e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home News Viral Video : ఏ షాంపూ వాడుతున్నావు తల్లీ… ఈ యువతి చేసిన పనికి నెటిజన్లు షాక్

Viral Video : ఏ షాంపూ వాడుతున్నావు తల్లీ… ఈ యువతి చేసిన పనికి నెటిజన్లు షాక్

జుట్టు గట్టిగా, ఒత్తుగా ఉండాలంటే ఏం చేయాలి. మంచి ఆయిల్ వాడాలి.. మంచి హెయిర్ షాంపూ వాడాలి అంటారా? మ‌రి ఈ యువ‌తి ఏం ఆయిల్ వాడుతుందో కానీ.. త‌న జుట్టు ఎంత దృఢంగా ఉందో చూడండి. మామూలు దృఢం కాదు. ఏకంగా త‌న జుట్టుతో పెద్ద వ్యాన్‌ను లాగేంత బ‌లం ఉంది త‌న జుట్టుకు. న‌మ్మ‌రా? అందుకే మీకోసం ఆ వీడియోను కూడా తీసుకొచ్చాం.

త‌న జుట్టునే ఓ తాడులా వాడి.. అంద‌రూ అవాక్క‌య్యేలా వ్యాన్‌ను లాగేసింది. ఇంత‌కీ ఈ స్టంట్ చేసింది ఎవ‌రు అంటారా? ఇంకెవ‌రు.. 34 ఏండ్ల అనాస్టాసియా సావికా. త‌ను స‌ర్క‌స్ ఆర్టిస్ట్. త‌న‌కు 20 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ఈ హెయిర్ హ్యాంగింగ్ అనే విద్య‌ను నేర్చుకుంద‌ట‌. తాజాగా సెంట్ర‌ల్ లండ‌న్‌లో రోడ్డు మీద అంద‌రూ చూస్తుండ‌గా పెట్రోల్ పంపు వ‌ర‌కు వ్యాన్‌ను లాక్కెళ్లింది.

- Advertisement -

ప్ర‌స్తుతం లండ‌న్‌లో పెట్రో ఉత్ప‌త్తుల కొర‌త కారణంగా చాలా పెట్రోల్ బంకులు.. మూసుకుంటున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ లేక కార్లు, ఇత‌ర వాహ‌నాలు రోడ్ల మీద‌నే ఆగిపోతున్నాయి. అలాగ‌ని.. ఆ వ్యాన్‌ను డీజిల్ అయిపోతే.. త‌ను త‌న హెయిర్‌తో లాగ‌లేదు కానీ.. వాటి కొర‌త మీద నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం కోసం త‌న‌తో అలా అక్క‌డి ప్ర‌జ‌లు స్టంట్ చేయించారు.

ఇంత‌కీ త‌న జుట్టు అంత దృఢంగా ఉండ‌టానికి త‌ను ఏం చేస్తుందో తెలుసా? రోజుకు రెండు బాటిల్స్ కండిష‌న‌ర్‌ను త‌న జుట్టుకు ప‌ట్టిస్తుంద‌ట‌. అలాగే.. త‌న జుట్టును 9 కోట్ల రూపాయ‌ల‌కు ఇన్సురెన్స్ కూడా చేయించుకుంద‌ట ఆ యువ‌తి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Anand Mahindra : వావ్.. ఏం చెప్పారు.. ఆనంద్ మ‌హీంద్ర షేర్ చేసిన ఈ వీడియో చూశారా?

Wine Factory : బయటపడ్డ 1500 ఏళ్ల నాటి వైన్ ఫ్యాక్ట‌రీ.. చూస్తే మ‌తి పోవాల్సిందే

Viral Video : ఒక క్వార్ట‌ర్ అంటే ఎంత‌?.. స్టూడెంట్ స‌మాధానానికి బిత్త‌ర‌పోయిన ప్రొఫెస‌ర్‌

Pic of the Day : ఈ ఫోటోను చూసి షాక్ అవుతున్న నెటిజ‌న్లు.. ఇంత‌కీ ఈ ఫోటోలో ఏముంది?

Flood Dining : వెరైటీ రెస్టారెంట్.. దీని గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement