మహిళలకు చీరే అందం అంటారు. మహిళలు చీరకట్టుకుంటేనే అందంగా కనిపిస్తారు. అలాగే.. భారతీయ సంప్రదాయంలో చీరకట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే.. పెళ్లి తర్వాత మహిళలు ఎక్కువగా చీర కట్టుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. గుడికి వెళ్లినా.. పెళ్లికి వెళ్లినా.. చీర కట్టుకొని వెళ్తారు.
తాజాగా ఓ యువతి.. చీర కట్టుకొని స్టంట్స్ చేసింది. ఆ స్టంట్స్ చూస్తే మన మతి పోవాల్సిందే. చీరతోనే బ్యాక్‌ఫ్లిప్ చేసింది ఆ యువతి. ఆ యువతి చేసిన ఫీట్ చేసి అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. ఆ వీడియోను ఆ యువతి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఆ వీడియోకు ఇప్పటి వరకు 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయట. అంటే.. 3 కోట్ల వ్యూస్ అన్నమాట. ఆ వీడియోను చూసిన నెటిజన్లు అయితే.. ఆ యువతి చేసిన స్టంట్‌కు ఫిదా అయిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ యువతి చేసిన స్టంట్ వీడియోను చూసేయండి.