e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home ట్రెండింగ్‌ పట్టణాభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ భేష్‌

పట్టణాభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ భేష్‌

 • పీఎంస్వాన్‌ నిధిలో దేశంలోనే నంబర్‌ వన్‌
 • అమృత్‌ పథకం పనుల్లో అద్భుత పురోగతి
 • కేంద్ర పట్టణాభివృద్ధి కార్యదర్శి దుర్గాశంకర్‌

హైదరాబాద్‌, మార్చి 6 (నమస్తే తెలంగాణ ): పట్టణాభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నదని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌ మిశ్రా కొనియాడారు. పీఎం స్వాన్‌ నిధి అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని ప్రశంసించారు. ఈ విషయంలో తెలంగాణకు ఇతర ఏ రాష్ట్రం సమీపంలో కూడా లేదని తెలిపారు. శనివారం హైదరాబాద్‌ వచ్చిన ఆయన  బీఆర్‌కేఆర్‌ భవన్‌లో మున్సిపల్‌, పట్టణాభివృద్ధి పథకాల అమలుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అమృత్‌, స్మార్ట్‌సిటీ మిషన్‌, స్వచ్ఛభారత్‌ మిషన్‌, పీఎం స్వాన్‌నిధి, హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ తదితర పథకాల పురోగతిని సమీక్షించారు. 

పట్టణాభివృద్ధి శాఖలో చేపట్టిన పనులపై రాష్ట్ర మున్సిపల్‌ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నేషనల్‌ ఆర్బన్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ అమలులో సాధించిన పురోగతిని వివరించారు. పీఎం స్వాన్‌ నిధి, అమృత్‌ పథకాలను రాష్ట్రంలో విజయవంతంగా అమలుచేస్తున్నారని దుర్గాశంకర్‌ మిశ్రా ప్రశంసించారు. ‘ఎక్సలెంట్‌ పెర్ఫామెన్స్‌’ అని కితాబిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్‌ అండ్‌ బీ, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, కేంద్ర పట్టణాభివృద్ధి సంయుక్త కార్యదర్శి సంజయ్‌, సీడీఎంఏ ఎన్‌ సత్యనారాయణ, జలమండలి ఎండీ దానకిషోర్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఇదీ తెలంగాణ ప్రతిభ..

 • వీధి వ్యాపారులకు రుణాలిచ్చేందుకు ఉద్దేశించిన పీఎం స్వాన్‌ నిధి పథకానికి రాష్ట్రంలో 4.51లక్షల మంది దరఖాస్తు చేసుకొంటే 3.46 లక్షల మందికి రూ.346 కోట్ల రుణాలు ఇచ్చారు. మిగిలిన వారికి రుణాల జారీ ప్రక్రియ కొనసాగుతున్నది.
 • ఈ పథకంలో 10 లక్షల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న నగరాల జాబితాలో టాప్‌ 10 లో నాలుగు తెలంగాణకు చెందినవే ఉన్నాయి. అవి వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం.
 • 40 లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ మొదటిస్థానంలో ఉన్నది.
 • లక్ష జనాభాలోపు పట్టణాల్లో మొదటి పది తెలంగాణవే. ఈ పథకం అమలులో తెలంగాణకు దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం లేదు. 
 • అమృత్‌ పథకం అమలులో దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో ఉన్నది.  
 • సఫాయి సురక్ష మిత్ర చాలెంజ్‌ కార్యక్రమంలోనూ తెలంగాణ పాల్గొంటున్నది. ఈ పోటీ కోసం కార్పొరేషన్లు అత్యాధునిక యంత్రాలను కొనుగోలు చేస్తున్నాయి.
 • స్మార్ట్‌సిటీ పథకంలో రాష్ట్రంలోని కరీంనగర్‌, వరంగల్‌ నగరాలను ఎంపిక చేశారు. వీటిల్లో పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ రెండు నగరాలకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులకు అదనంగా మరో రూ.200 కోట్ల చొప్పున కేటాయించింది.

-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement