న్యూయార్క్ : మనం ఊహించని ఎన్నో విషయాలను గిన్నీస్ బుక్ రికార్డులు ప్రజల ముందుకు తెస్తుంటాయి. ఈసారి మహిళల విభాగంలో ప్రపంచంలోనే అత్యంత భారీ నోరు కలిగిన 31 ఏండ్ల మహిళ సమంత రామ్స్డెల్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
ఆమె నోరు ఏకంగా 6.52 సెంటీమీటర్లు సాగుతూ సాధారణ మనిషి నోరు కంటే అత్యంత పెద్దదిగా నమోదైంది. సమంత టిక్‌టాక్‌లో షేర్ చేసే వీడియోల్లో ఆమె నోరు చాలా బిగ్గరగా కనిపించడం పాపులర్ కావడంతో గిన్నీస్ రికార్డుకెక్కాలనే ఐడియా వచ్చింది. ఆమె కనెక్టికట్‌లోని తన డెంటిస్ట్ కార్యాలయానికి వెళ్లగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ కోసం ఆమె నోరు పొడవు, వెడల్పును అధికారులు కొలిచారు. ఈ కొలతలను సరిపోల్చిన అధికారి కామరనో సమంత నోరు అత్యంత పెద్దదని తీర్మానించారు. సమంతను చిన్నప్పడు స్కూల్ ఫ్రెండ్స్ ఆమె నోరు పెద్దదని ఆటపట్టిస్తుండేవారు.