జూలియా సయీద్.. సిరియాకు చెందిన ఆర్టిస్ట్. తనకు పెయింటింగ్ అంటే ప్రాణం. కానీ.. తను కొన్ని అనివార్య కారణాల వల్ల తన ఇంటిని వదిలేయాల్సి వచ్చింది. దీంతో తనకు నచ్చిన పెయింటింగ్ వేయడం కోసం కలర్స్ కొనడానికి తన దగ్గర డబ్బులు లేవు. తనకు నచ్చిన పెయింటింగ్ కళను చంపుకోలేక.. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది జూలియా. కలర్స్ బదులు… మట్టిని ఉపయోగించి అద్భుతమైన పెయింటింగ్స్‌ను వేయడం ప్రారంభించింది జూలియా.
నాకు వేరే చాయిస్ లేదు. నాకు నచ్చిన కళను బతికించుకోవడం కోసం మట్టితో పెయింటింగ్ వేయడం ప్రారంభించా. ఇప్పుడు కలర్స్ ఉన్నా కూడా మట్టితో పెయింటింగ్ వేయడమే నాకు నచ్చుతోంది.. అని జూలియా చెప్పుకొచ్చింది.
మట్టితో అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన జూలియా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు సాయిల్ పెయింటింగ్ అక్కడ ట్రెండ్ అయిపోయింది. పిల్లలకు కూడా తను ఎలా మట్టితో పెయింటింగ్ వేయాలో నేర్పిస్తోంది జూలియా. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మట్టితో జూలియా వేసిన పెయింటింగ్ వీడియోను చూసేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Apple iPhone 12 | ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. రెండు నిర్మా సబ్బులు వచ్చాయి.. వీడియో
Viral Video : ఒక క్వార్టర్ అంటే ఎంత?.. స్టూడెంట్ సమాధానానికి బిత్తరపోయిన ప్రొఫెసర్
Pic of the Day : ఈ ఫోటోను చూసి షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఈ ఫోటోలో ఏముంది?
Flood Dining : వెరైటీ రెస్టారెంట్.. దీని గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే
ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?