ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళా మ్యూజిషియన్‌గా రిహన్నా చరిత్ర సృష్టించింది. రిహన్నా.. బార్బేడియన్ సింగర్, నటి, ఫ్యాషన్ డిజైర్, మ్యుజిషియన్‌గా ప్రసిద్ధి చెందారు. తన ఆస్తుల విలువ 1.7 బిలియన్ డాలర్లు కాగా.. మరో 1.4 బిలియన్ డాలర్లు.. తన ఫెంటీ బ్యూటీ కాస్మెటిక్ కంపెనీ నుంచి రానున్నాయి. అలాగే.. పాప్ స్టార్‌గా తనకు 270 మిలియన్ డాలర్లు సావేజ్ ఎక్స్ ఫెన్టీ కంపెనీ నుంచి రానున్నాయి. దీంతో తను ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళా మ్యుజిషియన్‌గా చరిత్రకెక్కారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన జాబితాలో తనకు మొదటి ప్లేస్ దక్కింది.
తను 2016 నుంచి ఎటువంటి ఆల్బమ్ విడుదల చేయకపోయినా.. తనే నెంబర్ వన్ గా నిలిచింది. తన చివరి ఆల్బమ్ యాంటీ. కేవలం తన యాక్టింగ్, సింగింగ్ మీదనే తను ఇన్ని వేల కోట్లు సంపాదించారు. ఇటీవల తను ఒక మ్యూజిక్ వీడియో కోసం షూటింగ్ చేస్తుండగా.. మీడియా కంటికి చిక్కారు.