • ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో వెయ్యి మెగావాట్ల కొనుగోలు ఒప్పందం

దీర్ఘకాలిక వ్యూహం

తెలంగాణకు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా కొత్త పవర్ స్టేషన్ల నిర్మాణానికి, నాణ్యమైన కరెంటు సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త పవర్ స్టేషన్లతో పాటు సబ్ స్టేషన్లు, లైన్లు నిర్మించింది. ఉత్తరాదితో నిరంతరం లింకు ఉండేందుకు కొత్త లైన్లు నిర్మింపజేసింది. 28వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో కొత్త ప్లాంట్ల నిర్మాణం చివరి దశకు చేరుకున్నది. 

ఆరో నెల నుంచే కోతల్లేని విద్యుత్ సరఫరా

రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరో నెల (2014, నవంబర్ 20) నుంచే కోతల్లేని విద్యుత్ ప్రజలకు అందిస్తున్నారు. గృహావసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంటు అందిస్తున్నారు. భవిష్యత్ లోనూ తెలంగాణ  రాష్ట్రంలో విద్యుత్ కోతలుండకుండా ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో దాదాపు 28 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నది. ఇందులో 5 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఉన్నది. ఇందుకనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు కూడా భారీగానే కేటాయిస్తున్నది. 2014 -15లో రూ.3,600 కోట్లు, 2015 -16లో రూ.4,257 కోట్లు, 2016-17లో రూ.4,584 కోట్లు, 2017-18లో రూ.4,777 కోట్లు, 2018-19లో రూ.5,940 కోట్లు, 2019-20లో రూ.8299.45కోట్లు, 2020-21లో 10,415 కోట్ల రూపాయలను ప్రభుత్వం విద్యుత్ శాఖకు కేటాయించింది. సమైక్య పాలనలో గత ప్రభుత్వాలు 2004-14 (పదేళ్ల కాలంలో) రూ.13,922 కోట్లు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం 2014-20 మధ్య కాలంలో రూ.49,875 కోట్లు కేటాయించింది.

 • వంద శాతం పెరిగిన స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
 • తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉంది. ఇందులో  నికరంగా విద్యుత్ అందచేయగలిగే జెన్ కో సామర్థ్యం కేవలం 5 వేల  మెగావాట్లు మాత్రమే. మిగతా 2,700 మెగావాట్ల లోటు ఏర్పడేది. ఇపుడు 16,245 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది.
 • దేశ సగటు వృద్ధిశాతం 3.44 శాతం అయితే, తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 8.18 శాతంగా నమోదైంది.
 • సిజిఎస్ ద్వారా 1,874, థర్మో పవర్ టెక్ ద్వారా 270, గ్యాస్ ద్వారా 31, సోలార్ ద్వారా 74 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత నిదానంగా నడుస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. భూపాలపల్లి పవర్ ప్లాంటు నిర్మాణం పూర్తి చేయడం ద్వారా 600,  జైపూర్ లో సింగరేణి పవర్ ప్లాంటు నిర్మాణం పూర్తి చేసి 1200 మెగావాట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చింది. థర్మల్ పవర్ టెక్ ద్వారా 570, సిజిఎస్ ద్వారా 663, జూరాల హైడ్రో స్టేషన్ నుంచి 240, పులిచింతల నుంచి 120, సోలార్ ద్వారా 3,416, విండ్ ద్వారా 101 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ వచ్చిన తర్వాత అదనంగా చేకూరింది.

 • 2014లో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, ఇపుడు వందశాతానికి పైగా పెరిగి 16,245 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది.( మొత్తం 8,567 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది, 109 శాతం పెరుగుదలశాతం)
 • యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం
 • 4 వేల మెగావాట్ల రికార్డు స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో జెన్ కో దామరచర్లలో యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు నిర్మిస్తున్నది. ఈ ప్లాంటు కొత్త రికార్డు సృష్టించబోతున్నది. నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఒక రాష్ట్రం తనకు తానుగా 4వేల మెగావాట్ల సామర్థ్యంతో అల్ట్రా మెగా పవర్ ప్లాంటు స్థాపించడం దేశంలోనే ఇది ప్రప్రథమం.

భద్రాద్రి పవర్ ప్లాంట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని ఏడూళ్ల బయ్యారం వద్ద 1,080 మెగావాట్ల (4 X 270) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో భద్రాద్రి థర్మల్ స్టేషన్ (బీటీపీఎస్) నిర్మిస్తున్నారు. ఈ స్టేషన్ ను మొత్తం రూ.7,857 కోట్లతో చేపడుతున్నారు. ముందుగా యూనిట్-1 బాయిలర్‌ను 25 మార్చి, 2019న వెలిగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక దానికి అవసరమైన మూడు వేల మెగావాట్ల విద్యుత్ ను ఇక్కడి నుంచే సరఫరా చేయనున్నారు.    

తొలి విద్యుత్ యూనిట్ సక్సెస్

బీటీపీఎస్‌ నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. అందులో తొలి యూనిట్‌ కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌ (సీవోడీ) విజయవంతంగా పూర్తయ్యింది. 2020 జూన్ 2 నుంచి 5వ తేదీ వరకు 72 గంటల్లో 271.61  మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. జెన్‌కో, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. బీటీపీఎస్‌, భెల్‌ అధికారులకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగతా 2, 3, 4 యూనిట్లలో కూడా సింక్రనైజేషన్‌ పూర్తిచేసి సీవోడీకి సిద్ధం చేస్తున్నారు.

రికార్డు సమయంలో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణం

కేటీపీఎస్ 7వ యూనిట్ నిర్మాణాన్ని కేవలం 42 నెలల్లోనే పూర్తిచేసి, 800 మెగావాట్లు అందుబాటులోకి తెచ్చింది. 2015 జనవరి 1న ఈ ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2018 జూన్ 30 నాటికి ప్లాంటు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన ప్రాజెక్టు ఇది.

మరో మూడేళ్లలో అదనంగా 12,677 మెగావాట్లు

తెలంగాణలో పెరిగే విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని 28వేలకు పైగా మెగావాట్లకు తీసుకుపోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కేంద్రప్రభుత్వంపై వత్తిడి తెచ్చి రామగుండం ఎన్.టి.పి.సి.లో 4000 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి ఆమోదం తీసుకుంది. ఇప్పటికే మొదటి దశలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. 4,000 మెగావాట్ల యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అన్ని అనుమతులు సాధించింది. త్వరలో నిర్మాణ పనులు పూర్తవుతాయి. ఛత్తీస్ గఢ్ నుంచి రెండో దశలో మరో 1000 మెగావాట్లు, సింగరేణి నుంచి మరో 800, సిజిఎస్ ద్వారా మరో 809, సోలార్ ద్వారా ఇంకో 1,584, హైడల్ ద్వారా ఇంకో 90 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. వీటన్నిటి ద్వారా వచ్చే మూడేళ్లలో మొత్తం 12,677 మెగావాట్లు అదనంగా వచ్చి చేరుతుంది. ఇప్పుడున్న కరెంటుతో కలుపుకొంటే మూడేళ్ల తర్వాత తెలంగాణలో 28వేలకు పైగా మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. అప్పుడు తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారి ఇతరులకు కరెంటు అందించే స్థితి వస్తుంది. దీనివల్ల విద్యుత్ సంస్థలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. అవసరం ఉన్న వర్గాలకు మరిన్ని రాయితీలు ఇచ్చుకునే వెసులుబాటు కలుగుతుంది.  

ఉత్పత్తితో పాటు సరఫరాలో మెరుగుదల

విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు సరఫరా వ్యవస్థను మెరుగు పర్చడంలో కూడా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎంతో ప్రగతి సాధించాయి. 99.90 శాతంతో తెలంగాణ ట్రాన్స్‌ మిషన్‌ లభ్యత.. దేశ సగటు 97 శాతాన్ని అధిగమించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరేండ్ల కాలంలో రూ.28,000 కోట్ల పెట్టుబడితో విద్యుత్‌ పంపిణీ, సరఫరా వ్యవస్థలను ప్రభుత్వం బలోపేతం చేసింది. సబ్ స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేపట్టింది. విద్యుత్‌ సరఫరా విషయంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది. నీతి ఆయోగ్‌ 2019-20 వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడించింది. తెలంగాణ చొరవతోనే పీజీసీఎల్‌ ఆధ్వర్యంలో కొత్త విద్యుత్‌ లైన్ల నిర్మాణం జరిగింది. 4,500 మెగావాట్ల సామర్థ్యంతో వార్ధా- డిచ్‌పల్లి మధ్య 580 కిలోమీటర్ల మేర లైన్‌ నిర్మించారు. వడోదరా-వరంగల్‌ మధ్య 400 కిలోమీటర్ల మేర డబుల్‌ సర్క్యూట్‌ లైన్‌ నిర్మాణంలో ఉన్నది. దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్‌ను ఇచ్చి పుచ్చుకోవడం ఈ లైన్ల ద్వారా సాధ్యమవుతుంది.

పవర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సామర్థ్యం 14,973 ఎంవీఏ నుండి 36,902 ఎంవీఏకు పెంచింది. ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థలో తెలంగాణది దేశంలోనే అగ్రస్థానం. రాష్ట్రం ఏర్పడేనాటికి.. 400కేవీ సబ్‌స్టేషన్లు 6 ఉంటే.. 2020 డిసెంబర్ నాటికి 15 ఉన్నాయి. 220కేవీ సబ్‌స్టేషన్లు 51 ఉంటే.. 2020 నాటికి 93 ఉన్నాయి. 33కేవీ సబ్‌స్టేషన్లు 2,178 ఉంటే.. 2020 నాటికి 3,088కి పెరిగాయి. 3,272గా ఉన్న పవర్‌ ట్రాన్స్‌ ఫార్మర్స్‌ 5,525కు చేరుకున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడంలో కీలకమైన డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ 4,61,000 నుండి 7,63,000కు పెరిగాయి. పెరుగుదల 3.02 లక్షలు కాగా, పెరిగిన శాతం 65.50 నమోదైంది. పవర్ ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం రూ. 31,778 కోట్లు ఖర్చు చేసింది.

సబ్ స్టేషన్లు :

2014 తెలంగాణ వచ్చే నాటికి   : 2,411

2021 నాటికి సబ్ స్టేషన్లు       : 3,436

పవర్ ట్రాన్స్ ఫార్మర్లు :

2014 తెలంగాణ వచ్చే నాటికి   : 3,272

2020లో పవర్ ట్రాన్స్ ఫార్మర్లు : 5,525

విద్యుత్ లైన్లు :

2014 తెలంగాణ వచ్చే నాటికి   : 1,67,995 కి.మీ.

2021 నాటికి మొత్తం లైన్లు     : 2,16,500 కి.మీ.

విద్యుత్తు రంగంలో ఏడేండ్లలో సాధించిన పురోగతి

 2 జూన్, 2014 నాటికి2021 నాటికి  
విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం  (మెగావాట్లలో)7,77816,245
గరిష్ట డిమాండ్5,66113,452 (27 ఫిబ్రవరి,2021)
గరిష్ట వినియోగం (మిలియన్ యూనిట్లలో)128 మి.యూనిట్లు255 మిలియన్ యూనిట్లలో
400 కె.వి. సబ్ స్టేషన్లు615
220 కె.వి. సబ్ స్టేషన్లు5193
132 కె.వి. సబ్ స్టేషన్లు176240
మొత్తం ఇ.హెచ్.టి. సబ్ స్టేషన్లు233354
ఇ.హెచ్.టి.లైన్ల పొడవు (CKM)16,37925,944
ట్రాన్స్ఫర్మేషన్ సామర్ధ్యం (MVA లో)14,05935,336
33 కె.వి.సబ్ స్టేషన్స్2,1783,088
మొత్తం డిస్కం లైన్ల పొడవు (కి.మీ.)4,38,0005,75,000
డి.టి.ఆర్.ల వైఫల్యం (శాతం)26.71 %6.61 %
వ్యవసాయ కనెక్షన్లు19,02,75425,29,000
మొత్తం కనెక్షన్లు1,11,19,9901,59,00,000

విద్యుత్ సరఫరాలో తెలంగాణ నెంబర్ వన్

విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ 31 డిసెంబర్ 2020న విడుదల చేసిన 2019-20 వార్షిక నివేదికలో వెల్లడించింది. తెలంగాణ చొరవతోనే పీజీసీఎల్ ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ లైన్లు వేశారు.

అన్నిరంగాలకు 24 గంటల కరెంటు సరఫరా

దేశంలో మరెక్కడా లేనివిధంగా  తెలంగాణ రాష్ట్రంలోని అన్నిరంగాలకు 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. దేశచరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రంలోని 25.29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు  24గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత కూడా తెలంగాణ రాష్ట్రం సాధించింది. వ్యవసాయం, ఇతర సబ్సిడీల కోసం ప్రభుత్వం 2020-21లో  ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తున్నది.

భారీగా పెరిగిన తలసరి విద్యుత్ వినియోగం

విశ్వవ్యాప్తంగా ప్రగతి సూచికలుగా (indicators) గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈ అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశ సగటును మించింది. దేశ వ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,208 యూనిట్లు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 2020 డిసెంబర్ నాటికి 2,071 యూనిట్లు. తెలంగాణ ఏర్పడే 2014 జూన్ నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లుంటే, 2020 డిసెంబర్ నాటికి 2,071 యూనిట్లకు పెరిగింది. ఆరున్నరేళ్లలో పెరుగుదల 715 యూనిట్లు ఉండగా, పెరిగిన శాతం  53 నమోదైంది.

వార్షిక వృద్ధి రేటు..

కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ గణాంకాల ప్రకారం తెలంగాణ 9.22శాతం వార్షిక వృద్ధిరేటు సాధించి, వెయ్యి మెగావాట్లకుపైగా విద్యుత్ వినియోగించే రాష్ట్రాలన్నింటిలో నంబర్ వన్ గా నిలిచింది.

తలసరి విద్యుత్ వినియోగంలో 11.34 శాతం వృద్ధి

ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా 11.34 శాతం వృద్ధిరేటు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 2016-17 సంవత్సరంలో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,551 యూనిట్లుంటే, 2017-18 సంవత్సరంలో 1,727 యూనిట్లకు చేరింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా తలసరి విద్యుత్ వినియోగం 2.4 శాతం మాత్రమే వృద్ధి సాధించడం విశేషం. 2016-17లో దేశ వ్యాప్తంగా తలసరి విద్యుత్ వినియోగం 1,122 యూనిట్లు కాగా, 2017-18లో 1,149 యూనిట్లు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5.23 శాతం, మహారాష్ట్ర 4.8 శాతం, హిమాచల్ ప్రదేశ్ 3.95శాతం, మధ్యప్రదేశ్ 3.13 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది.

దేశ సగటును మించిన తలసరి విద్యుత్ వినియోగం

విశ్వవ్యాప్తంగా ప్రగతిసూచికలుగా (indicators) గుర్తించేతలసరివిద్యుత్ వినియోగం అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశసగటును మించింది. 2021 నాటికి దేశసగటు 1,208 యూనిట్లు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 2,071 యూనిట్లు ఉంది.

ఏడేండ్లలో 53 శాతం వృద్ధి

తెలంగాణ  ఏర్పడే నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు ఉంటే, 2021 నాటికి 2,071 యూనిట్లకు పెరిగింది. ఏడేండ్లలో 53 శాతం వృద్ధి చెందింది.        

తలసరి వినియోగం (kWh)

 2014-152015-162016-172017-182018-192019-20 
తెలంగాణ135614391551172718962071 
ఏ.పి.104012301319138814801507 
ఇండియా101010751122114911811208 

ఎలాంటి కోతలు లేని విద్యుత్ సరఫరా

ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంవల్ల వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం బాగాపెరిగింది. పరిశ్రమలు 3 షిఫ్టులు పనిచేస్తున్నాయి. దీంతో తెలంగాణలో విద్యుత్ వినియోగం దేశంలో మరే రాష్ట్రంలో పెరగని విధంగా పెరిగింది.

తెలంగాణ ఘనత

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లనే తెలంగాణ ఈ ఘనతను సాధించగలిగింది. ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్ల వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. పరిశ్రమలు 3 షిఫ్టులు పనిచేస్తున్నాయి. వీటన్నింటి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం దేశంలో మరే రాష్ట్రంలో పెరగని విధంగా పెరిగింది.

విద్యుత్ ఇండెక్స్ లో అగ్రస్థానం

విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నిర్వహణ, పొదుపు లక్ష్యాల సాధనలో తెలంగాణ విద్యుత్ సంస్థలు  అగ్రస్థానంలో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం 12 జనవరి 2020న ప్రకటించిన ఎనర్జీ ఎఫీషియెన్సీ ఇండెక్స్ ర్యాంకుల్లో తెలంగాణ కు అగ్రస్థానం దక్కింది.

విద్యుత్ రంగంలో తెలంగాణ నంబర్ వన్… (12 జనవరి 2020)

– విద్యుత్ సరఫరాతోపాటు, వినియోగంలోనూ దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలిచింది.

– విద్యుత్ ఉత్పత్తి, నిరంతర సరఫరా, పొదుపు లక్ష్యాల సాధనలో తెలంగాణ సత్తా చాటింది.

– విద్యుత్ విధానాల రూపకల్పన, అమలులో ముందున్న తెలంగాణ

– వీధి దీపాల నిర్వహణ (డ్యాష్ బోర్డు)పై దేశవ్యాప్తంగా ప్రశంసలు

– రాష్ట్రంలో చీకటి రోజులు పోయి, పవర్ హాలిడేలు పోయి, పవర్ ఫుల్ రోజులు వచ్చాయి.

– తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిఏటా రూ.178 కోట్లకు పైగా ఆదా అవుతున్నది.

– విద్యుత్ పంపిణీ, నిర్వహణలో సమర్థంగా వ్యవహరిస్తున్న రాష్ట్రంగా కేంద్రం తెలంగాణకు ర్యాంకులు ప్రకటించింది.

– ఎనర్జీ ఎఫీషియెన్సీ ఇండెక్స్ లో తెలంగాణ రాష్ట్రానికి అగ్రస్థానం..

ఆదా వివరాలు :

మున్సిపాలిటీల్లో ఎల్ఈడీలు        4.47 లక్షలు

ఎల్ఈడీలకు విద్యుత్ వినియోగం  476 లక్షల కిలోవాట్ హవర్

సాధారణ లైట్ల విద్యుత్ వినియోగం 1243 లక్షల కిలోవాట్ హవర్

ఆదా అవుతున్న విద్యుత్           766.70 లక్షల కిలోవాట్ హవర్ (62శాతం)

ఏడాదికయ్యే విద్యుత్ చార్జీలు       రూ.87.04 కోట్లు

ఎల్ఈడీల వల్ల అయ్యే విద్యుత్ చార్జీలు    రూ.33.37 కోట్లు

ఏడాదికి ఆదా అవుతున్న విద్యుత్ చార్జీలు        రూ.53.67 కోట్లు

……………………………………………………………………………

జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్ఈడీలు         4.10 లక్షలు

ఆదా అవుతున్న విద్యుత్                   55శాతం

విద్యుత్ బిల్లుల్లో ఆదా                       రూ.125 కోట్లు

…………………………………………………………………………

మున్సిపాలిటీల్లో విద్యుత్ ఆదా              రూ.53.67 కోట్లు

జీహెచ్ఎంసీ పరిధిలో ఆదా                  రూ.125 కోట్లు

మొత్తం ఏడాదికవుతున్న ఆదా             రూ.178.67 కోట్లు

……………………………………………………………………….

తెలంగాణ స్ట్రీట్ లైటింగ్ డ్యాష్ బోర్డుపై కేంద్రం ప్రశంసలు

తెలంగాణ స్ట్రీట్ లైటింగ్ డ్యాష్ బోర్డుపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. మున్సిపాలిటీల్లో వీధిదీపాలు వెలిగి ఉన్నాయా? ఆఫ్ చేసి ఉన్నాయా అని ఈ బోర్డు నుంచి తెలుసుకోవచ్చు. అన్ని మున్సిపాలిటీల సమాచారం, రియల్ టైం డాటాతోపాటు, ఏ మున్సిపాలిటీలో ఎంత విద్యుత్ ఆదా అవుతున్నదనే వివరాలను నిరంతరం అందిస్తుండటంతో విద్యుత్ దుబారాను అరికట్టడం సాధ్యమైంది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న కరెంటు చార్జీల్లో తెలంగాణ స్థానం-

కేటగిరి                    యూనిట్ ధర                      స్థానం

0-50 యూనిట్లు         రూ. 1.45         మొదటి స్థానం (ఎపి కూడా)

51-100                            రూ.2.60             మొదటి స్థానం(ఎపి కూడా)

101-200                          రూ.4.30            నాల్గవ స్థానం. 1ఉత్తరాంచల్(3.55)           

                                                              2.ఎపి (3.60) 3. గుజరాత్ (3.75)

గరిష్ట డిమాండ్  

విద్యుత్తు గరిష్ట డిమాండ్ వృద్ధి రేటులోనూ తెలంగాణ రాష్ట్రం గణనీయమైన వృద్ధి శాతం నమోదు చేసింది. 2016-17లో తెలంగాణలో 9,187 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా, 2017-18 సంవత్సరంలో 10,284 మెగావాట్లకు చేరింది. అలాగే, 2018-19లో తెలంగాణలో 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా, 2019-20 సంవత్సరంలో 11,703 మెగావాట్లకు చేరింది. 27 ఫిబ్రవరి, 2021న ఎన్నడూలేని విధంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కూడా లేనంతగా తెలంగాణలో 13,452 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది.

23 జిల్లాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 23 మార్చి, 2014న 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఎస్.పి.డి.సి.ఎల్, ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలోని తెలంగాణ ప్రాంతంలో 5,661 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉండేది. 2014 పరిస్థితితో పోల్చుకుంటే 7,507 మెగావాట్ల పెరుగుదల ఉండగా, పెరుగుదల శాతం 133 నమోదైంది.

విద్యుత్తు వినియోగంలో కొత్త రికార్డు

తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ తో పాటు విద్యుత్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతున్నది. 2014లో తెలంగాణలో 39,866 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, 2018-19లో 68,147 మిలియన్ యూనిట్ల వినియోగం, 2019-20లో 68,674 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఆరున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో పెరుగుదల 28,808 మిలియన్ యూనిట్లు ఉండగా, పెరిగిన శాతం 72 నమోదైంది.

వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం కలిగిన రాష్ట్రాల్లో వృద్ధిరేటు

క్రమ సంఖ్యరాష్ట్రం పేరు/ యూటి/  2016-172017-18  శాతం
1ఛండీగఢ్11281004-10.99
2ఢిల్లీ15741564-0.63
3హర్యానా197519900.75
4హిమాచల్ ప్రదేశ్134013933.95
5జమ్ము & కాశ్మీర్128212840.15
6పంజాబ్202820491.03
7రాజస్థాన్116611781.02
8ఉత్తరాఖండ్14541450-0.27
9ఛత్తీస్ గఢ్20162003-0.64
10గుజరాత్227923211.84
11మహారాష్ట్ర130713714.89
12డామన్ & డయ్యూ79657902-0.79
13దాద్రానగర్ హవేలి1578315218-3.57
14గోవా24662229-9.80
15ఆంధ్రప్రదేశ్131913885.23
16తెలంగాణ1551189611.34
17కర్ణాటక13671356-0.81
18తమిళనాడు18471834-0.70
19పుదుచ్చేరి17841749-1.96
20ఒడిషా16221593-1.78

రాష్ట్రాల వారీగా తలసరి విద్యుత్ వినియోగం

క్రమ సంఖ్యరాష్ట్రం పేరు/ యూటి/   తలసరి విద్యుత్ వినియోగం (యూనిట్లలో)
1 దాద్రానగర్ హవేలి15,517
2డయ్యూ & డామన్7,561
3గోవా2,396
4గుజరాత్2.388
5హర్యానా2,229
6పంజాబ్2,171
7తెలంగాణ2,071
8ఛత్తీస్ గఢ్2,044
9తమిళనాడు1.844
10పాండిచ్చేరి1,752
11ఢిల్లీ1,572
12ఒడిషా1,559
13ఉత్తరాఖండ్1,528
14హిమాచల్ ప్రదేశ్1,527
15ఆంధ్రప్రదేశ్1,507
16కర్ణాటక1,468
17మహారాష్ట్ర1,418
18జమ్ము, కాశ్మీర్1,384
19రాజస్థాన్1,317
20మధ్య ప్రదేశ్1,089
21సిక్కిం929
22మేఘాలయ851
23జార్ఖండ్853
24కేరళ826
25పశ్చిమ బెంగాల్757
26అరుణాచల్ ప్రదేశ్631
27మిజోరాం629
28ఉత్తర ప్రదేశ్629
29అండమాన్ నికోబార్ దీవులు585
30లక్షద్వీప్551
31త్రిపుర425
32మణిపూర్385
33నాగాలాండ్367
34అస్సాం348
35బిహార్332
36ఛండీగఢ్986
 భారతదేశ సగటు తలసరి వాడకం1,208

రాష్ట్రాల వారీగా విద్యుత్ వినియోగం వృద్ధి రేటు

1.తెలంగాణ53,01760,23713.62
2.తమిళనాడు1,04,4881,05,8391.29
3.ఉత్తర్ ప్రదేశ్1,05,7001,18,30311.92
4.రాజస్థాన్67,41770,6024.72
5.గుజరాత్1,03,7031.09,9736.05
5.మధ్యప్రదేశ్65,75969,9266.34
6.మహారాష్ట్ర1,39,2291,49,5317.40
7.కర్ణాటక66,53867,7021.75

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు

వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్లు ఇచ్చే విషయంలో కూడ తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వ్యవసాయ కనెక్షన్ల మంజూరు విషయంలో నియంత్రణ ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ నియంత్రణను తొలగించారు. తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో మొత్తం 19,02,754 కనెక్షన్లు మాత్రమే వుండేది. తెలంగాణ ఏర్పడిన ఆరున్నరేళ్లలో 6.26 లక్షల కొత్తగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 25.29 లక్షలకు చేరింది. ఈ కనెక్షన్లు ఇవ్వడానికే డిస్కంలు రూ.1,498 కోట్లకు పైగా వెచ్చించాయి. తెలంగాణలో 2014 జూన్ వరకు 2వేల మెగావాట్లకు మించి వ్యవసాయ డిమాండ్ రాకపోయేది. 2020 డిసెంబర్ నాటికి  రాష్ట్రంలో ఎత్తిపోతలతో కలిపి వ్యవసాయానికి 6 వేల మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది.

నీటిపారుదల రంగాలకు రికార్డు స్థాయి డిమాండ్ : 2014లో ఎత్తిపోతల పథకాలకు కేవలం 680 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భారీ నీటి పారుదల ప్రాజెక్టుల ఫలితంగా పంపుహౌజుల నిర్వహణకు ప్రస్తుతం 2200 మెగావాట్ల వరకు విద్యుత్తు అవసరం అవుతున్నది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నది.

రాష్ట్రంలో మొత్తం విద్యుత్ కనెక్షన్లు : తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మొత్తం విద్యుత్  కనెక్షన్లు 1,11,19,990 ఉంటే, 2020 డిసెంబర్ నాటికి 1,59,00,000 కనెక్షన్లు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన నాటితో పోలిస్తే 48 లక్షల కనెక్షన్లు పెరగగా, 43శాతం పెరిగాయి. వీటికి 24 గంటలపాటు నిరంతర విద్యుత్‌ సరఫరాకు వీలుగా 112 ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లు, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 833తోపాటు 2.54 లక్షల విద్యుత్‌ ట్రాన్స్ ఫార్మర్లను అదనంగా ఏర్పాటు చేశారు.

అన్ని గ్రామాలు, పట్టణాల్లోని కుటుంబాలకు 100 శాతం విద్యుత్ కనెక్షన్లు

పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సౌభాగ్య (సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన) పథకం ద్వారా దేశంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని పేద, దిగువ మధ్యతరగతి ఇండ్లలో వంద శాతం విద్యుత్ కనెక్షన్లు అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సౌభాగ్య పథకం ప్రారంభమయిన 10 అక్టోబర్, 2017 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 65,36,671 కుటుంబాలున్నాయి. వీటిలో అప్పటివరకు 60, 84,656 కుటుంబాలకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 4,52,015 కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు లేవు. ఇవీగాక వంద శాతం విద్యుదీకరణ పూర్తయ్యే సమయానికి అదనంగా 24,844 కుటుంబాలు చేరాయి. ఈ పథకం కింద మొత్తం 4,76,859 కుటుంబాలు విద్యుత్ కనెక్షన్లు పొందాయి. వాస్తవంగా వంద శాతం విద్యుదీకరణను మార్చి 31, 2019లోపు పూర్తి చేయాల్సి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఫిబ్రవరి 1, 2019 నాటికే వందశాతం విద్యుత్ కనెక్షన్ల లక్ష్యాన్ని చేరుకుంది. కరంట్ సరఫరాపై సీఎం కేసీఆర్ శ్రద్ధ తీసుకోవటం, ప్రతి ఇంటికీ కరెంటు కనెక్షన్ ఇచ్చేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి.

రాష్ట్రంలో విద్యుదీకరణ 100శాతం.. దేశంలోనే నంబర్ వన్ (20 నవంబర్ 2020)

విద్యుత్ ఉత్పత్తి, సామర్థ్యం పెంపు, సరఫరా, నిర్వహణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) సంస్థ సర్వేలో వెల్లడైంది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ ప్రతి ఇంటికీ కరంటు అందిస్తూ, 100శాతం విద్యుదీకరణ పూర్తి చేసుకోవడమేగాక, సరఫరాలోనూ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో మధ్యప్రదేశ్ (96.9శాతం), మూడోస్థానంలో కర్ణాటక (96.3శాతం), నాలుగోస్థానంలో రాజస్థాన్ (96శాతం), ఐదోస్థానంలో ఉత్తరప్రదేశ్ (93.2శాతం) నిలిచాయి. ఈ సంస్థ సర్వేలో భాగంగా 21 రాష్ట్రాల్లోని 1210 గ్రామాలకు చెందిన 15వేల కుటుంబాలను ప్రశ్నించారు. తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోని 500 ఇండ్లలో సర్వే నిర్వహించారు.

పేదలకు విద్యుత్ సబ్సిడీలు

విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి రాష్ట్రంలోని నిరుపేదలకు ఎక్కువ లాభం చేకూర్చాలని ప్రభుత్వం భావించింది. అందుకే రైతులు, పేదలకు అనేక రాయితీలు ఇస్తున్నది. తెలంగాణలో 25.29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ కోసం ప్రతీ ఏటా రూ.4,687 కోట్లు ప్రభుత్వం రాయితీ ఇస్తున్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సబ్సిడీల కోసం 2019-20 (సెప్టెంబర్) బడ్జెట్లో రూ.8,000 కోట్లు ప్రతిపాధించారు. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి 2019 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కోసం విద్యుత్ సంస్థలకు మొత్తం రూ.20,925 కోట్లు చెల్లించింది.

గృహాలకు సబ్సిడీ కరెంటు:

–     రాష్ట్రంలో గృహ వినియోగదారులు  : 1,15,82,598

–     వంద యూనిట్ల లోపు వాడే వారు  : 61 లక్షలు

–     0-50 యూనిట్ల వరకు యూనిట్ ధర : రూ.1.45 పైసలు

–     50-100 యూనిట్ల వరకు యూనిట్ ధర: రూ.2.60 పైసలు

–     గృహ విద్యుత్ సబ్సిడీలపై ప్రభుత్వం ఏడాదికి పెడుతున్న ఖర్చు: రూ.1,253 కోట్లు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న కరెంటు చార్జీల్లో తెలంగాణ స్థానం
0-50 యూనిట్లురూ. 1.45మొదటి స్థానం (ఎపి కూడా)  
51-100రూ.2.60మొదటి స్థానం(ఎపి కూడా)  
101-200రూ.4.30నాల్గవ స్థానం –  1.ఉత్తరాంచల్ (3.55) -2.ఎపి(3.60) – 3.గుజరాత్(3.75)
 • హైదరాబాద్ నగరంలోని సెలూన్లు, దోభీఘాట్లు, లాండ్రీలకు ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నది.
 • రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల ఇండ్లకు ప్రభుత్వం 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది. ఇందులో 12,02,806 మంది ఎస్సీల ఇండ్లకు 21,034 కోట్లు ఖర్చు చేసింది.
 • వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా

వ్యవసాయ సాగుకు తగినంత నీరు బోరు లేదా బావుల ద్వారా అందుబాటులో ఉన్నప్పటికీ నిరంతర కరెంటు కోతల వల్ల వ్యవసాయాన్ని సాగు చేసుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన సమస్య విద్యుత్తే కనుక ప్రభుత్వం వ్యవసాయానికి 2018 జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల కరెంటు అందిస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం 25.29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్రను లిఖించింది.

  రాష్ట్రంలోని 30 శాతం కరెంటు ఉచిత విద్యుత్ కోసమే వినియోగిస్తున్నారు. సమైక్య పాలనలో కనీసం 1500 మెగావాట్లు కూడా వ్యవసాయానికి ఇవ్వలేదు. కానీ నేడు దాదాపు 3500 మోగావాట్ల కరెంటు వ్యవసాయానికి వినియోగం అవుతున్నది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కోసం చేసిన కేటాయింపులు 3,621 కోట్లు. తెలంగాణ వాటా 1,521 కోట్లు. కానీ నేడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడానికి కేటాయించిన బడ్జెట్ 4,687 కోట్లు. ట్రాన్స్ ఫార్మర్లు పాడయితే 24 గంటల్లోనే రిప్లేస్ మెంట్ చేస్తున్నారు. డి.ఇ. కార్యాలయంలో స్టాక్ పెడుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం

నగరంలో ఎన్నడూలేని విధంగా మే 29, 2019న రికార్డుస్థాయిలో 3391 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. గతేడాది 2018 మే నెల 30వ తేదీన 2958 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఏర్పడింది. గ్రేటర్ పరిధిలో సాధారణ రోజుల్లో 1800 మెగావాట్ల నుంచి 2200 మెగావాట్ల మధ్య డిమాండ్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2261 మెగావాట్ల డిమాండ్ ఉండేది. ప్రస్తుత డిమాండ్‌తో పోల్చితే.. గ్రేటర్‌లో 48.98% అదనంగా డిమాండ్ పెరిగింది.

గ్రేటర్ హైదరాబాద్‌లో తొమ్మిది సర్కిళ్లు, 22 డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 54.61 లక్షల విద్యుత్ కనెక్షన్లుండగా, ఇందులో 44.60 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు, 6.95 లక్షల కమర్షియల్, 41807 పారిశ్రామిక, 7321 హెచ్‌టీ కనెక్షన్లు ఉన్నాయి. మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను అధికంగా వినియోగిస్తుండడంతో వినియోగం భారీగా పెరుగుతున్నది.

డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా : గ్రేటర్ పరిధిలో మండే ఎండలకు విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా.. సరఫరాలో ఏమాత్రం అంతరాయం లేకుండా టీఎస్‌ఎస్పీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లుచేశారు. కేవలం గృహ అవసరాలకే కాకుండా పరిశ్రమలకు సైతం నిరాటంకంగా విద్యుత్ సరఫరాచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈస్థాయిలో డిమాండ్ లేకపోయినప్పటికీ.. గృహ అవసరాలకు విద్యుత్ ఇస్తే.. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించేవారు. పరిశ్రమలకు ఇస్తే.. గంటల తరబడి ఇండ్లకు కోతలు పెట్టేవారు. కానీ ప్రస్తుతం ఎంత డిమాండ్ వస్తున్నప్పటికీ.. ఏ మాత్రం అంతరాయం లేకుండా విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తుండడం విశేషం. 3500 మెగావాట్ల డిమాండ్‌ను సైతం అందుకునేలా డీటీఆర్‌లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని విద్యుత్ శాఖ అధికారులు పెంచారు.

– దేశవ్యాప్తంగా విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ 422.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొని  4వ స్థానంలో నిలిచింది. తొలి మూడు స్థానాల్లో బిహార్ (774 మి.యూ), పశ్చిమ బంగ (544.26 మి.యూ), ఛత్తీస్ గఢ్ (454.49 మి.యూ) ఉన్నాయి.

సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం

బొగ్గు ద్వారా థర్మల్, నీళ్ల ద్వారా హైడల్ విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటి దాకా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. భవిష్యత్ లో బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉండడం, నీళ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో సంప్రదాయేతర ఇంధన వనరులను గుర్తించి, వాటిని వాడుకునే విధానం ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్రం కూడా సంప్రదాయేతర ఇంధన వనరులను ఎక్కువగా ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్నటికీ తరగని సౌరశక్తి, గాలి శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నది.

ఐదు వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో సోలార్ ప్లాంట్లు

2014 జూన్ 2 నాటికి రాష్ట్రంలో కేవలం 74 మెగావాట్ సోలార్ విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త విధానం రూపొందించింది. ఉత్పత్తి, సరఫరాలో వికేంద్రీకరణ విధానం అవలంభిస్తున్నది. సబ్ స్టేషన్ల వారీగా లోడ్ ను గుర్తించి, ఎక్కడికక్కడ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిచ్చింది. స్థానిక సబ్ స్టేషన్లతో సోలార్ ప్లాంట్లను అనుసంధానం చేసింది. దీనివల్ల గ్రిడ్ పై ప్రభావం ఉండదు.  ఈ పాలసీ ద్వారా 5 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం ప్రణాళికలు రూపొందించింది. 2020 నాటికి 3,670 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి, 13.62 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది తెలంగాణ.  11.92 శాతం వృద్ధిరేటుతో ఉత్తర ప్రదేశ్ రెండోస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 7.43 శాతం వృద్ధిరేటు సాధించింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరుగుదల 3,596 మెగావాట్లు ఉండగా, పెరిగిన శాతం 4,859 నమోదైంది.

సింగరేణిలో సౌర విద్యుత్ ఉత్పత్తి : థర్మల్ విద్యుత్ కే పరిమితమైన సింగరేణి సంస్థ తొలిసారిగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. మంచిర్యాల జిల్లా సింగరేణి పవర్ ప్లాంటులో తొలిదశలో పూర్తయిన 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటును 10 జనవరి 2020న 33 కేవీ లైను గ్రిడ్ తో అనుసంధానం (సింక్రనైజ్) చేశారు. దీంతో థర్మల్, సౌర విద్యత్ ఉత్పాదన రంగంలోకి అడుగుపెట్టిన తొలి బొగ్గు కంపెనీగా 130 ఏండ్ల చరిత్ర ఉన్న సింగరేణి రికార్డు సృష్టించింది. 2020 ఆగస్టు నాటికి అన్ని సింగరేణి ప్లాంట్ల ద్వారా 220 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుంది.

సింగరేణి సంస్థ నుంచి మరో 5 మెగావాట్ల సోలార్ పవర్ (5+5=10 మెగావాట్లు)

 సింగరేణి సంస్థ నుంచి మరో ఐదు మెగావాట్ల సోలార్‌ పవర్‌ (సౌర విద్యుత్‌) అందుబాటులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో నిర్మించిన ఐదు మెగావాట్ల సోలార్‌ పవర్‌ప్లాంట్‌.. 10 ఫిబ్రవరి 2020న విద్యుత్‌ ఉత్పాదన ప్రారంభించింది. ఇక్కడ ఉత్పత్తయిన విద్యుత్‌ను శ్రీరాంపూర్‌ ఏరియా 33 కేవీలైనుకు అనుసంధానంచేశారు. గత నెల పదో తేదీన ఇదే కేంద్రం నుంచి తొలుత ఐదు మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తిచేసి, 33కేవీ లైనుగ్రిడ్‌కు అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేంద్రం నుంచి మొత్తం 10 మెగావాట్ల సోలార్‌ పవర్‌ అందుబాటులోకి వచ్చినట్టయ్యింది.

సోలార్ ద్వారా నీటిని పంపింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో సోలార్ ద్వారా ఒకేసారి ఆరుయూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి చరిత్ర  సృష్టించింది. 17 ఏండ్లలో ఎన్నడూలేని విధంగా సోలార్ ద్వారా నీటిని పంపింగ్‌చేసి విద్యుదుత్పత్తి చేశారు. సోలార్‌గ్రిడ్ నుంచి 0.991 మెగా యూనిట్ల ద్వారా 1488 క్యూసెక్కుల నీటిని (0.129టీఎంసీలు)పైకి పంపింగ్‌ చేసి విద్యుత్ ఉత్పత్తి చేశారు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఇలా చేయడం తొలిసారి. 

సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మూడోస్థానం

తెలంగాణ ఏర్పాటైన 2014 జూన్ 2 నాటికి రాష్ట్రంలో కేవలం 74 మెగావాట్ సోలార్ విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త విధానం రూపొందించింది. ఉత్పత్తి, సరఫరాలో వికేంద్రీకరణ విధానం అవలంభిస్తున్నది.  2020 ఆగస్టు నాటికి 3,650 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసిన తెలంగాణ, దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది.

విండ్ పవర్ కోసం పాలసీ

పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థలు సరికొత్త పాలసీని రూపొందిస్తున్నాయి. 2014లో పవన విద్యుత్ ఉత్పత్తి జరగలేదు. 2020 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 100.8 మెగావాట్ల  పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది.   

ప్రభుత్వరంగ సంస్థల ద్వారానే ఉత్పత్తి

జెన్ కో ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి జరగాలనే కీలక నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భెల్ ఆధ్వర్యంలో ప్లాంట్ల నిర్మాణం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నది. విద్యుత్ కు సంబంధించిన పనులన్నీ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ప్రైవేటు సంస్థల నుంచి ఎంత వత్తిడీ వచ్చినా ప్రభుత్వం తలొగ్గలేదు. విద్యుత్ సంస్థలు బాగుపడితే అంతిమంగా ప్రజలకే మేలు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ భావన. ఉత్పత్తి, సరఫరా, కొనుగోళ్లు… అన్ని దశలలో పూర్తి పారదర్శకత సాధించడం ప్రభుత్వ లక్ష్యం.

ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం రికార్డుస్థాయి ఏర్పాట్లు

గతంలో ఎన్నడూలేనివిధంగా తెలంగాణ ట్రాన్స్ కో తన సంస్థలో మొదటిసారిగా లిఫ్టు ఇరిగేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నది. డైరెక్టర్, ఇద్దరు సీఈలతోపాటు అవసరమైన సిబ్బందిని నియమించి, లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంటు ఇచ్చే పనులను పర్యవేక్షిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాణహిత – చేవెళ్లలాంటి భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినప్పటికీ.. అప్పుడు విద్యుత్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. లిఫ్టు ఇరిగేషన్ పథకాలకు కరెంటు ఇవ్వడానికి  ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం అన్నీ ముందుగానే ప్రణాళిక వేసుకున్నది. మొత్తం లిఫ్టులకు 9వేల మెగావాట్ల విద్యుత్  కావాలని నిర్ణయించింది. దీన్ని జెన్ కో నుంచి సమకూర్చుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 400 కేవీ సబ్ స్టేషన్లు పది, 220 కేవీ సబ్ స్టేషన్లు ఇరవై నాలుగు, 132 కేవీ సబ్ స్టేషన్లు 25, వీటికి ప్రత్యేకంగా లైన్లు కావాలని అంచనా వేసింది.  దీనికి మొత్తం రూ.6 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టి, ఈ వ్యయాన్ని నీటిపారుదల శాఖ ద్వారా చేస్తున్నది. నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు ట్రాన్స్ కో చూస్తున్నది.

ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతీ ఏటా వాటి నిర్వహణకు రూ.10 వేల కోట్ల కరెంటు బిల్లు వస్తుందని అంచనా వేశారు. లిఫ్టులకు అయ్యే కరెంటు బిల్లును నీటిపారుదల శాఖ ద్వారా చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ లిఫ్టుల కోసం అత్యధిక సామర్థ్యం కలిగిన మోటార్లు వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గరిష్టంగా 139 మెగావాట్ల ఇంజన్లు వాడుతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎక్కడా ఇంతటి సామర్థ్యం కలిగిన ఇంజన్లు వాడడం లేదు. వీటిని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేయడం కోసం అధికారుల బృందం ఆస్ట్రియా వెళ్లి వచ్చింది. మోటార్లు, పంపుల తయారీపై అక్కడి నిపుణులతో మాట్లాడి వచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బి.హెచ్.ఇ.ఎల్.కు మోటార్ల తయారీ బాధ్యత అప్పగించారు. దేశంలోనే భెల్ కు చెందిన భోపాల్ లోని అతిపెద్ద కర్మాగారంలో భారీ మోటార్లు తయారవుతున్నాయి. వచ్చే ఏడాది మేడిగడ్డ పంప్ హౌజ్ నుంచి నీళ్లను లిఫ్టు చేయడానికి మోటార్లు అందుబాటులోకి వస్తాయి.

ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో గరిష్టంగా 30 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లను కల్వకుర్తి లిఫ్టుల కోసం వాడుతున్నారు. కానీ కాళేశ్వరం నుంచి రోజుకు రెండు టిఎంసిల నీటిని ఎత్తిపోయాలనే లక్ష్యం పెట్టుకున్నందున 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లు వాడుతున్నారు. రామగుడు దగ్గర 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్ 120 మీటర్ల ఎత్తులో 3200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. చంద్లాపూర్ వద్ద 134, మేడారం వద్ద 124, తిప్పాపూర్ వద్ద 106 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లు కూడా మూడు వేలకు పైగా క్యూసెక్కుల సామర్థ్యంతో 100 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేస్తాయి. ఈ పంపుల నిర్మాణం జరుగుతున్నది. పూర్తయ్యాక మోటార్లను బిగిస్తారు. 

లిఫ్టులకు, పంపుసెట్లకు అత్యధిక విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ

తెలంగాణ ఏర్పడేనాటికి దేవాదుల, ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్టుతోపాటు మరికొన్ని చిన్న లిఫ్టులకు కలిపి 400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే వాడేవారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్ సాగర్, బీమా, ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు తదితర లిఫ్టు ఇరిగేషన్ స్కీములు ప్రారంభమయ్యాయి. దీనికి కావాల్సిన విద్యుత్ ను ట్రాన్స్ కో సమకూర్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని లిఫ్టులకు కలిపి 1263 మెగావాట్ల విద్యుత్ ను వినియోగిస్తున్నారు. రాబోయే కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు 4,600, పాలమూరు ప్రాజెక్టుకు 4,000, సీతారామ ప్రాజెక్టుకు 690 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇతర జిల్లాల్లో మరికొన్ని చిన్న లిఫ్టులకు కూడా విద్యుత్ అవసరం ఉంది. ఇవన్నీ కలిపితే 12,000 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. రైతులకు వచ్చే రబీ నుంచి 24 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి  7,000 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేశారు. అప్పటికి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా 27వేలకు పైగా ఉంటుంది కాబట్టి, లిఫ్టులకు కావాల్సిన విద్యుత్ సరఫరా చేయడం సాధ్యమవుతుంది. అటు లిఫ్టులకు, ఇటు పంపుసెట్లకు ఎక్కువ ఖర్చుచేసి, అత్యధిక విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టిస్తుంది.

తెలంగాణ చొరవతో ఉత్తర, దక్షిణ గ్రిడ్ ల మధ్య కొత్త లైన్లు

తెలంగాణ ప్రభుత్వం చొరవతో ఉత్తర, దక్షిణగ్రిడ్ల మధ్య పి.జి.సి.ఐ.ఎల్. ఆధ్వరర్యంలో కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం. 4500 మెగావాట్ల సామర్థ్యంతో వార్థా – డిచ్ పల్లి మధ్య 580 కిలోమీటర్ల మేర 765 కె.వి. డబుల్ సర్క్యూట్ విద్యుత్ లైన్ నిర్మాణం జరిగింది. వరోరా-వరంగల్ మధ్య 400 కిలోమీటర్ల మేర మరో లైను మంజూరైంది. దేశంలో ఎక్కడినుంచైనా విద్యుత్ ను ఇచ్చిపుచ్చుకునే సౌలభ్యం ఈ లైన్ల వల్ల కలుగుతుంది. చత్తీస్ గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఈ లైన్ల నిర్మాణం జరిపే విధంగా పిజిసిఐఎల్ ను తెలంగాణ ఒప్పించి, వేగంగా నిర్మాణం చేయించగలిగింది.

ఉదయ్ పథకంలో చేరిన తెలంగాణ రాష్ట్రం

విద్యుత్ రంగంలో మరింత ప్రగతి సాధించడం కోసం, డిస్కమ్ లను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం మరొక ముందడుగు వేస్తున్నది. ఉదయ్ పథకంలో చేరేందుకు జనవరి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నది. గత ప్రభుత్వాల లోపభూయిష్ట విధానాల ఫలితంగా రెండు డిస్కమ్ లు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.  ఉదయ్ పథకంలో చేరడం ద్వారా డిస్కమ్ లకున్న రూ.9,695 కోట్ల రూపాయల రుణ భారాన్ని ప్రభుత్వమే చెల్లించింది. దీంతో డిస్కమ్ లకు రుణభారం నుంచి విముక్తి కలుగుతుంది. అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే తీర్చడం వల్ల డిస్కమ్ లు ప్రతీ ఏటా 890 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. వీటిని ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2017-18 బడ్జెట్లో డిస్కంల వడ్డీ చెల్పింపునకై రూ.890 కోట్లు కేటాయించింది. డిస్కమ్ లు తిరిగి కొత్తగా అప్పు పొందేందుకు అవకాశం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డిస్కమ్ లకు 5,940 కోట్ల రూపాయలను అందిస్తున్నది. ఈ నిర్ణయాల వల్ల వినియోగదారులకు ఎంతో మేలు కలుగుతుంది.

బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం

తెలంగాణలో విద్యుత్ సరఫరా మెరుగైంది, నిరంతరాయ విద్యుత్ అందుతున్నది అనే ప్రశంస నిజానికి చాలా పరిమితమైన అవగాహనలోంచి వచ్చిన వ్యాక్యానం. నిజానికి అంతకుమించిన విజయాలెన్నో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు సాధించాయి. భవిష్యత్తులో మరిన్ని అబ్బుర పరిచే విజయాలకు బాటలు వేసుకున్నయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యానికి అనుగుణంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రగతికి బాసటగా విద్యుత్ రంగం నిలుస్తున్నది. పారిశ్రామిక ప్రగతికి కొత్తగా తీసుకొచ్చిన టిఎస్ – ఐపాస్ చట్టం విజయవంతమై, పరిశ్రమలు తెలంగాణకు తరలిరావడంలో పవర్ హాలిడేలు ఎత్తేసి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడం ముఖ్యమైన కారణం.

రికార్డు స్థాయి పంటల దిగుబడిలో ఉచిత విద్యుత్ పాత్ర కీలకం

రికార్డు స్థాయిలో పంటలు పండడంలో, భూగర్భంలోని జలాలను బయటకు రప్పించిన 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ పాత్ర కీలకంగా ఉంది. పాలీ హౌజ్ కల్టివేషన్, గ్రీన్ హౌజ్ కల్టివేషన్, మైక్రో ఇరిగేషన్ పెద్ద ఎత్తున విస్తరించడం వెనుక విద్యుత్ విజయం దాగి ఉంది. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పన వెనుక..  దాని నిర్వహణకు అవసరమైన 11వేల మెగావాట్ల విద్యుత్ ను జెన్ కో అందించగలుతుందనే విశ్వాసం ఉంది. ఇంటింటికీ నల్లా నీళ్లు అందించే బృహత్తర పథకం మిషన్ భగీరథ విజయవంతం కావడం.. విద్యుత్ శాఖ సమర్థత మీదే ఆధారపడి ఉంది. హైదరాబాద్ లో మెట్రో రైలు తిరగాలన్నా, ఐటి పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేయాలన్నా, వ్యాపార-వాణిజ్య సంస్థల్లో కార్యకలాపాలు నిరాటంకంగా జరగాలన్నా,  దానికి నిరంతరాయ విద్యుత్ సరఫరాయే మూలాధారం. విద్యుత్ సరఫరా ఒక్కటి సరిగ్గా లేకుంటే దాని ప్రభావం ఇన్ని రంగాలపై ఖచ్చితంగా పడేది. అందుకే ఇవాళ తెలంగాణలో విద్యుత్ రంగం సాధించింది సాధారణ విజయం కాదు. తెలంగాణ దశను, దిశను నిర్దేశించే స్థాయిలో గొప్ప పాత్రను ఈ విజయం సాధించి పెట్టింది. తెలంగాణ ప్రగతితో విద్యుత్ తీగలు పెనవేసుకున్న సందర్భమిది.

విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు

అనతి కాలంలోనే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి, తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరాకు కారణమైన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.

 • విద్యుత్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు

 రాష్ట్రం ఏర్పడే నాటికి తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్‌ రంగాన్ని గట్టెక్కించి అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేలా తీర్చిదిద్దిన విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తొలుత తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించారు. తెలంగాణకు ఇంత గొప్ప ఖ్యాతిని సముపార్జించి పెట్టిన విద్యుత్‌ ఉద్యోగులకు అభినందన పూర్వకంగా జనవరి 2018 నుంచి వర్తించేలా మరో ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ప్రకటించారు.

 • విద్యుత్‌ శాఖ ఉద్యోగులందరికీ  27.5 శాతం ఫిట్‌మెంట్‌

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్‌ శాఖ ఉద్యోగులందరికీ 27.5 శాతం ఫిట్‌మెంట్‌ అలవెన్స్‌ మంజూరు చేస్తూ 2014 సెప్టెంబర్‌ 23న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జెన్‌కో, ట్రాన్స్ కో, డిస్కం ఉద్యోగులు దీనివల్ల లబ్ధిపొందారు.

 • విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ

విద్యుత్‌ శాఖలోని జెన్‌కో, ట్రాన్స్‌ కో, డిస్కం ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన వేతన సవరణ చేస్తూ ప్రభుత్వం 2014 డిసెంబర్ 2న నిర్ణయించింది. తదుపరి వేతన సవరణ 2018 లో వున్నది. 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు, 15 ఏళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు 2 ఇంక్రిమెంట్లు ఇచ్చింది. విద్యుత్‌ శాఖలోని పెన్షనర్లకు కూడా 30 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన పెన్షన్‌ ఇస్తున్నారు.  ప్రస్తుతం విద్యుత్‌ శాఖలో 26,894 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి రూ. 1233 కోట్ల జీతాలు చెల్లిస్తున్నారు.  తాజా ఫిట్‌మెంట్‌ ప్రకారం రూ. 500 కోట్ల అదనపు భారం పడుతుంది.  19,292 మంది పెన్షనర్లకు ప్రస్తుతం రూ. 583 కోట్ల మేర పెన్షన్లు ఇస్తున్నారు. సవరించినవేతనాల వల్ల ప్రభుత్వానికి రూ. 100 కోట్ల అదనపు భారం పడుతున్నది.

 • ఉద్యోగులకు 35 శాతం ఫిట్ మెంట్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే చారిత్రాత్మక తొలి ఘన విజయాన్ని అందించిన విద్యుత్ శాఖ ఉద్యోగులకు.. వారు ఊహించినదానికంటే ఎక్కువగా 35శాతం పీఆర్సీ (వేతన సవరణ) ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తేదీ 1.9.2018 రోజున ప్రగతి భవన్ లో వేల సంఖ్యలో వచ్చిన విద్యుత్ సంస్థల ఉద్యోగుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం వారితో మాట్లాడుతూ…  ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని,  జూనియర్ లైన్ మెన్ల (జేఎల్ఎం)లకు సంబంధించిన కోర్టు కేసులను ఉపసంహరించుకుంటే 600 మంది సర్వీసును రెగ్యులరైజ్ చేసే దిశగా ఆలోచిస్తామన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 1000 మంది బిల్ కలెక్టర్ల సమస్యలను సానుభూతితో పరిశీలించి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 6 వేల మందికి సంబంధించి ఈపీఎఫ్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. న్యాయపరమైన చిక్కులున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు అంశమై పరిష్కార మార్గాలను పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీని ప్రకటించిన నేపథ్యంలో అందుకు ఏర్పాటుచేసిన కమిటీ ఆధ్వర్యంలో 5 సెంప్టెంబర్, 2018న ఒప్పందం కుదిరింది. అందుకనుగుణంగా విద్యుత్ ఉద్యోగులకు నూతన వేతనాలు, అలవెన్స్‌, పింఛను తదితరాలకు సంబంధించి ఉత్తర్వులు జారీచేశారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న వర్క్‌ మెన్, నాన్‌వర్క్‌ మెన్ క్యాటగిరీల్లోని ఉద్యోగులకు మెడికల్ అలవెన్స్‌ను రూ.1000 నుంచి రూ.1350కి పెంచారు. సర్వీస్ వెయిటేజీ కింద ఐదేండ్ల వరకు సర్వీసు ఉన్నవారికి ఒక ఇంక్రిమెంట్ 5 నుంచి 15 ఏండ్ల సర్వీసు ఉన్నవారికి 2 ఇంక్రిమెంట్లు, 15 ఏండ్లకుపైన ఉన్నవారికి 3 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించారు.

 • విద్యుత్ ఉద్యోగుల డీఏ పెంపు

తెలంగాణలోని విద్యుత్‌ సంస్థల్లో (టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌) పనిచేసే దాదాపు 40 వేలమంది ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లకు కరవుభత్యాన్ని 4.02 శాతం పెంచారు. దీంతో ఇప్పటివరకు 8.866 శాతంగా ఉన్న డీఏ 12.886 శాతానికి పెరిగింది.ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు 3 మార్చి, 2020న జారీ చేశారు. ఈ నాలుగు సంస్థల నుంచి రిటైరైన పింఛనుదారులకు కూడా ఇదేస్థాయిలో డీఆర్‌ (డియర్‌నెస్‌ రిలీఫ్‌)ను పెంచుతున్నారు. ఇది 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 • ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్దీకరించిన ప్రభుత్వం 

విద్యుత్ రంగంలో రాష్ట్రం ఇంతటి ప్రగతి సాధించడం వెనుక.. విద్యుత్ శాఖలోని వివిధ సంస్థలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కృషి ఎంతో ఉంది. వారి కృషిని గుర్తించిన ప్రభుత్వం విద్యుత్ శాఖలోని ట్రాన్స్ కో, జెన్‌కో, డిస్కమ్‌ లలో పనిచేస్తున్న 1175 మంది కాంట్రాక్టు జూనియర్ లైన్ మెన్ల సర్వీసులను క్రమబద్దీకరించింది. అలాగే మరో  23,667 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిస్తామని 2016 డిసెంబర్ 1న ప్రభుత్వం ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం వీరి సర్వీసులను క్రమబద్దీకరిస్తూ 2017 జులై 29న సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కానీ, క్రమబద్దీకరణను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వీరికి ఉద్యోగ భద్రతతోపాటు మెరుగైన జీతభత్యాలు అందాయి.

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలైన ట్రాన్స్ కో,జెన్‌ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో ఔట్‌సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న 23,667 మంది తాత్కాలిక ఉద్యోగులకు (ఆర్టిజన్లకు) తేదీ 18 సెప్టెంబర్ 2018 రోజున ఉమ్మడి హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆర్టిజన్ల సర్వీసు క్రమబద్ధీకరణను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని విద్యుత్‌శాఖ తరఫున వాదించిన న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు. ప్రమాదపుటంచుల్లో ప్రతిదినం విధులు నిర్వర్తిస్తున్నారని తెలియజేయడంతోపాటు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వీరి సర్వీసులను క్రమబద్ధీకరించకపోవడంవల్ల కలుగుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తెచ్చారు. వారి సర్వీసును క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ మానవీయ దృక్పథాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. మెరుగైన విద్యుత్ సరఫరాకోసం కష్టపడుతున్న ఆర్టిజన్లు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగానే ఉంటున్నారని, ఉద్యోగ భద్రత లేదని వివరించారు. విద్యుత్ శాఖ వాదనలను సమర్థించిన హైకోర్టు.. క్రమబద్ధీకరణను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను రద్దుచేసింది. 4 విద్యుత్ కార్పొరేషన్లలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆబ్జార్‌ప్షన్ (స్వీకరించే) విధానంలో శాశ్వత (పర్మినెంట్) ఉద్యోగులుగా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ తీర్పును ప్రభుత్వం అమలుచేసి, వారి సర్వీసుల్ని క్రమబద్దీకరించడంతో ఆర్టిజన్లుగా ఉన్నవారందరూ శాశ్వత ఉద్యోగులుగా మారారు.

 • విద్యుత్ శాఖలో 34,808 మందికి ఉద్యోగాలు

2014 జూన్ 2 నుంచి అక్టోబర్ 2019 నాటికి జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల ద్వారా మొత్తం 34,808 మందికి ఉద్యోగాలు లభించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అతి ఎక్కువమందికి ఉద్యోగాలిచ్చిన శాఖగా విద్యుత్‌శాఖ గుర్తించబడింది. గత ఐదేండ్లలో విద్యుత్‌శాఖ ఏటా సగటున దాదాపు ఏడువేలమందికి ఉద్యోగాలు కల్పించింది. దేశంలో ఏ విద్యుత్‌శాఖలోనూ ఇంత పెద్దఎత్తున నియామకాలు జరగలేదు. మిగిలిన రాష్ట్రాల్లో వేతనాలకు 5% నుంచి 7% వరకు చెల్లిస్తుంటే.. తెలంగాణ విద్యుత్‌శాఖలో 9% వేతనాలకు వెచ్చిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్టోబర్ 2019 నాటికి 1,17,177 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తే.. ఇందులో విద్యుత్‌శాఖలో లభించిన ఉద్యోగాలే 29% ఉన్నాయి.

కొత్తగా 3,025 ఉద్యోగాలకు మూడు నోటిఫికేషన్లు

తెలంగాణ రాష్ట్ర దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) అక్టోబర్ 2019 దసరాకు భారీ ఉద్యోగమేళాను ప్రకటించింది. 3,025 పోస్టుల భారీ భర్తీకి ఎస్పీడీసీఎల్ మూడు నోటిఫికేషన్లు ఇచ్చింది. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (25), జూనియర్ లైన్‌మెన్ (2500), జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్‌ (500)కు సంబంధించి మూడు క్యాటగిరీల్లో మొత్తం 2,939 పోస్టులను ప్రకటించింది.

ఈ.ఆర్.సి.నియామకం

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈ.ఆర్.సి)ని 24 అక్టోబర్ 2019న  ప్రభుత్వం నియమించింది. ఈ.ఆర్.సి. చైర్మన్ గా తన్నీరు శ్రీరంగారావు, సాంకేతిక, ఆర్థిక విభాగం సభ్యులుగా మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యలను ప్రభుత్వం నియమించగా, వారు ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీరి పదవీకాలం ఐదేళ్లపాటు, లేదా 65 ఏళ్ల వయస్సు వరకు బాధ్యతలు నిర్వర్తించవచ్చు.

విద్యుత్ కార్మిక సంఘాలతో చర్చలు సఫలం : ఆందోళన కార్యక్రమాల విరమణ

 విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కార్మిక సంఘాల నాయకులతో విద్యుత్ సంస్థల అధికారులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో విద్యుత్ కార్మిక సంఘాలు అన్ని రకాల ఆందోళన కార్యక్రమాలను విరమించుకున్నట్లు ప్రకటించాయి. జెన్ కో చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో టి టఫ్, తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల నాయకులతో విడివిడిగా విద్యుత్ సౌధలో 19 అక్టోబర్ 2019న  చర్చలు జరిగాయి. పూర్తి సహృద్భావ వాతావరణలో జరిగిన ఈ చర్చల్లో కార్మిక సంఘాల నాయకులు లేవనెత్తిన ప్రతీ డిమాండును అధికారులు పరిశీలించారు. న్యాయమైన, పరిష్కరించదగిన, సాధ్యమైన అన్ని సమస్యలను పరిష్కరించడానికి అధికారులు అంగీకరించారు. ఆర్టిజన్ల సర్వీసు రూల్స్, 1999- 2004 మధ్య కాలంలో నియామకమైన కార్మికులు, ఉద్యోగుల జిపిఎఫ్ సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించారు. ఇతర డిమాండ్లను కూడా సానుకూలంగా పరిష్కరించడానికి అంగీకరించారు. దీంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. చర్చల సందర్భంగా కుదిరిన ఒప్పందాలపై విద్యుత్ అధికారులు, కార్మికులు సంతకాలు చేశారు.

 • విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ

విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు -2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రప్రభుత్వం కోరిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2 జూన్ 2020న ప్రధానమంత్రి నరేంద్రమోడికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఆందోళన తెలుపుతూ లేఖ రాశారు.

గరిష్ట డిమాండ్

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2021 ఫిబ్రవరి 27న విద్యుత్‌ గరిష్ట డిమాండ్‌ 13,452  మెగావాట్లకు చేరుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. విద్యుత్‌ వినియోగం ఇదే రీతిలో పెరిగినా విద్యుత్ అధికారులు అందుకు తగ్గ ప్రణాళికలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగపు అవసరాలకు తగ్గట్టుగా సరఫరాను కూడా  సమన్వయం చేస్తున్నారు.

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం – కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో వ్యవహరించారు. ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్నవారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరణించిన డీఈకి రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. దీనికి అదనంగా తెలంగాణ జెన్‌కో ఒక్కో కుటుంబానికి రూ.75 లక్షల చొప్పున సాయం అందివ్వాలని నిర్ణయించింది. దీనివల్ల డీఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు,  ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున సాయం అందుతుంది. మరణించిన వారి కుటుంబాల్లోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సాయం అందిందనే విషయంతో సంబంధం లేకుండా శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేక పరిస్థితిగా పరిగణనలోకి తీసుకొని ఈ సాయం ప్రకటించారు.

రాష్ట్రంలో విద్యుదీకరణ 100శాతం.. దేశంలోనే నంబర్ వన్ (20 నవంబర్ 2020)

విద్యుత్ ఉత్పత్తి, సామర్థ్యం పెంపు, సరఫరా, నిర్వహణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) సంస్థ సర్వేలో వెల్లడైంది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ ప్రతి ఇంటికీ కరంటు అందిస్తూ, 100శాతం విద్యుదీకరణ పూర్తి చేసుకోవడమేగాక, సరఫరాలోనూ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో మధ్యప్రదేశ్ (96.9శాతం), మూడోస్థానంలో కర్ణాటక (96.3శాతం), నాలుగోస్థానంలో రాజస్థాన్ (96శాతం), ఐదోస్థానంలో ఉత్తరప్రదేశ్ (93.2శాతం) నిలిచాయి. ఈ సంస్థ సర్వేలో భాగంగా 21 రాష్ట్రాల్లోని 1210 గ్రామాలకు చెందిన 15వేల కుటుంబాలను ప్రశ్నించారు. తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోని 500 ఇండ్లలో సర్వే నిర్వహించారు.

15 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ట్రాన్స్‌కోకు అనుసంధానం

సౌర విద్యు త్తు ప్లాంట్ల నిర్మాణంలో సింగరేణి పరుగులు పెడుతున్నది. రామగుండం-3 ఏరియాలో నిర్మాణంలో ఉన్న 50 మెగావాట్ల సింగరేణి సోలార్‌ పవర్‌ ప్లాంటు నుంచి 20 జనవరి 2021న మరో 15 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటును ట్రాన్స్‌ కోకు అనుసంధానం చేశారు. ( 2020 నవంబర్‌ 27న కూడా మరో 15 మెగావాట్ల ప్లాంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం జరిగింది.)  దీంతో తొలివిడుతలో భాగంగా మొత్తం 85 మెగావాట్ల అనుసంధానం అయింది. 2021 చివరికల్లా మొత్తం 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లను సిద్ధం కానుంది.

ఏడాదికి రూ.21 కోట్లు ఆదా..

సింగరేణి సంస్థ గృహ, యంత్ర అవసరాలకు కలిపి కంపెనీ నెలకు 2.60 కోట్ల యూనిట్ల విద్యుత్తును ట్రాన్స్‌ కో నుంచి కొనుగోలు చేస్తున్నది. యూనిట్‌ రేటు సగటు రూ.6 చొప్పున నెలకు రూ.15.60 కోట్లను విద్యుత్తు కోసం కంపెనీ ఖర్చు చేస్తున్నది. కాగా 50 మెగావాట్ల ప్లాంటు నుంచి పూర్తిస్థాయి సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తయితే నెలకు 72 లక్షల యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి ఖర్చు యూనిట్‌కు కేవలం రూ.3.54 మాత్రమే. ఈ లెక్కన నెలకు సగటున రూ.1.78 కోట్లు చొప్పున ఏడాదికి రూ.21 కోట్లు  సింగరేణికి ఆదా కానున్నాయి.

 విద్యుత్తు తలసరి వాడకం 2,071 యూనిట్లు

అభివృద్ధికి కొలమానమైన తలసరి విద్యుత్తు వినియోగంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నామని ట్రాన్స్‌ కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణలో తలసరి వినియోగం 2,071 యూనిట్లు (2019-20లో), జాతీయ సగటు 1,208 యూనిట్లేనని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ విద్యుత్ సౌధలో  26.1.2021న జాతీయ పతాకావిష్కరణ అనంతరం మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్తు వ్యవస్థ దేశానికే రోల్‌ మోడల్‌గా రూపుదిద్దుకున్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్తు ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్లు ఉండగా, ఆరున్నరేండ్లలో 16, 245 మెగావాట్లకు చేరుకోగా.. మరో 11,445 మెగావాట్ల సా మర్థ్యానికి సంబంధించి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థలను రూ.29,891 కోట్లతో పటిష్టపరిచామని తెలిపారు. స్వరాష్ట్రంలో  121 ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లు, 9,522 సర్క్యూట్‌ కిలోమీటర్ల పొడవైన సరఫరా లైన్లను ఏర్పా టు చేశామని, విద్యుత్తు సరఫరా సామర్థ్యం 14,973 ఎంవీయే నుంచి 36,903 ఎంవీయేకు చేర్చామని వివరించారు. విద్యుత్తు సరఫరా నష్టాలను అత్యంత కనిష్ఠానికి 2.65 శాతం తీసుకురావడంతోపాటు దేశంలోనే అత్యధిక విద్యుత్తు సరఫరా అవకాశం (99.99 శాతం) ఉన్న వ్యవస్థను రూపొందించామని పేర్కొన్నారు.

వరదల్లో రాత్రింబవళ్లూ శ్రమించిన విద్యుత్ సిబ్బంది :

-కుండపోత వర్షాలు కురుస్తూ, వరదలు పొంగిపొర్లుతున్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రింబవళ్లూ శ్రమించారు. ఎక్కడికక్కడ దెబ్బతిన్న ట్రాన్స్ ఫార్మర్లు, స్థంభాల మరమ్మతులు పనులు పూర్తి చేస్తూ, విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు.

దెబ్బతిన్న ట్రాన్స్ ఫార్మర్లు, స్థంభాలు – విద్యుత్ శాఖ పునరుద్ధరణ పనులు :

– రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల మొత్తం 1,627  – 33/11 కెవి సబ్ స్టేషన్లలో 15 సబ్ స్టేషన్లు దెబ్బతినగా, అన్నింటినీ మరమ్మతు చేసి, పునరుద్ధరించారు. (100 శాతం పనులు పూర్తయ్యాయి)

– మొత్తం 7,391 – 11 కేవీ ఫీడర్లలో 1,080 దెబ్బతినగా అన్నింటినీ మరమ్మతు చేశారు. 

(100 శాతం పనులు పూర్తయ్యాయి)

– రాష్ట్రంలో మొత్తం 4,36,886  డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు  ఉన్నాయి.

– గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, 1215 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతినగా, 1,207 ట్రాన్స్ ఫార్మర్లు మరమ్మతు చేసి, పునరుద్ధరించారు. ( 99.4  శాతం పనులు పూర్తయ్యాయి)

 మిగతా 8 ట్రాన్స్ ఫార్మర్లు నీటిలో మునగడంతో మరమ్మతు చేయలేకపోయారు.

– మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 1145 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతినగా, 386 మరమ్మతు చేశారు. మరో 759 మిగిలి ఉన్నవి. వీటిలో 586 ట్రాన్స్ ఫార్మర్లు నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట ప్రాంతాల్లో మూసీ నదిలో మునిగిపోయాయి.

– రాష్ట్రంలో మొత్తం 60 లక్షల కరెంటు స్థంభాలున్నాయి.

– గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,299 స్థంభాలు దెబ్బతినగా, అన్నింటినీ మరమ్మతు చేశారు. (  100  శాతం పనులు పూర్తయ్యాయి). 

– మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 5,335 స్థంభాలు దెబ్బతినగా, 3,249 మరమ్మతు చేశారు. మిగతా 2,086 స్థంభాల మరమ్మతు పనులు జరుగుతున్నాయి.

విద్యుత్ శాఖకు జరిగిన నష్టం :

ఎ) జీహెచ్ఎంసీ పరిధిలో రూ.3.40 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా

బి) గ్రామీణ ప్రాంతాల్లో రూ.10.84 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా

సి) టీఎస్ ఎస్.పి.డి.సి.ఎల్ సంస్థకు రూ.14.25 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా

విద్యుత్ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం

2013-14            : 7,778 మెగావాట్లు

2021        : 16,245 మెగావాట్లు

(పెరుగుదల 8,567 మెగావాట్లు, పెరిగిన శాతం 109)

తలసరి విద్యుత్ వినియోగం

2013-14            : 1,356 యూనిట్లు

2021        : 2,071 యూనిట్లు

(పెరుగుదల 715 యూనిట్లు, పెరిగిన శాతం 53)

సోలార్ విద్యుత్

2013-14            : 74 మెగావాట్లు

2021        : 3,670 మెగావాట్లు

(పెరుగుదల 3,596 మెగావాట్లు, పెరిగిన శాతం 4,859)

విండ్ పవర్

2013-14            : 0

2021        : 100.8 మెగావాట్లు

గరిష్ట డిమాండ్

2013-14            : 5,661 మెగావాట్లు

2020-21           : 13,452 మెగావాట్లు (27 ఫిబ్రవరి, 2021న ఉదయం 8.30 గం.)

విద్యుత్ వినియోగం

2013-14            : 39,866 మిలియన్ యూనిట్లు

2021        : 68,674 మిలియన్ యూనిట్లు

(పెరుగుదల 28,808 మిలియన్ యూనిట్లు, పెరిగిన శాతం 72)

మొత్తం విద్యుత్ కనెక్షన్లు

2013-14            : 1.11 కోట్లు

2021        : 1.59 కోట్లు

(పెరుగుదల 48 లక్షలు, పెరిగిన శాతం 43)

గృహ కనెక్షన్లు

2013-14            : 39,41,309

2021        : 1,15,82,598

(పెరుగుదల 76,41,289, పెరిగిన శాతం 193.87)

2013-14            : 10,40,956

వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు

2021        : 14,75,713

(పెరుగుదల 4,34,757, పెరిగిన శాతం 41.76)

పరిశ్రమల కనెక్షన్లు

2013-14            : 94,422

2021        : 1,09,671

(పెరుగుదల 15,249, పెరిగిన శాతం 16.14)

వ్యవసాయ కనెక్షన్లు

2013-14            : 19,02,754

2021        : 25,29,000

400 కెవి సబ్ స్టేషన్లు

2013-14            : 6

2021 : 15

(పెరుగుదల 9, పెరిగిన శాతం 150)

220 కెవి సబ్ స్టేషన్లు

2013-14            : 51

2021 : 93

(పెరుగుదల 42, పెరిగిన శాతం 82.35)

132 కెవి సబ్ స్టేషన్లు

2013-14            : 176

2021 : 240

(పెరుగుదల 64, పెరిగిన శాతం 36.36)

33 కెవి సబ్ స్టేషన్లు

2013-14            : 2,178

2021 : 3,088

(పెరుగుదల 910, పెరిగిన శాతం 41.78)

మొత్తం (ఎక్ట్ర్సా హైటెన్షన్)ఇ.హెచ్.టి. సబ్ స్టేషన్లు

2013-14            : 233 సర్క్యూట్ కి.మీ.

2021 : 354 సర్క్యూట్ కి.మీ.

(పెరుగుదల 121 సర్క్యూట్ కి.మీ., పెరిగిన శాతం 51.93)

మొత్తం ఇ.హెచ్.టి. లైన్ పొడవు

2013-14            : 16,379 సర్క్యూట్ కి.మీ.

2021 : 25,944  సర్క్యూట్ కి.మీ.

(పెరుగుదల 9,565 కి.మీ., పెరిగిన శాతం 58.39)

డిస్కమ్ పరిధిలోని లైన్ల పొడవు

2013-14            : 4.38 లక్షల కిలోమీటర్లు

2021 : 5.75 లక్షల కిలోమీటర్లు

(పెరుగుదల 1.37 లక్షల కి.మీ., పెరిగిన శాతం 31.27)

పవర్ ట్రాన్స్ ఫార్మర్లు

2013-14            : 3,272

2021 : 5,525

(పెరుగుదల 2,253, పెరిగిన శాతం 68.85)

డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ ఫార్మర్లు

2013-14            : 4.61 లక్షలు

2021 : 7.63 లక్షలు

(పెరుగుదల 3.02 లక్షలు , పెరిగిన శాతం 65.50)

ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ

2013-14            : 14,973 మెగావాట్లు

2021 : 36,902 మెగావాట్లు

(పెరుగుదల 21,929 మెగావాట్లు, పెరిగిన శాతం 146.45)

ట్రాన్స్ మిషన్ లాసెస్

2013-14            : 3.18 శాతం

2021 : 2.52 శాతం

(తగ్గుదల 0.66 శాతం)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లోటు విద్యుత్ నుంచి.. మిగులు విద్యుత్ దిశగా..

ట్రెండింగ్‌

Advertisement